»   » ఇంకో ఆగడు అవుతుందా..! దూకుడు చూపిస్తాడా..!!? : మరోసారి పోలీ...స్ అవనున్న మహేష్

ఇంకో ఆగడు అవుతుందా..! దూకుడు చూపిస్తాడా..!!? : మరోసారి పోలీ...స్ అవనున్న మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"బ్రహ్మోత్సవం" గొడ‌వ అయిపోయింది. అభిమానులు కూడా ఈ సినిమా గురించి ఎప్పుడో మ‌రిచిపోయారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు తన తరువాతి సినిమా వ్యవహారాలను స్పీడప్ చేసాడు. మురగదాస్ తో నిర్మించే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా సాగుతున్నాయి.

ఈ సినిమాలో మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట మహేష్. ఇప్పటికే పోకిరి, దూకుడు, ఆగడు చిత్రాల్లో పోలీస్ గెటప్ లో ఇరగదీసిన రాజకుమారుడు... త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న మురుగదాస్ సినిమాలోనూ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. రా తరహా కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారి పాత్రలో మహేష్ కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది.

mahesh

సీబీఐ ఆఫీసరా... కాదా అన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరో వైపు మురుగదాస్ ఈ సినిమా షెడ్యూల్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడట. కొసమెరుపు ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా కన్ఫర్మ్ అయిందట. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే పెండింగ్ అట.. !

"రా" లాంటి కౌంటర్ ఇంటిలిజెన్స్ సంస్థ అధికారిగా మహేష్ కార్యాలయం కూడా వుంటుంది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మురుగదాస్ టీంలో చాలాకాలంగా పనిచేస్తున్న ఆర్ట్ డైరెక్టర్ సునీల్, మహేష్ కోసం అద్భుతమైన సెట్స్ డిజైన్ చేస్తున్నాడట.

ఇప్పటికే హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోస్ లో భారీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ సెట్ వేసే పనిలో ఉన్నారు. దాన్ని కూడా డిజైన్ చేస్తున్నారు. వన్ వీక్ ప్రొడక్షన్ డిజైన్ కు సంబంధించి ముంబాయిలో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ వెంటనే ఇక పనులు మరింత స్పీడందుకుంటాయి.

English summary
As the discussion comes to AR Murugadoss and Mahesh Babu combination for a new action flick set in Mumbai backdrop, reports flow in that Mahesh might do a police character again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu