twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాద్ షా’ పెట్టుబడి తిరిగొస్తుందా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'బాద్ షా' చిత్రం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోందనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా రూపొందుతోంది. ఇప్పటికే ఈచిత్రం బడ్జెట్ రూ. 55 కోట్లు మించిపోయిందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ రేంజిలో సినిమాకు ఖర్చు చేయడంపై టాలీవుడ్ ట్రేడ్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ప్రొడక్షన్ ఖర్చు సినిమా విడుదలకు ముందే రాబడుతోందని అంటున్నారు.

    ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని పెంచుతున్న ఈచిత్ర కథాంశాన్ని యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మలిచారు రచయితలు కోన వెంకట్, గోపీమోహన్. జూ ఎన్టీఆర్ ఈ చిత్రంలో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ ఖర్చుకు ఏ మాత్రం సంశయించకుండా తెరకెక్కిస్తున్నారు.

    సినిమాకు సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఇటలీ, స్విట్జర్లాండ్, బ్యాంకాక్ లలో జరిగింది. కొన్ని సీన్లను మాత్రం హైదరాబాద్ లో చిత్రీకరించారు. క్లైమాక్స్ కు సంబంధించిన కొన్సి యాక్షన్ సీక్వెన్స్ ఇటీవల నాగార్జున సాగర్ వద్ద చిత్రీకరించారు. క్లైమాక్స్ కోసం భారీ సెట్లు వేసారు. సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం క్లైమాక్స్ కోసమే వెచ్చించారట.

    తెలుగు సినిమా మార్కెట్‌ను పరిశీలిస్తున్న ట్రేడ్ నిపుణులు ఇంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం పెట్టుబడి తిరిగొచ్చి...మంచి లాభాల దిశగా బిజినెస్ చేస్తుందా? అనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సినీ సర్కాల్లో ప్రేక్షకుల్లో నెలకొన్న భారీ అంచనాలు, విడుదలకు ముందే ఈ సినిమా చేస్తున్న బిజినెస్‌ను బట్టి మాత్రం....సినిమా హిట్టయితే ఓ రేంజిలో కలెక్షన్లు రావడం, రికార్డులు బద్దలు కొట్టి లాభాలు తేవడం ఖాయమని మరికొందరంటున్నారు.

    ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన గుంటూరు రైట్స్ రూ. 4 కోట్లు, వెస్ట్ గోదావరి రైట్స్ రూ. 2.66 కోట్లకు అమ్ముడయి రికార్డు సృష్టించడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈనేపథ్యంలో సినిమా హిట్ వస్తే పలు బాక్సాఫీసు రికార్డులు బద్దలు కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మీ అభిప్రాయాలు ఏమిటో.....కామెంట్ బాక్స్ లో వెల్లడించండి.

    English summary
    Hyderabad: Junior NTR's upcoming movie Baadshah has been generating a new buzz everyday, ever since director Srinu Vaitla announced it. The latest news we hear about the film is that its budget has crossed Rs 55 crores. Some experts from Tollywood wonder whether it will be able to recover its production cost, while few others say that the movie would recover this amount in its pre-release business.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X