»   » సైఫ్ వల్ల నేనిప్పటికీ బాధపడుతున్నా.., రాహుల్ గాంధీపై క్రష్?: కరీనా కపూర్..

సైఫ్ వల్ల నేనిప్పటికీ బాధపడుతున్నా.., రాహుల్ గాంధీపై క్రష్?: కరీనా కపూర్..

Subscribe to Filmibeat Telugu

చాలామంది హీరోయిన్లు పెళ్లి తర్వాత వెండితెర నుంచి త్వరగా కనుమరగవడం చూస్తుంటాం. పెళ్లికి ముందు లాగే హీరోయిన్ పాత్రల్లో కనిపించడానికి.. పెళ్లయ్యాక భర్తలు అడ్డొస్తారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌కు మాత్రం అలాంటి ఇబ్బందేమి లేదు. పెళ్లి తర్వాత కూడా... అటు వ్యక్తిగత జీవితాన్ని.. ఇటు సినిమాల్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటోంది. అయితే సైఫ్ మీద మాత్రం ఆమెకు కొన్ని ఫిర్యాదులు ఉన్నాయట..

నేనిప్పటికీ బాధపడుతున్నా..:

నేనిప్పటికీ బాధపడుతున్నా..:

సైఫ్‌ వల్ల నేనిప్పటికీ బాధపడుతూనే ఉన్నా. తనెప్పుడు షూటింగ్‌కి బయలుదేరినా.. నాకు ఏడుపు వచ్చేసినంత పనవుతుంది. దిగులుగా అనిపిస్తుంటుంది. ఆ సమయంలో సైఫ్‌‌ను చాలా మిస్ అవుతుంటా.

 సైఫ్ కామెంట్:

సైఫ్ కామెంట్:

కరీనాపై ఆమె భర్త సైఫ్ కూడా ఇటీవల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్ని.. వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో కరీనా 'ది బెస్ట్' అన్నారు. కరీనా బాధ్యతగల అమ్మగా ఉండటం తనకు చాలా నచ్చిందన్నారు.

 కరీనా ఎప్పుడూ లవ్లీయే..:

కరీనా ఎప్పుడూ లవ్లీయే..:

కరీనా ఎప్పుడూ లవ్లీగానే ఉంటుందని.. తైమూర్‌(కుమారుడు) పుట్టాక ఆమె గ్లామర్ ఇంకా పెరిగిందని సైఫ్ అన్నారు. తైమూర్ కోసం కరీనా చాలా సమయం కేటాయిస్తోందని, వాడికి కూడా వాళ్ల అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పుకొచ్చారు.

రాహుల్‌పై కరీనా:

రాహుల్‌పై కరీనా:

సరే, సైఫ్-కరీనాల అన్యోన్యత గురించి పక్కనపెడితే.. 2002లో రాహుల్ గాంధీపై కరీనా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవడం హాట్ టాపిక్‌గా మారింది. ఒకరకంగా రాహుల్ గాంధీపై తన క్రష్ ను వెల్లడించినట్లుగా కరీనా ఆ కామెంట్స్ చేయడం విశేషం.

 ప్రేమ గురించి ఇలా..:

ప్రేమ గురించి ఇలా..:

ముంబైలో లాక్మే ఫ్యాషన్‌ షో నేపథ్యంలో కరీనా అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అయినట్లు తెలుస్తోంది. అందులో ప్రేమ విషయం గురించి ప్రస్తావించగా కరీనా ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'సరైన సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ప్రేమలో పడతా. నేను ప్రేమించే వ్యక్తి ఆలోచనా విధానం నాలాగే ఉండాలి' అని చెప్పారు.

'రాహుల్‌ గాంధీ అంటే ఇష్టం':

'రాహుల్‌ గాంధీ అంటే ఇష్టం':

మీరు చెప్పినట్టుగానే అలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అని కరీనాకు మరో ప్రశ్న ఎదురైంది. దీంతో కాస్త ఆలోచిస్తూనే.. 'ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ.. నాకు రాహుల్‌ గాంధీ అంటే ఇష్టం. ఆయన గురించి చాలా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది.' అని చెప్పుకొచ్చింది.

'రాహుల్ ఫొటోల్ని చూస్తుంటా..'

'రాహుల్ ఫొటోల్ని చూస్తుంటా..'

అలాగే 'పత్రికల్లో రాహుల్ ఫొటోలను చూస్తూ ఉంటా. నాదేమో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం. రాహుల్‌ది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మా ఇద్దరి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి' అని కరీనా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ కామెంట్స్ బట్టి చూస్తే.. కరీనాకు ఒకప్పుడు రాహుల్ పై క్రష్ ఉండేదేమో అని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.

 వీర్ ది వెడ్డింగ్..

వీర్ ది వెడ్డింగ్..

కరీనా ప్రస్తుతం 'వీరే దీ వెడ్డింగ్‌' చిత్రంలో నటిస్తున్నారు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. సోనమ్‌కపూర్‌, స్వరాభాస్కర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శశాంకా ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
When asked about falling in love and settling down, Bebo said that she will wait for the right time when she falls in love and the person who will be as strong and she is and must match her level of thinking.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu