»   » ము ము ముద్దొస్తోంది...సిగ్గు మొగ్గైన శృతి హాసన్(ఫోటో)

ము ము ముద్దొస్తోంది...సిగ్గు మొగ్గైన శృతి హాసన్(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శృతి హాసన్ జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎవడు'. ఈచిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి తగ్గకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు. తాజాగా విడుదలైన ఈచిత్రం కొత్త పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ తన బుగ్గను టచ్ చేయడంతో హీరోయిన్ శృతి హాసన్ సిగ్గు మొగ్గైన దృశ్యం ఆకట్టుకుంటోంది.

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు తెలంగాణ విభజన నిర్ణయం తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు తెలంగాణ ప్రాంతానికి చెందిన నిర్మాత దిల్ రాజుకు కంటి మీద నిద్రలేకుండా చేస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం 'ఎవడు' విడుదల ఇప్పట్లో సాధ్య అయ్యేలా కనిపించడం లేదు.

ఆ మధ్య సినిమాను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధం అవ్వగా....కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విభజన ప్రకటన చేస్తుందనే సంకేతాలు చిరంజీవి ద్వారా తెలుసుకున్న దిల్ రాజు ముందు జాగ్రత్తగా సినిమా విడుదల నిలిపి వేసారు. అపుడు సినిమాను నిలిపి వేయడమే మంచిదైంది. లేకుంటే ఆందోళనల కారణంగా సినిమాకు తీవ్ర నష్టం ఏర్పడేది.

ఆ తర్వాత సినిమా విడుదల చేద్దామనే ప్లాన్ చేసినప్పటికీ ఇతర సినిమా విడుదల, థియేటర్ల సమస్య కారణంగా సినిమా విడుదల కాలేదు. పరిస్థితి కాస్త చక్కబడటంతో డిసెంబర్లో సినిమాను విడుదలకు ప్లాన్ చేసుకున్నారు దిల్ రాజు. అయితే అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన అంశాన్ని పూర్తి చేస్తుందనే సంకేతాలు బలంగా వినిపిస్తుండటంతో దిల్ రాజు ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.

అయితే దిల్ రాజు తన మనసులోని ఆందోళన బయటకు కనిపించకుండా కవర్ చేసుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారమే సినిమా డిసెంబర్లో విడుదల చేస్తామని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం సినిమా విడుదలకు అనుకూలంగా లేవనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలోని తోటి నిర్మాతలు దిల్ రాజును చూసి జాలి పడుతున్నారు. వారైనా...మనమైనా ఏం చేయగలం? జాలి పడటం తప్ప!

English summary
Yevadu movie new poster released. Yevadu is an upcoming Telugu film written and directed by Vamsi Paidipally. The film stars Ram Charan Teja, Shruti Haasan and Amy Jackson in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu