Just In
- 8 hrs ago
చిరంజీవి సినిమా ఫస్ట్‌షోకు వెళ్లా.. స్టెప్పులు డ్యాన్సులు చేశా.. మంత్రి అజయ్ కుమార్
- 8 hrs ago
రైతు బిడ్డ రైతే కావాలి.. ఆ రోజు వస్తుంది.. వ్యవసాయం లాభసాటిగా.. ఆవేశంగా ప్రసంగించిన చిరంజీవి
- 8 hrs ago
చిరంజీవి వారసత్వం ఎవ్వరికీ దక్కదు... ఆ స్థాయి ఆ ఒక్కడికే.. శర్వానంద్ షాకింగ్ కామెంట్స్
- 9 hrs ago
శర్వానంద్ నా బిడ్డలాంటి వాడు.. రాంచరణ్ ఫోన్ చేసి.. శ్రీకారం ఫంక్షన్లో చిరంజీవి ఎమోషనల్
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- News
మోడీపై దీదీ గుస్సా.. దేశం పేరు కూడా మారుస్తారని ధ్వజం
- Finance
భారీగా పడిపోయిన బంగారం ధరలు, 10 గ్రాములు రూ.44,200 మాత్రమే!
- Sports
India vs England: 'సాహా అత్యుత్తమ కీపర్.. కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలి'
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ టాక్: సినిమా ఎలా ఉందో తెలుసా..?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన 'వరల్డ్ ఫేమస్ లవర్' నేడు (ఫిబ్రవరి 14న) విడుదలైంది. గత సినిమా 'డియర్ కామ్రేడ్' తో నిరాశ పేర్చిన విజయ్.. ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన ఈ ప్రేమ కథా చిత్రం ఎలా ఉంది? సన్నివేశాలు ఎలా సాగిపోయాయి? ఆ వివరాలు చూద్దామా..

అందాల భామలతో విజయ్ దేవరకొండ.. నిడివి ఎంతంటే!
ఈ సినిమాలో నలుగురు అందాల భామలతో విజయ్ దేవరకొండ రొమాన్స్ చేయడం, ఆ తాలూకు వీడియోలు ప్రమోషన్స్‌లో బాగా వైరల్ కావడం కారణంగా సినిమాకు భారీ హైప్ చేకూరింది. దీంతో ఓ రేంజ్ అంచలన నడుమ విడుదలైన 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ 156 నిమిషాల నిడివితో థియేటర్స్‌లో ప్రదర్శితమవుతోంది.

హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్..
చిత్రంలో గౌతమ్ రోల్‌లో అదేవిధంగా శీనయ్యగా విజయ్ దేవరకొండ నటించగా యామినిగా రాశి ఖన్నా, సువర్ణగా ఐశ్వర్య రాజేష్, స్మితగా క్యాథెరిన్ ట్రెసా, ఇజా గా ఇజబెల్లె లైట్ కనిపించారు. వీళ్లందరి క్యారెక్టర్స్ ఎలివేట్ చేస్తూ చక్కగా ఎమోషనల్ పాయింట్స్ టచ్ చేస్తూ సినిమా రూపొందించాడు డైరెక్టర్ క్రాంతి మాధవ్.

యామిని, గౌతమ్ రేలషన్‌షిప్.. బ్రేకప్
యామిని (రాశి ఖన్నా), గౌతమ్ (విజయ్ దేవరకొండ)ల జీవితాలకు సంబంధించిన సన్నివేశాలతో స్టార్ట్ అయిన 'వరల్డ్ ఫేమస్ లవర్' మెల్లగా కథలోకి ఎంటరైంది. యామిని, గౌతమ్ రేలషన్‌షిప్ ఎలా ఉందో చెప్పే సీన్స్, అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్, ఆ తర్వాత వీళ్ళ బ్రేకప్ సన్నివేశాలు వచ్చాయి.

శీనయ్య భార్యగా సువర్ణ.. బొగ్గు గనుల్లో సాంగ్
ఆ తరువాత గౌతమ్ ఫ్రెండ్ గా ప్రియదర్శి ఎంటర్ కావడం జరిగింది. ఆ వెంటనే తెలంగాణాకు చెందిన శీనయ్య (విజయ్ దేవరకొండ) పాత్ర పరిచయం కావడంతో కథలో ట్రాక్ చేంజ్ అయింది. శీనయ్య భార్యగా సువర్ణ (ఐశ్వర్య రాజేష్) పరిచయం కావడం, స్మితగా మరో హీరోయిన్ క్యాథెరిన్ ఎంటర్ కావడం.. కోల్ మైనింగ్ సీన్స్ చూపించారు. ఈ మధ్యలోనే బొగ్గు గనుల్లో సాంగ్ వచ్చింది.

ఎమోషనల్ సీన్స్.. విరామం బోర్డు
ఓ వైపు స్మిత, శీనయ్య మరోవైపు సువర్ణ, శీనయ్యలకు సంబంధించిన కీలక సన్నివేశాలు చూపుతూ కథను ముందుకు నడిపారు. ఇక ఆ వెంటనే సువర్ణ, శీనయ్య ఎమోషనల్ సీన్స్ రావడం.. మళ్ళీ గౌతమ్, యామిని ట్రాక్ రావడం జరిగింది. వీళ్లిద్దరితో చిత్రీకరించిన సన్నివేశంతోనే విరామం బోర్డు వేశారు.

కాలేజీ రోజులు.. గౌతమ్, ఇజా లవ్ ట్రాక్
అలా విరామం తీసుకొని ఇలా రాగానే గౌతమ్, యామిని ఫ్లాష్ బ్యాక్, కాలేజీ రోజులు చూపించారు. ఆ తరువాత స్టోరీ పారిస్ వెళ్ళింది. అప్పుడే మరో హీరోయిన్ ఇజబెల్లా ఎయిర్ హోస్టర్ గా ఎంటర్ అయింది. ఇక గౌతమ్, ఇజా లవ్ ట్రాక్ చూపిస్తూ 'మై లవ్ సాంగ్' తో మైమరిపించారు.


ఎమోషన్‌తో కూడిన క్లైమాక్స్.. ముగింపు
ఆ తరువాత కథానుసారం జరిగే త్యాగానికి సంబంధించి పలు సన్నివేశాలు చూపిస్తూ.. మళ్ళీ గౌతమ్, యామిని ట్రాక్ లోకి తీసుకొచ్చారు. కొన్ని సీన్స్ వచ్చాక అప్పుడు సినిమాను ప్రెసెంట్ మోడ్ లోకి తీసుకొచ్చారు. భారీ యాక్షన్ సన్నివేశం, ఎమోషన్ తో కూడిన క్లైమాక్స్ సీన్స్‌తో అలా అలా కథ ముగిసింది. ఇంకా పూర్తి వివరాలు కొద్దిసేపట్లో అందించబోయే మా రివ్యూలో చూడండి.