twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్విట్టర్ రివ్యూ: వైఎస్ఆర్ బయోపిక్ 'యాత్ర'.. బిగ్ స్క్రీన్‌పై జగన్, మమ్ముట్టి మెప్పించారా!

    |

    Recommended Video

    Yatra Movie Twitter Review యాత్ర ట్విట్టర్ రివ్యూ | Filmibeat Telugu

    దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర చిత్రం రూపొందించారు. మలయాళీ స్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రలో నటించారు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ చూసినప్పుడు మమ్ముట్టి వైఎస్ఆర్ లాగే హావ భావాలూ పలికిస్తూ మెప్పించారు. యాత్ర చిత్రంలో చూపిన వైఎస్ఆర్ ఎమోషనల్ జర్నీ అందరిని ఆకట్టుకుంటుందనే అభిప్రాయం చిత్ర యూనిట్ నుంచి వ్యక్తం అయింది. టాలీవుడ్ లో వరుసగా ప్రముఖుల బయోపిక్ చిత్రాలు వస్తున్న తరుణంలో యాత్ర కూడా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం!

    రియాలిటీకి దగ్గరగా

    భారీ హైప్, ఆడంబరం లేకుండా యాత్ర చిత్రాన్ని దర్శకుడు చక్కగా తీర్చిదిద్దాడు. వైఎస్ఆర్ లాగా నటించిన మమ్ముట్టి పాత్ర ఎలాంటి ఓవర్ యాక్షన్ లేకుండా రియాలిటీకి దగ్గరగా ఉంది. వైఎస్ఆర్ పాదయత్రని ఎమోషనల్ గా చూపించారు. ఇది అద్భుతమైన చిత్రం.

    టిడిపికి వ్యతిరేకంగా

    యాత్ర చిత్రంలో హై మూమెంట్స్ కానీ, లో మూమెంట్స్ కానీ లేవు. చిత్రం మొత్తం ఒకేలా సాగుతుంది. మమ్ముట్టి పాత్ర రాజశేఖర్ రెడ్డిని తలపించేలా లేదు. ఈ చిత్రంలో రెండు సన్నివేశాలు టిడిపికి వ్యతిరేకంగా ఉన్నాయి. అవి అనవసరం అనిపించింది.

    వైఎస్ఆర్ పాత్రలో

    యాత్ర చిత్రాన్ని ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా బావుంది. మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో ఒదిగిపోయారు. మహి వి రాఘవ్ తాను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పాడు. ఇది భావోద్వేగాల్ని రేకెత్తించే చిత్రం.

    ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ

    యాత్ర చిత్రం మనలోని భావోద్వేగాల్ని బయటకు తీసే విధంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డ వైఎస్ఆర్ చిత్రం. ప్రతి ఒక్కరూ చూడాలి.

    ఫస్టాఫ్ బోరింగ్

    యాత్ర ఫస్టాఫ్ చాలా బోరింగ్ గా ఉంది. వైఎస్ఆర్ పరిచయ సన్నివేశల నుంచే ఈ చిత్రం ఆసక్తికరంగా లేదు. ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ సంగీతం పెద్ద మైనస్. సెకండ్ హాఫ్ బావుంటుందని ఆశిస్తున్నా.

    అభిమానులకు మాత్రమే

    యాత్ర చిత్రాన్ని చూడక పోవడమే మంచింది. వైఎస్ఆర్ అభిమానులకు నచ్చుతుంది. చిత్రం మొత్తం స్లోగా, బోరింగ్ గా సాగుతుంది.

    వైఎస్ జగన్ ఎంట్రీ

    వైఎస్ జగన్ ని బిగ్ స్క్రీన్ పై చూశానని అనుకోలేదు. యాత్ర చిత్రంలో జగన్ ని చూపించారు. ఏపీకి ఆయనే నెక్స్ట్ సీఎం కాబోతున్నారు

    బ్లాక్ బస్టర్ కాదు

    యాత్ర చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించకపోవచ్చు. కానీ ఈ చిత్రంతో దర్శకుడు అనుకున్న లక్ష్యం నెరవేరింది. చెప్పాలనుకున్న పాయింట్ ప్రజలకు చేరింది. యాత్ర చిత్రంలో వైఎస్ఆర్ పాత్రలో ఒదిగిపోయిన క్రెడిట్ ఆయనదే. రాజకీయ అంశాలు ఉన్నప్పటికీ దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పారు.

    దేవుడిలాగా

    యాత్ర చిత్రం కేవలం వైఎస్ఆర్ భక్తులకు మాత్రమే. సినిమాటిక్ అనుభూతి కోరుకుని ఈ చిత్రానికి వెళితే నిరాశపడడం ఖాయం. ప్రతి సన్నివేశంలో వైఎస్ఆర్ ని దేవుడిలా చూపించడానికి ప్రయత్నించారు.

    సెకండ్ హాఫ్ బావుంది

    యాత్ర ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బావుంది. అనుకున్న పాయింట్ లోనుంచి పక్కకు వెళ్లకుండా ఎమోషన్స్ పండించారు. చివరి 10 నిమిషాలు రియల్ ఫుటేజ్ తో చూపించారు.

    English summary
    Y. S. Rajasekhara Reddy biopic Yatra movie twitter review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X