»   » మెగా అప్పులు: వైవిఎస్ చౌదరి థియేటర్ సీజ్

మెగా అప్పులు: వైవిఎస్ చౌదరి థియేటర్ సీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు, నిర్మాత వైవిఎస్ చౌదరి... చివరి సారిగా తెరకెక్కించిన చిత్రం ‘రేయ్'. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ మొదలు పెట్టిన ఈ చిత్రాన్ని చౌదరి ఆర్థికంగా చాలా కష్టనష్టాలకు ఓర్చి తెరక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద తీవ్ర నష్టాలనే మిగల్చడంతో పరిస్థితి అతని చేదాటి పోయింది.

అప్పటికే ఆర్థికగా దెబ్బతిన్న చౌదరి.... గుడివాడలోని తన ‘బొమ్మరిల్లు' థియేటర్ ను తాకట్టు పెట్టి ఆంధ్రాబ్యాంక్ లో లోన్ తీసుకున్నారు. తాను తీసిన సినిమాలు నష్టాలే తప్ప ఒక్క పైసా లాభం తెక పోవడంతో రుణం తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. ధియేటర్ మీద తీసుకున్న బకాయిలను చెల్లించకపోవటంతో ఆంధ్రా బ్యాంక్ అధికారులు గురువారం సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు.


YVS Chowdary theater Seized

వరుస ప్లాపులు వైవిఎస్ చౌదరిని ఆర్థికంగా బాగాదెబ్బతీసాయి. కె.రాఘవేంద్రరావు వద్ద శిష్యరికం చేసిన చౌదరి....నాగార్జున నిర్మించిన ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి' చిత్రంతో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టాడు. ఆ చిత్రం తర్వాత తీసిన సీతారామరాజు, యువరాజు చిత్రాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఆయనకు దర్శకుడిగా అవకాశాలు తగ్గాయి.


దీంతో తనే నిర్మాతగా మారిన చౌదరి..... దేవదాసు, సీతయ్య, లాహిరిలాహిరిలో చిత్రాలు తీసి సక్సెస్ అయ్యారు. మంచి లాభాలు గడించారు. కానీ ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా ఒక్కమగాడు, గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మించిన నిప్పు, చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన రేయ్ చిత్రాల చౌదరిని ఆర్థికంగా ముంచేసాయి.

English summary
YVS Chowdary theater seized by andhra bank officials.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu