twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ ...పదేళ్ల ప్రయాణం(ఫోటో పీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'ఈశ్వర్‌' సినిమాతో వెండి తెర ప్రయాణం మొదలుపెట్టారు ప్రభాస్. ఆ సినిమా విడుదలై ఈ రోజు (ఆదివారం)తో పదేళ్లు పూర్తవుతున్నాయి. తొలి నుంచీ ప్రభాస్‌ మాస్‌, యాక్షన్‌ కథలనే నమ్ముకొన్నారు. అయితే మధ్య మధ్యలో ప్రేమ కథలూ చేస్తూ వస్తున్నారు. ''ప్రయోగాలకు నేనేం దూరం కాదు. 'చక్రం', 'డార్లింగ్‌', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' సినిమాలు నా ధోరణికి భిన్నంగా వెళ్లి తీసినవే. అయితే... నాకు స్వతహాగా యాక్షన్‌ సినిమాలంటేనే ఇష్టం'' అంటున్నారు ప్రభాస్‌. అయితే రీసెంట్ గా వచ్చిన సినిమాలు నిరాసపరిచాయి. అయితే ఆయన దృష్టి మొత్తం తాజా చిత్రం 'మిర్చి' పైనే ఉంది. ఈ నేఫద్యంలో ప్రభాస్ పదేళ్ల సిని ప్రస్దానాన్ని ఒక్కసారి పరిద్దాం.

    ప్రభాస్ ...పదేళ్ల ప్రయాణం(ఫోటో పీచర్)

    11-11-2002 న ఈశ్వర్ తో రెబెల్ స్టార్ కృష్ణం రాజు నటవారసుడుగా ప్రభాస్ వెండితెరపై దూకాడు. ఈశ్వర్ ఘన విజయం సాధించకున్నా..చూసినవారంతా మరో తెలుగు స్టార్ హీరో వస్తున్నాడని అన్నారు...ఆశీర్వదించారు. అదే ఊపులో అప్పుడే పదేళ్లు పూర్తి చేసేసాడు.

    ప్రభాస్ ...పదేళ్ల ప్రయాణం(ఫోటో పీచర్)

    రెండో చిత్రం రాఘవేంద్ర కూడా అంతంత మాత్రంగానే ఆడింది. అయితే ఎమోషన్ సీన్స్ లో,యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ ఈజ్ చూసి ఇండస్ట్రీ షాక్ అయ్యింది. అయితే యాక్షన్ లో... సున్నితమైన ప్రేమకథ మిళితం చేస్తూ తీర్చిదిద్దిన 'వర్షం'.. ప్రభాస్‌కి తొలి విజయాన్ని అందించింది.

    ప్రభాస్ ...పదేళ్ల ప్రయాణం(ఫోటో పీచర్)

    'ఛత్రపతి' ప్రభాస్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం. 'ఒక్క అడుగు.. ఒక్క అడుగు..' అంటూ ప్రభాస్‌ ఆవేశంగా పలికిన సంభాషణలు, చేసిన పోరాటాలూ ఆయన్ని మాస్‌ ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. ''ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని విజయాలు దక్కినా నా మనసులో 'ఛత్రపతి'కి ప్రత్యేక స్థానం ఉంటుంది. అందరికీ ఆ సినిమా బాగా నచ్చింది. ఆ సినిమాతో కొత్త అభిమానులూ చేరారు'' అంటూ ఆ సినిమాపై తన అభిమానాన్ని ప్రకటిస్తారాయన.

    ప్రభాస్ ...పదేళ్ల ప్రయాణం(ఫోటో పీచర్)

    వర్షంతో స్టార్ హీరో అయ్యాడు. అడవిరాముడు..పెద్ద ప్లాప్..అయేతేనేం..కమర్షియల్ హీరో ఇమేజ్ ని ప్రభాస్ కి తెచ్చిపెట్టింది. మాస్ హీరోగా ఎదిగాడు. అందుకే చక్రం చేసాడు. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అతనికి మరో వర్గం కలిసింది.

