»   » బాలయ్యది చరిత్ర, చిరంజీవిది జెరాక్స్ కాపీ... కామెంట్స్ పై ఫ్యాన్స్ మండిపాటు

బాలయ్యది చరిత్ర, చిరంజీవిది జెరాక్స్ కాపీ... కామెంట్స్ పై ఫ్యాన్స్ మండిపాటు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'చిరంజీవిగారి 150వ సినిమా నేనే చేయవలసింది. వాళ్లు కోరిన మీదట గ్రాండి యర్‌గా ఓ కథ రెడీ చేశాను. కానీ, చిరంజీవిగారు 'కత్తి' రీమేక్ చేయాలనుకున్నారు. నా కథ కంటే 'కత్తి' బాగుందనుకున్నారు. ఆ సినిమానే చేయాలనుకున్నారు అంటూ తన మనస్సులో ఆవేదనను ప్రముఖ దినపత్రిక సాక్షిగా బయిటపెట్టారు ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ.

చిరంజీవితో 'ఇంద్ర', అల్లు అర్జున్ తో 'గంగోత్రి' , బద్రినాధ్, బాలకృష్ణతో 'నరసింహ నాయుడు' లాంటి ఎన్నో భారీ సినిమాలకు కథలను అందించిన చిన్ని కృష్ణ ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి 150వ సినిమా 'కత్తిలాంటోడు' పై సంచలన వ్యాఖ్యలు చేసి అందరికీ షాక్ ఇచ్చారు.

మొన్నటికి మొన్న చిరంజీవితో ఖైదీ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన కోదండ రామిరెడ్డి ...ఆన మీద ఎవరు ఊహించని రీతిలో...ఇప్పుడు ఆయన సమాజానికి సందేశాన్ని ఇచ్చే సినిమాలు చేస్తే ఎవరూ చూడటంటూ... మాట్లాడి అందరికి షాక్ ఇస్తే. ఇప్పుడు ఆ లిస్ట్ లో చిరు సినిమా మీద వ్యంగ్య బాణాలు వేసి వార్తల్లో నిలిచాడు రచయిత చిన్నికృష్ణ.

చిరంజీవి గ్యాప్ తర్వాత తీస్తున్న సినిమా గురించి ఓ రచయిత ఇలా మాట్లాడటం పట్ల చిరంు అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ విషయమై ఓ రేంజిలో చర్చ జరుగుతోంది.

చిన్నికృష్ణ ఇంకేమన్నారు క్రింద స్లైడ్ షోలో...

క్లారిటీ ఉంది..

క్లారిటీ ఉంది..

నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పిన మేటర్ ఇంత వరకూ ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చెప్పలేదు. అది నా నమ్మకం. చిరంజీవిగారు నమ్మాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటివరకూ నా జడ్జ్‌మెంట్ ఫ్లాప్ కాలేదు. నేను డెలివర్ చేసిన ఏ గూడ్స్ (సినిమాలు)నీ ప్రేక్షకులు రిజెక్ట్ చేయలేదు. ఆ క్లారిటీ నాకుంది

వాళ్లు దేముడితో సమానం

వాళ్లు దేముడితో సమానం

నేను చెప్పింది చిరంజీవి అంగీకరించలేదని చెడుగా మాట్లాడితే నేను క్రియేటర్‌నే కాదు. అది చిరంజీవిగారి వ్యక్తిగత నిర్ణయం. దట్సాల్. సినిమా వాళ్లందరూ కష్టపడేది ప్రేక్షకుడి కోసమే. నూన్ షో తర్వాత ప్రేక్షకుడు డిసైడ్ చేసే వరకూ ఎవరూ మాస్టర్స్ కాదు. రిలీజ్‌కి ముందే రిజల్ట్ చెప్పేమాస్టర్స్ ఎవరైనా ఉంటే దేవుడితో సమానం. తమిళ 'కత్తి' చూశాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది.

అదే నమ్ముతా

అదే నమ్ముతా

గత జన్మలో మినిమమ్ వంద గుళ్లు కట్టిస్తే.. ఈ జన్మలో ఆర్టిస్ట్‌లు అవుతారని నమ్ముతా. దటీజ్ స్టార్‌డమ్.

జెరాక్స్ కాపీ,పోల్చద్దు

జెరాక్స్ కాపీ,పోల్చద్దు

‘‘చిరంజీవి గారు చేస్తున్నది రీమేక్. ఆల్ మోస్ట్ జిరాక్స్ కాపీ లాంటిది. ఇక బాలయ్యది చరిత్ర గురించి చెప్పే సినిమా. రెండూ స్ట్రెయిట్ సినిమాలైతే మాట్లాడొచ్చు. పోల్చవచ్చు. కాబట్టి దీని గురించి చెప్పేదేమీ లేదు'' అన్నాడు చిన్నికృష్ణ.

ఖాళీగాలేను

ఖాళీగాలేను

ఇక గత కొన్నేళ్లుగా నేనేమీ ఖాళీగా లేను. అమీర్ ఖాన్ గారితో చేయాలన్నది నా జీవితాశయం. అమీర్ ఖాన్ కోసం స్క్రిప్టు చేస్తున్నా

వచ్చే నెలలోనే

వచ్చే నెలలోనే

‘జీనియస్' తర్వాత ఆయన కోసం స్క్రిప్టు రాయడం మొదలుపెడితే మూడేళ్లు పట్టింది. గత ఏడాదే పని పూర్తయింది. హిందీ వాళ్లతో డైలాగులు కూడా రాయించాను. వచ్చే నెలలోనే అమీర్ ఖాన్ కు సబ్మిట్ చేస్తా'' అని చెప్పాడు చిన్నికృష్ణ.

