»   » ఈ రోజే నుంచే.. రామ్ చరణ్ 'ఎవడు'

ఈ రోజే నుంచే.. రామ్ చరణ్ 'ఎవడు'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఎవడు' . ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రీసెంట్ గా స్విజ్జర్ ల్యాండ్ జ్యూరిచ్ లో శ్రుతిహాసన్, రామ్ చరణ్ లపై ఓ పాటను చిత్రీకరించారు. అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకుని వస్తున్నారు. ఈ రోజు (మే 29) నుంచి నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమవుతోంది.

ఈ షెడ్యూల్ జూన్ 20 వరకూ సాగుతుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, అమీ జాక్సన్,శృతి హాసన్ పై సీన్స్ ని చిత్రీకరిస్తారు. ఇప్పటికే చిత్ర వర్గాల్లో మంచి క్రేజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆడియో త్వరలోనే విడుదలకానుంది. ఈ చిత్రం అభిమానులను సైతం ఓ రేంజిలో అలరించే చిత్రం అవుతుందని అంటున్నారు. ఈ చిత్రం పూర్తి స్ధాయి యాక్షన్ తో ఎంటర్టైన్మెంట్ అండర్ కరంట్ గా సాగే చిత్రం అని చెప్తున్నారు.

ఈ చిత్రం కాన్సెప్టు ఏమిటంటే... మంచికీ చెడుకీ, న్యాయానికీ అన్యాయానికీ యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అధిపత్యం చేతులు మారినా... చివరికి విజయం మంచి వైపే ఉంటుంది. అయితే ధర్మం వైపు నిలబడి పోరాడేవాడు కావాలి. ఏ సమరమైనా ఒక్కడే మొదలుపెడతాడు. ఆ తరవాత సమూహం అతని వెంట నడుస్తుంది. మరి ఆ ఒక్కడు ఎవడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ విషయాలు తెలియాలంటే 'ఎవడు' చూడాల్సిందే. ..అంటున్నారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ... ''నాలుగు సన్నివేశాల తరవాత ఓ పాట, వెంటనే పోరాట సన్నివేశం.. ఈ తరహాలో సాగే చిత్రం కాదిది. సినిమా ఎత్తుగడే కొత్తగా అనిపిస్తుంది. పోరాట ఘట్టాలు కూడా విభిన్నంగా తీర్చిదిద్దారు. బన్నీ కనిపించేది కొద్దిసేపే అయినా.. ఆ పాత్రే కథను మలుపు తిప్పుతుంది'' అన్నారు.

'ఎవడు' లో రామ్ చరణ్ సరసన శ్రుతిహాసన్‌, అమీజాక్సన్‌ హీరోయిన్స్ . అల్లు అర్జున్‌, కాజల్‌ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. దిల్‌ రాజు నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో పీటర్‌హెయిన్స్‌ ఆధ్వర్యంలో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. సహనిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌; సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ డేట్ ఖరారైనట్లు వార్తలు అందుతున్నాయి. రామ్ చరణ్-ఉపాసన మొదటి పెళ్లి రోజైన జూన్ 14వ తేదీన 'ఎవడు' చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'ఎవడు' చిత్రానికి చెర్రీ బాబాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు.

English summary
Ram Charan’s upcoming film Yevadu is in the last leg of shooting. Shruti Haasan and Amy Jackson are the lead actresses in the film. Recently, a song was canned on Ram Charan and Shruti Haasan near Zurich, Switzerland and that schedule was wrapped up last week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu