twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మగధీర'లా మా చిత్రం అదురుతుంది

    By Srikanya
    |

    రామ్ చరణ్ తేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర చిత్రం క్రేజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా 'యుగానికి ఒక్కడు' ప్రమోషన్ లో భాగంగా హీరో కార్తీ (గజనీ హీరో సూర్య తమ్ముడు) మీడియాతో మాట్లాడుతూ..మా చిత్రంలో కొన్ని ఎపిసోడ్స్ అద్బుతంగా ఉంటాయి. అందులో 12వ శతాబ్దం ఎపిసోడ్‌కి బాగా ఖర్చయ్యింది. 'మగధీర'లా సీజీ (కంప్యూటర్‌గ్రాఫిక్స్‌) బాగా ఉంటాయి. ప్రతి సన్నివేశంలోనూ కొన్ని వందల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌ లు ఉంటారు. దట్టమైన అడవుల్లో షూటింగ్‌ చేశాం.బడ్జెట్‌ 40 కోట్లయ్యింది. ఎక్కడా వృధాగా ఖర్చుపెట్టలేదని చెప్పారు.

    ఇక ఈ చిత్రం సెకండాఫ్‌లో దాదాపు ఐదు, ఆరు సెట్లు ఉంటాయి. ఒక్కో సెట్‌ ఖరీదు కోటి రూపాయలు ఉంటుంది అన్నారు. మగధీర అనేది తమ చిత్రం స్టాండర్డ్స్ ని చెప్పటానికి వినియోగించారు. ఇక దర్శకుడు శ్రీ రాఘవ గురించి చెపుతూ..ఈ సినిమా చూసిన తర్వాత జస్ట్‌ 40 కోట్ల రూపాయలలో ఇంత గొప్ప సినిమా తీసినందుకు అందరూ ఆశ్చర్యపోతారు. ఒక భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తీసిన ఘనత ఈ చిత్రదర్శకుడు శ్రీరాఘవకి దక్కుతుంది అన్నారు.

    అలాగే 'యుగానికి ఒక్కడు' చిత్రం కథపరంగా, టేకింగ్‌ పరంగా, బడ్జెట్‌ పరంగా...నటీనటుల పెర్ఫార్మెన్స్‌ పరంగా అన్ని రకాలుగా గొప్పగా ఉంటుందని చెప్తున్నారు.ఇక సెకెండాఫ్ లో 12వ శతాబ్దంలో జరిగే కథతో ఈ చిత్రం సాగుతుంది. ఆ కాలం ఎలా ఉంటుంది? ఎలాంటి దుస్తులు వాడతారు? భాష ఎలా ఉంటుంది? అనే విషయాలపై పరిశోధన జరిపిన తర్వాతే తీశామని వివరిస్తున్నారు. గతంలో సెవన్ బై జి బృందావన కాలనీ, ఆడువారి మాటలకు అర్దాలే వేరులే,ధూళ్ పేట వంటి చిత్రాలు రూపొందించిన శ్రీ రాఘవ దర్శకుడు కావటంతో తెలుగులోనూ ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X