»   » బాహుబలి2 రికార్డులను ట్యూబ్‌లైట్ తిరగరాస్తుందట.. కానీ సల్మాన్

బాహుబలి2 రికార్డులను ట్యూబ్‌లైట్ తిరగరాస్తుందట.. కానీ సల్మాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 సృష్టించిన రికార్డులే ప్రస్తుతం బాలీవుడ్‌కు మైలురాళ్లుగా నిలిచాయి. బాలీవుడ్ సూపర్ స్టార్లు సాధ్యం కాని రికార్డులను బాహుబలి నెలకొల్పింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ చిత్రం రంజాన్‌ పండుగ నేపథ్యంలో విడుదల కానున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ భారీ అంచనాలు పెంచింది. ఈ చిత్రం 1962లో జరిగిన ఇండో చైనా యుద్ద నేపథ్యంగా తెరకెక్కింది. చైనా హీరోయిన్ జూ, జూ, దివంగత నటుడు ఓం పురి నటించారు. ఈ చిత్రం బాహుబలి2 రికార్డులను తిరగరాస్తుందా అనే కోణంలో చర్చ జరుగుతున్నది.

బాహుబలి వర్సెస్ ట్యూబ్‌లైట్

బాహుబలి వర్సెస్ ట్యూబ్‌లైట్

ట్యూబ్‌లైట్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సల్మాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. బాహుబలి2 సినిమా రికార్డులను ట్యూబ్‌లైట్ అధిగమిస్తుందా అనేది అనుమానమే. ఎందుకంటే బాహుబలి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొన్నది. ఓ డబ్బింగ్ సినిమా అనే విషయాన్ని కూడా మరిచి ప్రేక్షకులు ఆదరించారు. దాంతో రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి అని అన్నారు.

ఆ సత్తా ఉంది.. వివేక్ ఒబెరాయ్

ఆ సత్తా ఉంది.. వివేక్ ఒబెరాయ్

ఇదిలా ఉండగా, బాలీవుడ్‌లో సల్మాన్‌కు బద్ధశత్రువుగా భావించే వివేక్ ఒబెరాయ్ కూడా ట్యూబ్‌లైట్ విజయం సాధించాలని ఆక్షాంక్షిచడం గమనార్హం. బాహుబలి రికార్డులను తుడిచిపెట్టి ట్యూబ్‌లైట్ సూపర్ హిట్ కావాలని కోరుకొంటున్నాను. భారతీయ సినిమా చరిత్రను తిరగరాసే సత్తా ట్యూబ్‌లైట్‌కు ఉంది. ట్యూబ్ లైట్ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకొంటూ చిత్ర యూనిట్‌కు అడ్వాన్సుగా కంగ్రాట్స్ చెప్తున్నాను అని వివేక్ పేర్కొనడం విశేషం.

 మానసిక పరిపక్వత లేని యువకుడిగా..

మానసిక పరిపక్వత లేని యువకుడిగా..

ట్యూబ్‌లైట్ చిత్రం ఓ భావోద్వేగమైన కథతో తెరకెక్కింది. సల్మాన్ ఖాన్ మానసిక పరిపక్వత లేని వ్యక్తిగా నటించాడు. సైన్యంలో అన్నను కోల్పోయిన తమ్ముడిగా కనిపించనున్నారు. భారత్, చైనా యుద్ద నేపథ్యంగా చాలా ఉద్వేగభరితంగా ఉంటుందనే బాలీవుడ్‌లో టాక్.

జూన్ 23న రిలీజ్

జూన్ 23న రిలీజ్

ట్యూబ్ లైట్ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్, భజ్‌రంగీ భాయ్‌జాన్ చిత్రాలకు కబీర్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. తాజాగా ట్యూబ్‌లైట్‌ను రూపొందించారు. ఈ చిత్రం జూన్ 23న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

English summary
Ever since the trailer of Salman Khan's Tubelight released, a lot has been said about how the film would probably break Baahubali 2's records at the box office. Many are of the opinion that Tubelight will be able to pull this off as Salman has a huge fan following. But Salman said, "I doubt that Tubelight will break Baahubali 2's record
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu