»   »  యేలేటి,మోహన్ లాల్ ‘మనమంతా’కథలో మెలిక ఇదే

యేలేటి,మోహన్ లాల్ ‘మనమంతా’కథలో మెలిక ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మోహనలాల్‌, గౌతమి కీలక పాత్రల్లో ప్రముఖ దర్శకుడు యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మనమంతా'. వారాహి చలనచిత్రం పతాకంపై రూపొందుతోంది. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కథ ఎలా ఉండబోతోందనే హింట్ ఇస్తూ ఓ పోస్టర్ ని విడుదల చేసారు నిర్మాతలు.


ఒక బడికెళ్ళే బాలిక, టీనేజ్ కుర్రాడు, మధ్య వయసున్న మరో ఇద్దరు.. ఈ నలుగురి జీవితాలు అనూహ్యంగా ఒక దగ్గర కలవడం, దాంతో అందరి జీవితాలూ కొన్ని అనుకోని మలుపులు తిరగడమన్న వినూత్న కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఈ కథలన్నింటికీ కలుపుతూ సాగే ఓ ఎమోషనల్ జర్నీ, మానవ సంబంధాల్లోని ఎమోషన్స్‌ను స్పృశించేవిధంగా ఉంటుందని టీమ్ తెలిపింది. 'One world four stories'...నాలుగు కథలు ఒకటే ప్రపంచం అంటూ మనకు మరో మంచి చిత్రాన్ని అందించబోతున్నారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఆ నాలుగు కథలు ఎలాంటి మలుపులు తీసుకుని ఏ ముగింపు చేరుకుందనేదే కథాంశం చాలా ఆసక్తికరంగా సాగుతుందని చిత్రయూనిట్ సభ్యులు తెలియజేశారు.

Yeleti's Manamantha movie story line

'ఈగ', 'అందాల రాక్షసి','లెజండ్', 'ఊహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్యా' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం 'ఈగ'తో నేషనల్ అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ సాయిశివాని సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మాతగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అయ్యప్ప శర్మ, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: చంద్రశేఖర్‌, ఆర్ట్‌: రవీందర్‌, కెమెరా: రాహుల్‌, సంగీతం: మహేశ శంకర్‌, నిర్మాత: రజనీ కొర్రపాటి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్‌ యేలేటి.

ఒక స్కూల్ కి వెళ్లే అమ్మాయి, టీనేజ్ కుర్రాడు, మధ్య వయసున్న మరో ఇద్దరు.. ఈ నలుగురి జీవితాలు అనూహ్యంగా ఒక దగ్గర కలవడం, దాంతో అందరి జీవితాలూ కొన్ని అనుకోని మలుపులు తిరగడమన్న వినూత్న కాన్సెప్ట్‌తో మనమంతా చిత్రం తెరకెక్కుతోంది. ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అయ్యప్ప శర్మ, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: చంద్రశేఖర్‌, ఆర్ట్‌: రవీందర్‌, కెమెరా: రాహుల్‌, సంగీతం: మహేశ శంకర్‌, నిర్మాత: రజనీ కొర్రపాటి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్‌ యేలేటి.

English summary
Director Yeleti Chandra Shekar revealed basic story line of Mohan Lal's Manamantha movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu