Just In
- 10 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 10 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 11 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 12 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- News
జో బైడెన్ రాకముందే డొనాల్ ట్రంప్ జంప్: కరోనా, నిరుద్యోగితలే అధ్యక్ష భవనానికి దూరం నెట్టాయి
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రిలీజ్ రివ్యూ: క్రేజీ పాయింట్‌తొో.. ఎమోషనల్‌గా
అర్జున్ రెడ్డితో స్టార్ హీరో రేంజ్‌ను సంపాదించుకొన్న యువ హీరో విజయ్ దేవరకొండ ఆ తర్వాత వరుస విజయాలు సొంతం చేసుకొన్నారు. అయితే గత చిత్రాలు అంచనాలను చేరుకోలేకపోయాయి. అయితే తన కెరీర్‌లో 9వ చిత్రంగా రూపొందిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అంశాలు మీ కోసం..

ఓ క్రేజీ పాయింట్‌తో
ఫీల్ గుడ్ దర్శకుడు క్రాంతి మాధవ్ ఓ క్రేజీ పాయింట్‌తో సినిమాను తెరకెక్కించారు. తెలంగాణ ప్రాంత నేపథ్యంతోపాటు యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాగా ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నించారు. కథ డిమాండ్ చేయడంతో తెలంగాణలోని ఇల్లందు, ఫ్రాన్స్‌లో ఈ సినిమాను షూట్ చేశారు.

రొమాంటిక్ ప్రేమకథగా
రొమాంటిక్ ప్రేమకథగా రూపొందిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉండటంతో మూవీ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా మారింది. విజయ్ పక్కన రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరీన్ త్రెసా, ఇజబెల్లే లీటే నటించారు.

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై
ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను కేఏ వల్లభ, కేఎస్ రామారావు నిర్మించారు. ఫీల్ గుడ్ స్టోరికి అవసరమైన హంగులు కల్పించడం, సినిమాను రిచ్‌గా రూపొందించడంలో కాంప్రమైజ్ కాలేదని చిత్ర యూనిట్ వెల్లడించింది.

సిక్స్ కొట్టడానికే ప్రయత్నిస్తా
ప్రతీ సినిమా విషయంలో నేను సిక్స్ కొట్టడానికే ప్రయత్నిస్తాను. బాల్ అనే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను సిక్స్‌గా మలిచేందుకు గాల్లోకి లేపాను. రిలీజ్ తర్వాత బాల్ ఏ రేంజ్‌లో దూసుకెళ్తుందో వేచి చూద్దాం అని విజయ్ దేవరకొండ సినిమాపై అంచనాలు పెంచారు.

యూఎస్‌లో గ్రాండ్ రిలీజ్
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా యూఎస్‌లో గ్రాండ్ రిలీజ్ అవుతున్నది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యధికంగా 180 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. యూఎస్ ప్రీమియర్లు రొటీన్ కాస్త ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి.

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో
వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో విజయ్ దేవరకొండ, రాశీఖన్నా గౌతమ్, యామిని పాత్రల్లో అవార్డు విన్నింగ్ నటనను ప్రదర్శించారని టాక్ వినిపించింది. సినిమాలో వారి పాత్రలను క్రాంతి మాధవ్ అద్భుతంగా తెరకెక్కించారని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

ఎమోషనల్‌గా సాగే
కథ చాలా ఎమోషనల్‌గా సాగే వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో కొత్తగూడెం ఎపిసోడ్ సినిమా హైలెట్లలో ఒకటని చెప్పకొంటున్నారు. విజయ్ దేవరకొండ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హెయిర్ స్టయిల్‌ను మెయింటెన్ చేశారు. మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను అలరించేలా గెటప్స్ ఉంటాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంపై
వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోవడంతో ఓ రేంజ్‌లో బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.30 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది. మినిమమ్ గ్యారెంటీ టాక్ రావడం, యూత్‌లో విజయ్ దేవరకొండకు విపరీతమైన క్రేజ్ ఉండటం ఈ సినిమాకు బిజినెస్ బాగా కావడానికి కారణమైందంటున్నారు.