Just In
Don't Miss!
- News
గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాధాన్యం..
- Sports
India vs England: స్టోక్స్, ఆర్చర్ ఆగయా.. ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ ఇదే!
- Finance
హైదరాబాద్ సహా సిటీల్లో హౌసింగ్ సేల్స్ జంప్, పూర్తి ఏడాది పరంగా డౌన్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మగధీర రీలీజైన రోజే : ‘ఎవడు’ జులై 31న
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిర జులై చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం జులై 31న విడుదల చేసేందుకు డేట్ ఫైనల్ అయింది. అంతకు ముందు జులై 25 అనుకున్నప్పటికీ సెంటిమెంటు కలిసొస్తుందని జులై 31ని ఫైనల్ చేసినట్లు స్పష్టం అవుతోంది.
చరణ్ గత సినిమా మగధీర జులై 31, 2009లో విడుదలై తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరుక వచ్చిన భారీ బ్లాక్ బస్టర్స్... తొలిప్రేమ(24 జులై, 1998), ఇంద్ర(జులై 25, 2002), మగధీర(31 జులై, 2009)లాంటి సినిమాలన్నీ జులై చివరి వారంలో విడుదలైనవే కావడం గమనార్హం.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది. ఆడియో వేడుకలో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు.
మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.