»   » గోపీచంద్ ‘పంతం’... అసలు రిలీజ్ డేట్ ఇదీ!

గోపీచంద్ ‘పంతం’... అసలు రిలీజ్ డేట్ ఇదీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్లో స్టార్‌ గోపీచంద్ ప్రస్తుతం 'పంతం' అనే చిత్రంలో నటిస్తున్నారు. 'ఫర్ ఎ కాజ్' అనేది సబ్ టైటిల్. గతంలో పవర్, జై లవకుశ చిత్రాలకు రచయితగా పని చేసిన కె చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడు పరిచయం అవుతున్నాడు. గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరయిన్. ఇందులో ఆమె స్కూల్ టీచర్ పాత్రలో కనిపించబోతోంది.

కెరీర్లో 25వ చిత్రం కావడంతో గోపీచంద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సినిమాను జులై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Pantham

ఈ చిత్రానికి సంబంధించి గతంలో రకరకాల రిలీజ్ డేట్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే అందులో నిజం లేదని నిర్మాత ప్రకటించారు. ఈ చిత్రంలో పృధ్వి, జయప్రకాష్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్లో కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంగీతం: గోపీ సుందర్
కెమెరా: ప్రసాద్ మూరెళ్ల
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
మాటలు: రమేష్ రెడ్డి
స్క్రీన్ ప్లే: కె చక్రవర్తి, బాబీ(కెఎస్ రవీంద్ర)
కో డైరెక్టర్: బెల్లంకొండ సత్యం బాబు
ప్రొడ్యూసర్: కెకె రాధా మోహన్
స్టోరీ, డైరెక్షన్: కె. చక్రవర్తి( చక్రి)

English summary
Actor Gopichand’s most awaited film Pantham, that has the tagline ‘For a Cause’, producer by K.K. Radhamohan on his Sri Satya Sai Arts banner is set to release on July 5. Directed by K. Chakravarthy, who wrote the screenplay for films like Balupu, Power and Jai Lava Kusa, the film is Gopichand’s landmark 25th movie, and so the producers have gone all out to ensure it will be special for him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X