»   » అమ్మో! చిరంజీవితో రిస్కే...కొడతారు, మోస్తున్న వినాయక్ గ్రేట్!

అమ్మో! చిరంజీవితో రిస్కే...కొడతారు, మోస్తున్న వినాయక్ గ్రేట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దాదాపు తొమ్మిదేళ్ల నిరీక్షణ అనంతరం చిరంజీవి అభిమానుల్లో ఏదో తెలియని కొత్త ఆనందం. అందుకు కారణం ఆయన మళ్లీ సినిమాల్లోకి రావడమే. ఎట్టకేలకు చిరంజీవి 150వ సినిమా ఇటీవల ప్రారంభమై ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.

ఒకప్పుడు తెలుగు సినీ రచయితల్లో ఒకరైన సత్యానంత్ మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన ప్రస్తావన రాగా ఆయన ఆసక్తికరంగా స్పందించారు. చిరంజీవి 150వ సినిమా రీమేక్ కథ తీసుకుని చేయడంపై కొన్ని విమర్శలు వచ్చినా... సత్యానంద్ మాత్రం చాలా పాజిటివ్ గా స్పందించారు.

చిరంజీవి 150వ సినిమా కథలు వినడం మొదలు పెట్టినప్పటి నుండే నన్నూ కథ వినమని పిలిచే వారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'కత్తి' రీమేక్ ఆయనకు సరిపోయే విధంగా ఉంటుంది. గతంలో ఆయన చాలా కొత్త కథలు విన్నారు. కానీ ఏ కథ చూసినా ఏదో ఒక లోపం ఉండేది. ఉన్నంత వరకు 'కత్తి' రీమేక్ కథే కాస్త బెటర్, సేఫ్టీగా ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది, దాన్ని కాస్తబెటర్మెంటుగా తీస్తే పెద్ద రేంజి వస్తుంది అన్నారు సత్యానంద్.

స్లైడ్ షోలో సత్యానంద్ చెప్పిన మరిన్ని విశేషాలు..

రిస్కే, కొడతారు..

రిస్కే, కొడతారు..

మీకుగా మీరు ఏమీ కథలు తయారు చేయలేక పోయారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ..చిరంజీవి గారికి కథ తయారు చేయాలంటే ఓ సమస్య ఉంది. ఒక వేళ ఆ కథ బాగోలేకపోతే మా చిరంజీవి గారి 150వ సినిమాకు ఇలాంటి కథ తయారు చేస్తావా అంటూ వచ్చి ఫ్యాన్స్ కొట్టినా కొడతారు, అది రిస్కే అంటూ సత్యానంద్ చమత్కరించారు.

అప్పట్లో ఇలా కాదు..

అప్పట్లో ఇలా కాదు..

అప్పట్లో ఇంత ఇదిగా ఫ్యాన్స్ తీరు ఉండేది కాదు... హీరోకి హిట్ వస్తే ఆనందించే వారు ఫెయిల్యూర్ వస్తే వెంటనే తెలిసేది కాదు. ఇప్పటిలా కమ్యూనికేషన్ సిస్టం లేదు. ఇపుడు హైదరాబాద్ లో ఉండి మొదటి రోజు థియేటర్ కి వెళ్లగానే అభిమానులు ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాళ్ల ప్రతాపం చూపిస్తున్నారు అన్నారు.

అర్థం కాని పరిస్థితి..

అర్థం కాని పరిస్థితి..

చిరంజీవి 150వ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. చిరంజీవి గారితో ఇన్ని సినిమాలు చేసిన వారు మంచిదే కథ ఇస్తారని ఫ్యాన్స్ అనుకుంటారు. మనం మంచిదే ఇవ్వాలంటే ఏది మంచిదో తెలియని పరిస్థితి ఉంది, అర్థం కాని పరిస్థితి అని సత్యానంద్ తెలిపారు.

కథలు విన్నారు కానీ..

కథలు విన్నారు కానీ..

చిరంజీవి గారు కూడా నాలుగైదు కథలు అందరి వద్దా విన్నారు. నన్ను కూడా కథలు వినేటపుడు పిలిచేవారు. ఏ కథ అయినా ఏదో లోపం కనిపిస్తూ ఉండేది. ఉన్నంత వరకు కత్తి రీమేకే బెటర్. ఒక రకంగా సేఫ్టీగా ఉంటుంది. గ్యారంటీ ఉంటుంది. దాన్ని బెటర్మెంట్ చేస్తే పెద్ద రేంజి రావొచ్చు అన్నారు.

వినాయక్ గ్రేట్

వినాయక్ గ్రేట్

వివి వినాయక్ గారు సినిమాలో చేసిన మార్పులు చెప్పారు. చాలా బాగా చేసారు. వినాయక్ చాలా కష్టపడ్డారు. చిరంజీవి లాంటి ఇమేజ్ ఉన్న వారు అంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న వారు వస్తున్నారంటే మోయడం కష్టం. వినాయక్ ఇందుకోసం చాలా కష్టపడుతున్నారు అన్నారు.

పెద్ద చాలెంజ్

పెద్ద చాలెంజ్

చిరంజీవి సినిమాలు వదిలేసాక చాలా జరిగాయి. ఇపుడు మళ్లీ చిరంజీవిని అప్పుడున్న ఇమేజ్ తో చూపించాలంటే డైరెక్టర్ కి పెద్ద చాలెంజ్. వినాయక్ పనితీరు, తాపత్రయం గానీ బావుంది. షూటింగ్ బాగా జరుగుతోంది. చిరంజీవి కూడా 25 ఏళ్ల కుర్రాడిలాగా చేస్తున్నాడు అన్నారు సత్యానంద్

చరణ్ నవ్వేసాడు

చరణ్ నవ్వేసాడు

నేను చరణ్ ను అడిగాను నువ్వు కొత్త ప్రొడ్యూసర్ , ఎవరో కొత్త హీరోను పరిచయం చేస్తున్నావు.. చాలా బాగా చేస్తున్నాడు అంటే నవ్వేసి వెళ్లిపోడంటూ సత్యానంద్ గుర్తు చేసుకున్నారు.

English summary
Writer Satyanand comments about Megastar Chiranjeevi fans and craze, besides revealing his association with Mega Family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu