For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నవ్వులతో చెడుగుడు (యుముడికి మొగుడు ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : సుడిగాడు విజయంతో మంచి ఊపుమీద ఉన్న అల్లరి నరేష్ తాజా చిత్రం 'యముడికి మొగుడు'. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల చంటి నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు న భారీగా విడుదల అవుతోంది. కేవలం హైదరాబాద్ లోనే 44 ప్రింట్స్ తో విడుదల చేస్తున్నారు. సోషియో ఫాంటసీ గా రూపొందిన ఈ చిత్రం యముడు బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది.

  నరేష్‌ (నరేష్‌) 2002 నుంచి ఇప్పటి వరకూ ఇంటర్మీడియట్‌ చదువుతూనే ఉంటాడు. అనుకోకుండా ఒక రోజు యముడి (సాయాజీ షిండే) కూతురు యమజ (రిచా పనయ్‌)ను ప్రేమిస్తాడు. ఇంతకీ యమజనే ఎందుకు ప్రేమించాడు? యమలోకం వెళ్లి తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అనేది అసలు కథ.

  కథ ప్రకారం అల్లరి నరేష్ ఓ అల్లరి నరేష్. ఆ అల్లరి కుర్రాడికి అన్నింట్లోనూ తొందరే. ఏం చేసినా చిరిగి చాటంత అయితేనేగానీ మనసు కుదుటపడదు. అయితే ఒకానొక సిట్యువేషన్ లో ఈ అల్లరి కుర్రాడు యమలోకం వెళ్తాడు. యమధర్మరాజు ఎలాంటి శిక్ష వేస్తాడో అని అందరూ భయం భయంగా వరుసలో నిలుచున్నారు. కానీ ఓ అల్లరి నరేష్ మాత్రం... యముడి కూతురిపై కన్నేశాడు. ఓ శుభముహూర్తాన అతను ప్రేమలోపడ్డాడు. తండ్రి చాటుగా ఉన్న యమపుత్రికను తదేకంగా చూస్తూ ప్రేమ మైకంలోకి దించేశాడు. భూలోకంలోని కుర్రాడికీ, యముడి గారాలపట్టికీ ప్రేమ బంధం ఎలా పడిందో తెర మీదే చూడాలి.

  'అల్లరి'నరేష్ మాట్లాడుతూ...యమ లోకం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకొన్నాయి... మా చిత్రానికీ నేపథ్యం ఆ లోకమే. అయితే యముడితో ఓ యువకుడు ఆడిన ఆట ఏమిటనేది మా చిత్రంలో చూడాలి. అలాగే సత్తిబాబు దర్శకత్వంలో అంతకుముందు 'బెట్టింగ్ బంగార్రాజు' చేశాను. ఆ తర్వాత చాలా కథలు చెప్పాడు. చివరకు ఈ సోషియో ఫాంటసీ కథ నన్ను బాగా ఆకట్టుకుంది. యమలోకం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నా ఫేవరెట్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. 'అల్లుడా మజాకా'లోని 'అత్తో అత్తమ్మ కూతురో' పాటను ఇందులో రీమిక్స్ చేసాం. గంటన్నర సేపు గ్రాఫిక్స్‌ ఉంటాయి. రమ్యకృష్ణతో కలిసి నటించడం ఆనందంగా ఉంది అన్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ ''కథ ఈ చిత్రానికి ప్రధాన బలం. విభిన్నమైన గెటప్పుల్లో నరేష్‌ చేసే సందడి ఆకట్టుకుంటుంది. వినోదంతో పాటు పాటలు అలరిస్తాయి. గంటన్నర గ్రాఫిక్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు.

  సంస్థ: ఫ్రెండ్లీ మూవీస్‌

  నటీనటులు: నరేష్‌, రిచా పనయ్‌, సాయాజీ షిండే, రమ్యకృష్ణ, చంద్రమోహన్‌, నరేష్‌, చలపతిరావు, కృష్ణభగవాన్‌, భరత్‌, రఘుబాబు తదితరులు.

  మూలకథ: జయసిద్ధు,

  మాటలు: క్రాంతిరెడ్డి సకినాల,

  సంగీతం: కోటి,

  కెమెరా: కె.రవీంద్రబాబు.

  నిర్మాత: చంటి అడ్డాల

  దర్శకత్వం: ఇ.సత్తిబాబు

  విడుదల: గురువారం.

  English summary
  Following the smashing success of Sudigadu, the expectations surrounding Allari Naresh starrer, Yamudiki Mogidu have sky rocketed. The movie is releasing in an unprecedented 44 theatres in just Hyderabad, a proof of his growing popularity. This time around, the lanky actor is trying his hand at the socio fantasy format. Richa Pinai is playing the female lead in the movie directed by E Satti Babu. Sayaji Shinde is playing the role of Lord Yama. The two had previously worked for Betting Bangaraju and Nenu. In this movie Naresh is smitten by Yama's daughter, played by Richa. And all hell breaks loose. Ramya Krishna is playing Lord Yama's wife. The film has the tag line Nela Ee Thakkuvodu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X