»   » అతని కోసం కాదు, కథ నచ్చే యుద్దం శరణం చేసాను: నాగచైతన్య ఇలా చెప్పాడు

అతని కోసం కాదు, కథ నచ్చే యుద్దం శరణం చేసాను: నాగచైతన్య ఇలా చెప్పాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
"I Did It For Me Not For Him" Naga Chaitanya Says About "Yudham Saranam"

"యుద్దం శరణం" ఈ మధ్య కాలం లో మంచి బజ్ తో వచ్చిన నాగ చైతన్య మూవీ. ఈ రోజే థియేటర్లలో కి వచ్చింది. ఇప్పటికైతే పాజిటివ్ రెపోర్ట్ ఉంది సినిమా భవిశ్యత్తేమిటన్నది మరి కాసేపట్లో తెలియ బోతోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా అక్కినేని నాగ చైతన్య ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విశేషాలు..

అన్ని రకాల జోనర్లు ఉండేలా

అన్ని రకాల జోనర్లు ఉండేలా

ఫస్ట్‌ టైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌ ఎటమ్ట్‌ చేశాను. కానీ, ఆడియన్స్‌ అందరికీ నచ్చేలా, సినిమాలో అన్ని రకాల జోనర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. స్క్రీన్‌ప్లే మాత్రం థ్రిల్లర్‌ ఫార్మాట్‌లో ఉంటుంది. ప్రతి పది నిమిషాలకు ఏదో ఒక కొత్త ఎలిమెంట్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ప్రోత్సాహానికి హ్యాట్సాఫ్

ప్రోత్సాహానికి హ్యాట్సాఫ్

సాయి కొర్రపాటిగారు న్యూకమర్స్‌కు ఇచ్చే ప్రోత్సాహానికి హ్యాట్సాఫ్. ఈ సినిమాలో చాలా మంది కొత్తవారే. కొత్తవారిని ప్రోత్సహిస్తే ఇండస్ట్రీకి కొత్త కంటెంట్‌ వస్తుంది. ఇండస్ట్రీ గ్రో అవుతూ ఉంటుంది. ఇలా డేర్‌ చేసి న్యూకమర్స్‌కు ఛాన్స్‌ ఇచ్చే ప్రొడ్యూసర్స్‌ ఉండాలన్నది నా అభిప్రాయం.


కంటెంట్‌ మీద అంత గ్రిప్‌ ఉండదు

కంటెంట్‌ మీద అంత గ్రిప్‌ ఉండదు

కార్తికేయ ఈ సినిమాకి లైన్‌ప్రొడ్యూసర్‌. జనరల్‌గా లైన్‌ప్రొడ్యూసర్‌ అంటే కంటెంట్‌ మీద అంత గ్రిప్‌ ఉండదు. ఆ రోజు షూటింగ్‌కి ఏది కావాలి? ఖర్చు ఎలా తగ్గించాలి? అని ఆలోచిస్తారు. కానీ, కార్తికేయకు డైరెక్టర్‌కు ఏం కావాలో, ప్రొడ్యూసర్‌కి ఏ బడ్జెట్‌లో ఫినిష్‌ చేయాలో తెలుసు.


చాలా స్ట్రగుల్‌ అయ్యాడు

చాలా స్ట్రగుల్‌ అయ్యాడు

డైరెక్టర్‌ కృష్ణ నాకు మంచి ఫ్రెండ్‌. నా ఫ్రెండ్‌ అనే అభిమానంతో ఛాన్స్‌ ఇవ్వలేదు. అతను డైరెక్టర్‌ కావాలనే ఆశయాన్ని నమ్మాను. తను కూడా చాలా స్ట్రగుల్‌ అయ్యాడు. నాలుగైదేళ్లు వేరే వేరే డైరెక్టర్ల దగ్గర వర్క్‌ చేశాడు. రెండు, మూడు స్క్రిప్ట్స్‌ రాశాడు. అవి రిజెక్ట్‌ అయ్యాయి. ‘యుద్ధం శరణం' స్క్రిప్ట్‌ నాకు, ప్రొడ్యూసర్‌కి అందరికీ నచ్చింది. కృష్ణను లాంచ్‌ చేయాలని కాకుండా, కథ నచ్చి చేశాం.


సవ్యసాచి

సవ్యసాచి

చందూ మొండేటి డైరెక్షన్‌లో ‘సవ్యసాచి' చేస్తున్నా. ఈ సినిమాలో హీరో లెఫ్ట్‌ హ్యాండ్‌కి, బ్రెయిన్‌తో కంట్రోల్‌ ఉండదు. రైట్‌ హ్యాండ్‌లో ఎంత పవర్‌ ఉంటుందో లెఫ్ట్‌ హ్యాండ్‌లోనూ అంతే పవర్‌ ఉంటుంది. అందుకే ఆ టైటిల్‌ పెట్టాం. సెప్టెంబర్‌ 20న తాత (అక్కినేని నాగేశ్వరరావు)గారి పుట్టినరోజు నాడు షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం. తర్వాత మారుతిగారి డైరెక్షన్‌లో ఓ మూవీ చేయబోతున్నా.


అక్టోబర్‌ 6న గోవాలో పెళ్లి

అక్టోబర్‌ 6న గోవాలో పెళ్లి

మరి ఇంత మాట్లాడిన తర్వాత పెళ్ళివిషయం మాట్లాడకుంటే ఎలా... అందుకే అభిమానుల కోసం ఆ విషయం కూడా చెప్పాడు చైతు సమంతతో తన వివాహం గురించి నాగచైతన్య మాట్లాడుతూ - ‘‘అక్టోబర్‌ 6న గోవాలో పెళ్లి చేసుకోబోతున్నాం. 6న తెలుగు సంప్రదాయం ప్రకారం, 7న క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం మా పెళ్లిని సింపుల్‌గా ప్లాన్‌ చేశాం. రిసెప్షన్‌ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతున్నాం'' అంటూ చెప్పుకొచ్చాడు.English summary
After Naga Chaitanya got engaged to Samantha back in January, Naga Chaitanya scored a huge hit with Ra Randoi Veduka Choodham, and now his upcoming film Yuddham Sharanam is a dream come true considering that it has been directed by his best friend Krishna Marimuthu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu