»   » చలపతి ఆ భాషేంటి.. ఛీ అనిపిస్తుంది.. నాగార్జునగారూ! ఎలిమినేట్ చేయండి..: రా.జో. శాస్త్రి

చలపతి ఆ భాషేంటి.. ఛీ అనిపిస్తుంది.. నాగార్జునగారూ! ఎలిమినేట్ చేయండి..: రా.జో. శాస్త్రి

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మహిళలపై సీనియర్ నటుడు చలపతిరావు చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, సినీ విమర్శకుడు, దర్శకుడు మహేశ్ కత్తి, పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు. చలపతిరావు నోటి దురుసుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నారీలోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఊపందుకుకొన్నది. ఆడవాళ్లు హానికరం అనే ప్రశ్నకు చలపతిరావు స్పందిస్తూ.. హానీకరం ఏమో తెలియదు కానీ మహిళలు పక్కలో మాత్రం పనికి వస్తారు అని చలపతిరావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు కొందరు చప్పట్లు కొడుతూ ఆనందించారు. వేదికపై ఉన్న యాంకర్ రవి సూపర్ సమాధానం ఇచ్చారు అని ఆయన వ్యాఖ్యలకు మద్దతు పలికారు. ఈ వివాదంపై చలపతిరావు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.

  చలపతిరావు ఇదైనా గుర్తుకు రాలేదా?

  చలపతిరావు ఇదైనా గుర్తుకు రాలేదా?

  మహిళలు ఎవరెస్టునెక్కారు.. రాజ్యాలనేలుతున్నారు.. .సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు.. వేదపఠనం.. మంగళవాద్యావాదనం.. బస్ కండక్టర్.. పైలట్.. వాళ్ళు చేయని చేయలేని పని లేదు ..ఇవన్నీ కనపడలేదు సరే.. ఇంత వేడిలోనూ... స్టవ్ ముందు నుంచునివాళ్ళేగానీ ఒక ముద్ద వండి పడేయకపోతే నీ బండి నడవదు..చలపతిరావు గారికి ఇదైనా గుర్తుకు రాలేదా? ఆడవాళ్లంటే ఇంత తక్కువ చూపా.. ఆ భాషేంటి.. తలుచుకుంటే ఛీ అనిపిస్తోంది అని రామజోగయ్యశాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు.

  హుందాగా పాటించాల్సిన

  హుందాగా పాటించాల్సిన

  సమాజంలో ప్రముఖులుగా చలామణీ అయ్యేవాళ్లు చాలా హుందాగా పాటించాల్సిన అవసరం ఉందని రామజోగయ్యశాస్త్రి సూచించాడు. చలపతిరావు, యాంకర్ రవి ప్రవర్తనను ఆయన తప్పుబట్టారు. ‘సోషల్ మీడియాలోనైనా సభల్లోనైనా ఒక మర్యాద పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక వయసొచ్చాక హుందాగా ఉండాల్సిన అవసరం మరీ మరీ ఉంది. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే ఆయన వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి. అలాగే యాంకర్స్‌ని సమర్ధులని సరైన వాళ్ళని ఎంచుకోవాలి. ఇక మీదట 😎 నాగార్జునగారూ ఇతన్ని ఎలిమినేట్ చేయండి..ప్లీజ్ అని ఆయన ఫేస్‌బుక్‌లో స్పందించారు.

  ప్రమాద హెచ్చరిక..

  ప్రమాద హెచ్చరిక..

  "ఆడవాళ్లు పక్కలోకి(మాత్రమే)పనికొస్తారు" అని నటుడు చలపతిరావు ఒక పబ్లిక్ ఫంక్షన్లో అనడం. దానికి జనం పగలబడి నవ్వడం. చప్పట్లు కొట్టడం. ఒక సమాజంగా ఇంతకన్నా మనం దిగజారడానికి లోతులు లేవని చెప్పడానికి ఇండికేటర్. ఒక ప్రమాద హెచ్చరిక అని సినీ విమర్శకుడు, దర్శకుడు మహేశ్ కత్తి ఫేస్‌బుక్‌లో స్పందించారు.

  పోలీసులకు ఫిర్యాదు

  పోలీసులకు ఫిర్యాదు

  చలపతిరావు వ్యాఖ్యలపై మహిళాలోకం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కొందరు మహిళలు నడంకట్టారు. మంగళవారం (మే 23వ తేదీ) హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి కొందరు మహిళా ప్రముఖులు సిద్ధమవుతున్నారు. తమతో కలిసి రావాలని వారు సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు.

  English summary
  Many film personalities are angry over Actor Chalapati Rao's derogatory comments on Women. Writer Rama Jogaiah Shastri condemned the comments of Chalapati. He advised to behave decent manner and demands unconditional apology.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more