    ప్రభాస్ ...పదేళ్ల ప్రయాణం(ఫోటో పీచర్)

    తర్వాత చేసిన పౌర్ణమి తో ప్యామిలీ హీరో అయ్యాడు. వినాయిక్ తో చేసిన యోగితో మాస్ కి మరింత దగ్గరయ్యాడు. అయితే మున్నాతో సరికొత్త స్టైల్ చూపించి..ఓ ప్రత్యేకతను తెరపై చాటాడు. సినిమా భాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా...ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ చిత్రం పండుగ చేసింది. ఈ చిత్రంతో దర్సకుడు వంశీ పైడిపల్లి కూడా మంచి దర్శకుడు అనిపించుకున్నాడు.

    ప్రభాస్ ...పదేళ్ల ప్రయాణం(ఫోటో పీచర్)

    పూరి జగన్నాథ్‌ సినిమా 'బుజ్జిగాడు'తో తాను సంభాషణలు పలికే తీరులో మార్పు వచ్చిందంటారాయన. 'యాండే... ఓ పాట పాడండే..' అంటూ అల్లరిగా పలికిన విధానం... వినోదం పంచింది. ఆ సినిమా ఫెయిల్యార్ అయినా ప్రభాస్ కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రంగా మిగిలింది. మరో ప్రక్క తమిళ రీమేక్ తో బిళ్లా గా వచ్చాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో క్లాస్ ని,మాస్ ని ఆకట్టుకున్నాడు.

    ప్రభాస్ ...పదేళ్ల ప్రయాణం(ఫోటో పీచర్)

    ఏక్ నిరంజన్ ఫెయిల్యర్, తర్వాత డార్లింగ్ తో డార్లింగ్ అయ్యి, మిస్టర్ ఫెరఫెక్ట్ల్ తో మాత్రం ఫెరఫెక్ట్ హీరో అయ్యాడు. ''ప్రయోగాలకు నేనేం దూరం కాదు. 'చక్రం', 'డార్లింగ్‌', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' సినిమాలు నా ధోరణికి భిన్నంగా వెళ్లి తీసినవే. అయితే... నాకు స్వతహాగా యాక్షన్‌ సినిమాలంటేనే ఇష్టం'' అంటున్నారు ప్రభాస్‌.

    ప్రభాస్ ...పదేళ్ల ప్రయాణం(ఫోటో పీచర్)


    రీసెంట్ గా వచ్చిన రెబెల్ ఫెయిల్యూర్ అయ్యింది. అయితే ఈ చిత్రంతో భాక్సాఫీస్ వద్ద ఓపినింగ్స్ తో తన స్టామినా చూపాడు. ''నా శైలికి ఎలాంటి కథలు నప్పుతాయో నాకు తెలుసు. ఆ కథలనే కొత్తగా తీర్చిదిద్దితే చాలు. భారీ స్థాయి పోరాటాలు అభిమానుల కోసమే. నన్ను అలా చూడడం వాళ్లకు ఇష్టం'' అని చెబుతారు ప్రభాస్‌.

    ప్రభాస్ ...పదేళ్ల ప్రయాణం(ఫోటో పీచర్)

    'మిర్చి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముగింపు దశకు చేరుకొంది. ఆ తరవాత రాజమౌళి దర్శకత్వంలో నటిస్తారు. ఈ చిత్రం డిసెంబరులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

    English summary
    Young Rebel Star Prabhas successfully completes 10 years. His debut movie 'Eeshwar' was released on 11th November, 2002. There after, he has given many hits and super hits to tollywood in a decade of his journey as a hero. His 'Varsham', 'Chatrapathi', 'Billa', 'Darling', 'Mr.Perfect' etc.did well at the box office. prabhas's upcoming flick 'Mirchi' is in a brisk pace of its shoot. This movie is expected to hit the screens in the later half of January, 2013.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X