twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వైవియస్ నా మార్గదర్శకుడు’:ఇలియానా

    By Srikanya
    |

    హైదరాబాద్ : తన కెరీర్ లో ఎంతమంది పరిచయమైనా,స్నేహితులైనా ఎప్పటికీ తన మార్గదర్శకుడు వైవియస్ చౌదరి అని తేల్చి చెప్పింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ..దేవదాసుతో పరిచయం చేసిన ఆయన అంటే నాకు అభిమానం. నేను వేరే ప్రాజెక్టు చేయటానికి హైదరబాద్ వచ్చాను. కానీ చౌదరి నాకు బ్రేక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ నన్ను కెరీర్ లో ముందుకు వెళ్లేలా చేసింది. ఐదేళ్లు అనంతంరం ఆయనతో సలీం సినిమా సినిమా చేసే అవకాసం వచ్చింది అని గుర్తు చేసుకున్నారు.

    అలాగే తన వివాహం గురించి చెపుతూ...ఎవరైనా సరే ఆస్తి, హోదా.. కంటే మంచి మనసున్న మగాడినే కోరుకొంటారు. నేనూ అంతే. ఎదుటి వారిలో ఎక్కువగా ఇష్టపడేది నిజాయతీనే. కాబోయే వాడు ఎవరైనా ఈ లక్షణం తప్పకుండా చూస్తా అంటూ మనస్సులో మాట చెప్పుకొచ్చింది ఇలియానా. అలాగే నాకు తగిన జోడీ ఎవరన్నది పైన ఉన్న భగవంతుడు ఎప్పుడో రాసిపెట్టేశాడు. వెతికిపెట్టే బాధ్యత మా మమ్మీ తీసుకొంటుంది..రేపటి జీవితం గురించి ఆలోచించేంత అవసరం ఎప్పుడూ రాలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే బెంగ లేదు. అందుకే పెళ్లి గురించి, కాబోయే భర్త గురించీ ఇప్పటి నుంచే కలలు కనడం లేదు అని స్ఫష్టంగా చెప్పుకొచ్చింది.

    మరో ప్రక్క జల్సా,జులాయి అంటూ ఇలియానాని ఎంకరేజ్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు ఆమె పేరు చెపితే మండిపడుతున్నాడని వినపడుతోంది. దానికి కారణం ఆమె జులాయి ప్రమోషన్ కి రాకుండా భాధ్యతారాహిత్యంగా ప్రవర్తించటమే అంటున్నారు. జులాయి ఆడియోకి సైతం డుమ్మా కొట్టిన ఈ ముద్దుగుమ్మ దృష్టి మొత్తం బాలీవుడ్ మీదే ఉండటంతో తెలుగుపై ఆమె పెద్దగా ఆసక్తి చూపించటం లేదని అంటున్నారు. నిజానికి త్రివిక్రమ్ ఈమెని తను పవన్ తో చేయబోతే తదుపరి చిత్రంలోనూ తీసుకుండాని వినిపించింది. ఇప్పుడు అది విరమించుకున్నాడని చెప్తున్నారు.

    ప్రస్తుతం ఈ గోవా భామ తమిళ,హిందీ భాషల్లోనూ ఆమె బిజిగా ఉంది. సిని జీవితం గురించి ఇలియానా మాట్లాడుతూ ''కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమే. విజయంవచ్చిందంటే... వెన్నంటే ఓటమి ఉంటుంది. కెరీర్‌ ప్రారంభంలో వరుసగా సినిమాలు చేశా. మధ్యలో ఆ వేగం తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ మునుపటి జోరు వచ్చేసింది. మరోవైపు బాలీవుడ్‌లో అడుగుపెట్టడం కూడా ఆనందంగా ఉంది''అని చెప్పింది.

    English summary
    Iliyana says...I still remember the encouraging words spoken by director Y.V.S. Chowdary, who introduced me to T-town with Devadasu. I came to Hyderabad to do another film but Chowdary gave me the break. The confidence I gained during that film, has kept in good stead and I got an opportunity to work with him again in Salim after a five years’ gap.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X