For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ 'టెంపర్' పై నితిన్ కామెంట్స్

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘టెంపర్‌' ఈ నెల 13న విడుదల కానుంది. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ‘టెంపర్‌' సాంగ్స్ ని, ఓ యాక్షన్ ఎపిసోడ్ ని యువ హీరో నితిన్ చూసారు. పూరితో ఉన్న చనువుతో నితిన్ వీక్షించి, చాలా ఎక్సైట్ అయ్యారు. ఈ విషయాన్ని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ లో పంచుకున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  నితిన్ ట్వీట్ చేస్తూ....టెంపర్ సాంగ్స్ ని, ఒక యాక్షన్ ఎపిసోడ్ ని చూడటం జరిగింది. పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ తన టెంపర్ ని బెస్ట్ చూపించారు. టైటిల్ సాంగ్ లో ఎన్టీఆర్ డాన్స్ లు అయితే అవుట్ స్టాండింగ్ !! అన్నారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాని ఈ రేంజిలో పొగడటంతో అంతటా చర్చనీయాంశంగా మారింది.

  నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ ‘‘మణిశర్మగారు రీరికార్డింగ్‌ చేస్తున్నారు. సెన్సార్‌ పనులు త్వరలోనే పూర్తవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 13న విడుదల చేస్తాం. అనూప్‌ అందించిన బాణీలకు చాలా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో పూరి టేకింగ్‌, డైలాగులు ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఎన్టీఆర్‌ పెర్ఫార్మెన్స్‌ హైలైట్‌ అవుతుంది. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా. ఎన్టీఆర్‌ కెరీర్లోనే నెంబర్‌ వన్‌ హిట్‌గా నిలుస్తుంది. కాజల్‌ గ్లామర్‌ సినిమాకు ఎసెట్‌ అవుతుంది'' అని తెలిపారు.

  Young Hero Nitin Raves About Temper Visuals

  అలాగే...'టెంపర్' ఖచ్చితంగా బంపర్ హిట్ కొడుతుందని బండ్ల గణేశ్ ఢంకా బజాయించి చెబుతున్నాడు... నిర్మాతగా తనకు జరిగినదే ఓ సెంటిమెంట్ గా మారిందని, అదే 'టెంపర్' విషయంలోనూ మరోమారు నిజం కానుందని బండ్ల గణేశ్ అంటున్నాడు. గతంలో బండ్ల గణేశ్, పవన్ కళ్యాణ్ హీరోగా 'తీన్ మార్' అనే సినిమాను నిర్మించాడు... ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది... ఆ తరువాత అదే పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేశ్ నిర్మించిన 'గబ్బర్ సింగ్' బంపర్ హిట్టయింది... అంటే ఓ ఫ్లాప్ ఇచ్చిన హీరోతో తరువాత బిగ్ హిట్ ను అందుకొనే అవకాశం తనకు కలిగిందని అంటున్నాడు బండ్ల గణేశ్... అదే ఇప్పుడు 'టెంపర్' విషయంలోనూ మరోమారు నిజం కాబోతుందని బండ్ల గణేశ్ నమ్మకం... బాద్షా తర్వాత ఎన్టీఆర్ తో చేస్తున్న చిత్రం ఇదే.

  ఎన్టీఆర్ మాట్లాడుతూ... ‘‘ గత రెండు మూడు సినిమాలుగా నేను అభిమానుల్ని నిరాశపరిచానని మనిషిగా ఒప్పుకుంటున్నా. అభిమానులు కాలరెగరేసుకుని భూమి మీద తిరగాలన్నదే నా ఆశ. అందుకోసం మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తూనే ఉంటా. ఇన్నాళ్లూ సినిమాలను కష్టపడి చేశాను. కానీ ‘టెంపర్‌'ను కసితో చేశా. ఈ ఏడాది మీద నందమూరి నామ సంవత్సరం అని రాసి ఉంది. అన్నయ్య ‘పటాస్‌'తో మొదలుపెట్టారు. త్వరలో బాబాయ్‌ ‘లయన్‌'గా రానున్నారు. నేను 11 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో చేసిన ‘టెంపర్‌' తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. అనూప్‌తో ‘రభస'కే పనిచేయాల్సింది. ఈ సినిమాకి కుదిరింది'' అని ఎన్టీఆర్‌ అన్నారు.

  పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ.... ‘‘స్ర్కిప్ట్‌ అనుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎగ్జయిట్‌మెంట్‌ తగ్గట్లేదు. ఈ సినిమాలో మేం కొత్త ఎన్టీఆర్‌ని పరిచయం చేస్తున్నామనే చెప్పాలి. ‘ఆంధ్రావాలా'లో ఎన్టీఆర్‌కి, ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి పోలికే ఉండదు. ఆ సినిమాను చూసి అభిమానులు నన్ను తిట్టుకున్నారన్నది వాస్తవం. కానీ ఈ సినిమా తప్పకుండా మెప్పిస్తుది. ఈ సినిమాతో ఎన్టీఆర్‌ ఇచ్చే ఇంపాక్ట్‌ అంత తేలిగ్గా పోదు. ఇందులో హీరో, విలన్‌, కమెడియన్‌.. ఆఖరికి ఐటమ్‌ కూడా ఆయనే. సిక్స్‌ప్యాక్‌ షాట్‌ కోసం మంచినీళ్లు కూడా తాగకుండా 18 గంటల పాటు అలాగే ఉండి సీన్‌ని ఓకే చేశారాయన. అనూప్‌ మంచి సంగీతాన్నిచ్చారు'' అని అన్నారు.

  Young Hero Nitin Raves About Temper Visuals

  ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అలాగే చిత్రం కు స్టన్నింగ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అందుతున్న సమాచారాన్ని బట్టి దాదాపు అన్ని ఏరియాల బిజినెస్ క్లోజ్ చేసేసారు. ఆడియో పంక్షన్ లో ఈ చిత్రం అవుట్ పుట్ టెర్రిఫిక్ గా వచ్చిందని...తను తన సోదరుడు కలిసి ఈ చిత్రాన్ని స్వయంగా విడుదల చేస్తున్నామని బంగ్ల గణేష్ ప్రకటించారు. దానికి తోడు దర్సకుడు పూరి జగన్నాథ్ సైతం కొన్ని ఏరియాలు రైట్స్ తీసుకుంటున్నట్లు వార్త వచ్చింది. దాంతో ప్రి రిలీజ్ బిజినెస్ 42 కోట్ల వరకూ జరిగిందని ట్రేడ్ వర్గాల అంచనా.

  మాగ్జిమం నెంబరాఫ్ థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి షో హైదరాబాద్ భ్రమరాంబ థియోటర్ లో ఉదయం 5.07 నిముషాలకు విడుదల కానున్నదని సమాచారం. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ ఈ విషయమై ప్రకటన చేసి ఉన్నారు. అలాగే .. భ్రమరాంబ థియోటర్ లో గతంలో బాలకృష్ణ లెజండ్ చిత్రం విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ లోగా సీడెడ్ లో చాలా చోట్ల 12 రాత్రి తెల్లారితే 13 అనగా షోలు పడతాయి. అయితే అఫీషియల్ గా ముహూర్తం మాత్రం భ్రమరాంబలో జరగనుంది.

  ఆడియో విడుదల తర్వాత ‘టెంపర్' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రెస్పాన్స్ కు తగిన విధంగానే ఈ చిత్రాన్ని తొలిరోజు భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం. మరో వైపు అమెరికాలోనూ ఈ చిత్రాన్ని 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్‌లెంగ్త్‌ కమర్షియల్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

  ప్రకా్‌షరాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని, సుబ్బరాజు, మధురిమ, బెనర్జీ, వెన్నెల కిశోర్‌, జయప్రకాష్‌ రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం: అనూప్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌.

  English summary
  Young hero Nitin got a chance to watch the visuals of Jr NTR's next week release 'Temper'. He tweeted :'Happend to watch TEMPERsongs and an action episode.purijagan n Ntr r at their "TEMPER"BEST..title song lo Ntr's dance moves r OUTSTANDING!!' said Nitin, after getting excited a lot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X