యంగ్ హీరోలకు మేం నచ్చం

యంగ్ హీరోలకు మేం నచ్చం

నేటి తరం యంగ్ హీరోలు అంతా యంగ్ రైటర్స్ వ్రాసిన స్క్రిప్ట్ లకు ఇష్టపడుతున్నారని వారికి యంగ్ డైరెక్టర్స్ యంగ్ హీరోయిన్స్ కావాల్సిన నేపధ్యంలో తన లాంటి సీనియర్ రైటర్స కు స్థానం ఎక్కడా ? అన్నారు.

గంగిరెద్దు వేషం వెయ్యలేను

గంగిరెద్దు వేషం వెయ్యలేను

కొందరు బిచ్చగాళ్లు గంగిరెద్దులతో అడుక్కోవడానికి వస్తుంటారు. చిన్నికృష్ణ ఆల్రెడీ ఓ గంగిరెద్దులా అడుక్కుని, ఓ హిట్ ఇచ్చాడని తెలుసు కదా. నాకు మళ్లీ గంగిరెద్దు వేషం ఎందుకు? నేనిక్కడే (హైదరాబాద్) ఉంటున్నానని తెలుసు.

ఖాళీ పడలేదు..

ఖాళీ పడలేదు..

మధ్య మధ్యలో మీ కెరీర్‌లో వచ్చే బ్రేక్స్‌కి కారణం ఏంటి.. ఎవరూ అవకాశాలు ఇవ్వడంలేదా? అంటే... అవకాశాలు రాలేదు అనేది లేదు. ప్రతి నెలా ఎవరో ఒక నిర్మాత వస్తారు. ఇంతకు ముందు పని చేసిన హీరోల నుంచి పిలుపులు వస్తూనే ఉన్నాయి.

చరణ్ డెబ్యూ మూవి కోసం..

చరణ్ డెబ్యూ మూవి కోసం..

రామ్‌చరణ్ డెబ్యూ మూవీ కోసం 'పూరీ జగన్నాథ్' అని కథ రాశాను. క్లైమాక్స్ అందరికీ బాగా నచ్చింది. అప్పుడు చిన్నికృష్ణ రైటర్, పూరీ జగన్నాథ్ డెరైక్టర్. రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూరీగారు తెలుగులో వన్నాఫ్ ది రెస్పెక్టబుల్ రైటర్స్. వెరీ గుడ్ ఫిలాసఫికల్ రైటర్. కానీ..

అదే కరక్టు

అదే కరక్టు

నా కథ ఓకే చేసిన తర్వాత 'పోకిరి' అనే సినిమా విడుదలై, ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. సో, అతనితో వెళ్లడం కరెక్టే. నా కొడుకు హీరో అవుతున్నా.. నేనూ అదే నిర్ణయం తీసుకుంటా. ఓ రచయిత కథ కంటే.. మహేశ్‌బాబుతో పెద్ద హిట్టిచ్చిన ఓ రైటర్ కమ్ డెరైక్టర్‌తో వెళ్లడంలో తప్పు లేదు.

అల్లు అరవింద్ గురించి

అల్లు అరవింద్ గురించి

అల్లు అరవింద్ గారి హృదయంలో నాకు సెపరేట్ స్థానం. మా పాప ఫైనలియర్ అప్పుడు బన్నీ హీరోగా నాతో మళ్లీ సినిమా చేస్తా అన్నారు. అన్నారు కదా అని కథ రాసేసుకుని, తెల్లారేసరికల్లా వాళ్ల గుమ్మం ముందు నిలబడలేం కదా. అభిమానంతో అంటారు. అన్నారు కదా అని వెంటాడేస్తే ఎలా?

భజన చేతకాదు

భజన చేతకాదు

నా కథలో యాక్ట్ చేసిన హీరోలతో అందరితోనూ నాకు మంచి అనుబంధమే ఉంది. కాకపోతే నేను 'భజన సంఘం'లో లేను. మామూలుగా ఏ ఇండస్ట్రీలో అయినా భజన సంఘం ఉంటుంది. నేనా ట్రూప్‌కి చెందిన వ్యక్తిని కాదు. నా దగ్గర చిడతలు లేవు.

తారా చౌదరి గురించి...

తారా చౌదరి గురించి...

పాపం.. ఆ అమ్మాయి కొంచెం మెంటల్లీ ఇన్‌బ్యాలెన్స్. ఆ తర్వాత చాలాసార్లు అరెస్ట్ అయ్యింది. ఓ బాధ్యత గల వ్యక్తిగా, ఓ సోదరుడిగా ఆ అమ్మాయికి మ్యారేజ్ అయి లైఫ్‌లో సెటిల్ కావాలని కోరుకుంటున్నాను. నాకా అమ్మాయి మీద కోపం లేదు. అన్నాడు చిన్నికృష్ణ.

నెగిటివ్ అంటేనే ఇష్టం..

నెగిటివ్ అంటేనే ఇష్టం..

'చిన్నికృష్ణ 200 మందికి అన్నదానం చేశాడు' అంటే, దాని గురించి రాయరు, చూపించరు. 'చిన్నికృష్ణ ఓ అమ్మాయిని రేప్ చేయబోయాడు. ఆ అమ్మా యి తప్పించుకుంది. ఓ సీసీ కెమేరాలో దొరికాడు' అంటే రేటింగ్ ఎంత ఉంటుందో చూడండి. మీడియాలో నెగిటివ్ ఎనర్జీ ఈజ్ మోర్ పవర్‌ఫుల్ దేన్ పాజిటివ్ ఎనర్జీ

English summary
In Chinni Krishna interview published in Sakshi daily Sunday, Chinnikrishna stated that "Chiranjeevi's 150th is just a xerox copy of a Tamil film, so there is nothing to talk about it".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu