twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆడదానివై ఇలాంటి సినిమాలా? సిగ్గు లేదా??: సెన్సార్ బోర్డ్ సభ్యుల మాటలు ఇలా ఉన్నాయట

    బాబుమోషాయ్ బందూక్ బాజ్ నిర్మాత కిరణ్ శ్యామ్ శ్రోఫ్ సెన్సార్ ఆఫీసు కి వెళ్లినప్పుడు నువ్వు ఒక ఆడదానివి అయిఉండి ఇలాంటి సినిమాలు ఎలా నిర్మించావు అని అన్నారటా.

    |

    ఇటీవలి కాలంలో సినిమా విడుదలై వివాదాలు మొదలవడం కంటే.. ఇంకా సెన్సార్ దశలోనే వివాదాలు ఎక్కువవుతున్నాయి. ఏదైనా చిన్న ముద్దు సీను ఉంటే చాలు.. దానికి ఏకంగా ఆ రేటింగ్ ఇచ్చేస్తున్నారని బాలీవుడ్ వర్గాలు సెన్సార్ బోర్డు పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

    బాబుమోషాయ్ బందూక్ బాజ్

    బాబుమోషాయ్ బందూక్ బాజ్

    ఇచ్చే రేటింగ్ ఎలాగూ ఇస్తారు.. మళ్ళీ ఈ కట్స్ ఎందుకు అని అడిగితే సెన్సార్ బోర్డు సభ్యుల నుండి సమాధానం ఉండదు. ఇంతకు ముందు ఉడ్తా పంజాబ్, లిప్ స్టిక్ అండర్ బుర్ఖా లాంటి చిత్రాల సమయంలో ఇలాంటి వివాదాలే చెలరేగాయి. తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ‘బాబుమోషాయ్ బందూక్ బాజ్' చిత్రానికి ‘ఏ' రేటింగ్ ఇవ్వడమే కాకుండా ఏకంగా 48 కట్లు ఇవ్వడంతో ఆ చిత్రబృందం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

    నిర్మాత కిరణ్ శ్యామ్ శ్రోఫ్

    నిర్మాత కిరణ్ శ్యామ్ శ్రోఫ్

    సినిమా పై సెన్సార్ చూపిస్తున్న వైఖరికి దర్శక నిర్మాతలు నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ సినిమా నిర్మాత కిరణ్ శ్యామ్ శ్రోఫ్ సెన్సార్ ఆఫీసు కి వెళ్లినప్పుడు ఆమె వాలకం చూసి నువ్వు ఒక ఆడదానివి అయిఉండి ఇలాంటి సినిమాలు ఎలా నిర్మించావు అని అన్నారటా.

    Recommended Video

    Regina and Thamanna Practicing Their Dialogues And Dances For Shoot
    48 కట్లు ఉంటాయి అని చెప్పారు

    48 కట్లు ఉంటాయి అని చెప్పారు

    ఒక మీడియా ఇంటర్వ్యూ లో ఆమె తన ఆవేదనను ఇలా పంచుకుంది. "మా సినిమాను ముందు వాళ్ళు చూసి ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఇస్తాము అని చెప్పారు. మేము సరే అనుకున్నాం. ఆ తరువాత మళ్ళీ సినిమాలో 48 కట్లు ఉంటాయి అని చెప్పారు. 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చి మళ్ళీ అన్నీ కట్లు ఎందుకు అని అడిగితే వచ్చిన సమాధానానికి బిత్తర పోయిందట

    ఆడదానివి అయి ఉండి సిగ్గు లేదు

    ఆడదానివి అయి ఉండి సిగ్గు లేదు

    అందులో ఒక ఆడ సభ్యురాలు నా వైపు తిరిగి నువ్వు ఒక ఆడదానివి అయి ఉండి ఇలాంటి కథలను చెప్పడానికి సిగ్గు లేదు అని అడిగారు. అంతటితో ఆగక మరోక అతను షర్ట్ పాంట్ వేసుకొంది ఈమె ఆడది ఏంటి అని అన్నారు. ఈ ఒక్క మాటతో నాకు మతి పోయినంత పని అయ్యింది. వేసుకొన్న బట్టలు ఆదారంగా వీళ్ళు మనుషులును అంచనా వేసి ఇలా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ తో ఇంకా మాట్లాడటం అనవసరం'' అంటోంది.

    కుషన్ నందీ దర్శకత్వం

    కుషన్ నందీ దర్శకత్వం

    ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్' మూవీ కుషన్ నందీ దర్శకత్వం లో తెర‌కెక్క‌గా ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా , అతడికి జోడీగా బెంగాలీ నటి బిదితా బాగ్‌ నటించింది. సినిమాలో తొలుత నవాజ్‌కి జోడీగా చిత్రాంగద సింగ్‌ను తీసుకున్నారు. కానీ ఇందులో అభ్యంతకర సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఆమె సినిమా నుంచి తప్పుకున్నసంగతి తెలిసిందే.

    English summary
    Babumoshai Bandookbaaz producer Kiran Shroff claims that she was allegedly insulted by the CBFC for being a woman and backing a film with so many abuses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X