»   » పవన్ సినిమాతో చరణ్‌‌కు సమస్యలేదు : దిల్ రాజు

పవన్ సినిమాతో చరణ్‌‌కు సమస్యలేదు : దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'ఎవడు' చిత్రం జులై 31న విడుదలకు సిద్ధం అవుతుండగా....వారం గ్యాప్‌తో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పవర్ స్టార్ సినిమా వల్ల చరణ్ సినిమా ఏమైనా ప్లాబ్లం రావొచ్చు, కలెక్షన్లు తగ్గిపోవచ్చనే ఒక వాదన మొదలైంది. సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో దిల్ రాజు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు.

Dil Raju

దిల్ రామాట్లాడుతూ...'మేము ముందుగా ఎవడు వాయిదా వెయ్యాలని అనుకున్నాం కానీ సరైన తేదీ దొరకలేదు. అత్తారింటికి దారేది డేట్ అనౌన్స్ చేసేసారు, అలాగే జంజీర్ డేట్ కూడా ఫిక్స్ చేసేసారు. కావున 31నే రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాం. కానీ దీనివల్ల ఎలాంటి సమస్య లేదు.. గదర్, లగాన్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి కానీ రెండూ ట్రెండ్ సెట్ చేసాయని' అన్నారు.

'ఎవడు సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదు, జులై 31నే విడుదల చేయబోతున్నాం. అత్తారింటికి దారేది సినిమా వల్ల ఎవడు సినిమాకు ఎలాంటి సమస్య రాదని భావిస్తున్నాం. ఇప్పటికే అనేక కమర్షియల్ హిట్స్ ఇచ్చిన రామ్ చరణ్ ఎవడు చిత్రంతో మరో విజయం సొంతం చేసుకుంటారు' అని వెల్లడించారు.

English summary
Producer Dil Raju has informed media personnel that ‘Yevadu’ will hit the screens on the 31st of July. There is no change in the release date. Mega Powerstar Ram Charan is the hero in the film. Shruti Haasan and Amy are the 
 heroines.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu