twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్‌చరణ్‌ కీ తప్పని తాగుడు సీన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : శ్రీను వైట్ల చిత్రాల్లో దాదాపు మొదటి నుంచీ అంటే ఆనందం నుంచీ తాగుడు సీన్స్ ఉంటూనే వస్తున్నాయి. హీరో తన ఫ్రెండ్స్ తో కూర్చుని త్రాగి ఎవరో ఒకరిని అక్కడ బకరా చేసి కొట్టడం, తమ కసి తీర్చుకోవటం ఈ సీన్స్ సారాంశం. ఇప్పుడు ఆయన తాజా చిత్రంలోనూ అలాంటి సీన్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం.

    ఈ విషయమై శ్రీను వైట్ల మాట్లాడుతూ... ఉంది...ఓ డ్రింకింగ్ సీన్ అయితే ఉంది. కానీ దాని నుంచి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్సపెక్ట్ చేయవద్దు అని ఆయన అన్నారు.

    రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ది ఫైటర్‌' అనేది ట్యాగ్ లైన్. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 16 న విడుదల చేయాటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజే సెన్సార్ పూర్తి చేసారు.

    Yes. There is a drinking scene in Bruce Lee

    నిర్మాత మాట్లాడుతూ ''బ్రూస్‌లీకి వీరాభిమాని అయిన ఓ యువకుడి కథ ఇది. తనకు ఎదురైన ఓ సమస్యపై ఎలా పోరాటం చేశాడన్నది తెరపైనే చూడాలి. వినోదం, కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. రామ్‌చరణ్‌ చేసే యాక్షన్‌, డ్యాన్సులు అభిమానుల్ని అలరించేలా ఉంటాయి. ఇటీవల విడుదలైన 'లే చలో...' పాటకి మంచి స్పందన లభిస్తోంది. చిత్రాన్ని 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.

    చిరంజీవి గెస్ట్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ...56.45 కోట్ల వరకూ జరగటంతో ట్రేడ్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. నిర్మాతకు టేబుల్ ఫ్రాఫిట్స్ తెచ్చిపెడుతున్న ఈ చిత్రం.

    ఈ చిత్రంలో చిరంజీవి 15 నిముషాల పాటు కనిపించనున్నారు.. రామ్ చరణ్, చిరంజీవి లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను కొద్ది రోజుల పాటు తీస్తారు. చిరంజీవి చాలా రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవటంతో అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి ఈ చిత్రంలో చేయబోయే సీన్స్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది.

    Yes. There is a drinking scene in Bruce Lee

    లారెన్స్ స్టైల్ సినిమాలో చేసినట్లుగానే చిరంజీవి ఈ సినిమాలో రామ్ చరణ్ ని క్లైమాక్స్ ముందు ఓ కష్టం నుంచి బయిటపడేస్తారు. రకుల్ ప్రీతి ని విలన్స్ నుంచి కాపాడటానికి చిరంజీవి హెల్ప్ చేస్తారు. రామ్ చరణ్ వంటి హీరోకి హెల్ప్ చేయగలవారు ఎవరా అని ఆలోచించి చిరంజీవి అయితేనే బెస్ట్ అని ఒప్పించినట్లు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి తన నిజ జీవితలో లాగానే మెగాస్టార్ చిరంజీవి గా సినిమా హీరోగా కనిపిస్తారు. అయితే ఇదంతా నిజమా కాదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే.

    "వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.

    ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Srinu Vytla said...."Yes. There is a drinking scene in Bruce Lee. But don’t expect high entertainment from it."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X