»   » ఎవడు మెగా సెంటిమెంటు వీక్! (వీడియో)

ఎవడు మెగా సెంటిమెంటు వీక్! (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం మెగాఫ్యామిలీ సెంటిమెంటుగా భావించే వీక్(వారం)లో విడుదలకు సిద్దం అవుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరుక వచ్చిన భారీ బ్లాక్ బస్టర్స్... తొలిప్రేమ(24 జులై, 1998), ఇంద్ర(జులై 25, 2002), మగధీర(31 జులై, 2009)లాంటి సినిమాలన్నీ జులై చివరి వారంలో విడుదలైనవే.

ఈ నేపథ్యంలో సెంటిమెంటును ఫాలో అవుతూ 'ఎవడు' సినిమాను కూడా జులై చివరి వారంలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు సోమవారం జరిగిన ఆడియో వేడుకలో స్పష్టం చేసారు. సెంటిమెంటు తప్పకుండా కలిసొస్తుందనే నమ్మకం ఉందనే ఆశాభావం వ్యక్తం చేసారు.

Yevadu Theatrical Trailer

సాధారణంగా ఏదైనా సినిమాపై అభిమానుల్లో అంచనాలు అతిగా ఉంటే కొన్నిసందర్భాల్లో అంచనాలను అందుకోలేక బాక్సాఫీసు వద్ద చతికిల పడే అవకాశం ఉంది. కానీ 'ఎవడు' సినిమాపై అంచనాలు ఏ రేంజిలో పెట్టుకున్నా ఆ రేంజిని తప్పకుండా రీచ్ అవుతుందని నమ్మకంతో చెప్పారు చిరంజీవి.

ఇప్పటికే ఆయన సినిమా వీక్షించారు. అభిమానుల పల్స్ తెలిసిన చిరంజీవి లాంటి అనుభజ్ఞులైన వ్యక్తి గట్టి నమ్మకంతో 'ఎవడు' సినిమా 'మగధీర' లాంటి సినిమాకు ధీటైన సినిమా అని చెప్పడంతో ఈ సినిమా తప్పుకుండా భారీ బ్లాక్ బస్టరే అనే నిర్ణయానికి వచ్చారు ఫ్యాన్స్. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా పవర్ ఫుల్ గా ఉండటం విశేషం.

English summary

 Watch Video of Telugu Film Yevadu Theatrical Trailer feat Ram Charan Teja, Shruti Haasan and Amy Jackson.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X