కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలతో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు సన్నగిల్లడం.. వీటిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వారం రోజుల కనిష్టానికి చేరిన బంగారం, వెండి ధరలు శుక్రవారం కూడా తగ్గాయి. ప్రారంభ ట్రేడింగ్ లో లోయర్ సర్కుట్ దారి పట్టాయి. అధిక అమ్మకాల ఒత్తిడితో కీలక మద్దతు స్థాయి కంటే దిగువకు పడి తీవ్ర నష్టాలను చవిచూశాయి. దాదాపుగా 2,000 రూపాయల వరకు తగ్గాయి.
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్ లో ఈ ఉదయం స్పాట్ బంగారం ఔన్స్‌కు 4,966.83 డాలర్లకు చేరింది. అంతకుముందు సెషన్‌లో ఇది 5,000 కంటే దిగువకు క్షీణించింది. మూడు శాతానికి పైగా తగ్గింది. స్పాట్ వెండి 2.1 శాతం పెరిగి ఔన్స్‌కు 76.76 డాలర్లకు చేరింది. బుధవారం 11 శాతం వరకు పతనం నుంచి కోలుకుంది వెండి ధర. గురువారం అమెరికా డాలర్ ఇతర కరెన్సీలతో దాదాపు స్థిరంగా కొనసాగింది. తాజా ఆర్థిక సూచికల నుండి మిశ్రమ సంకేతాలు వెలువడ్డాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,709, 22 క్యారెట్లు - రూ. 14,400, 18 క్యారెట్లు - రూ. 12,400
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు - రూ. 11,684
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు - రూ. 11,684
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు - రూ. 11,684
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు - రూ. 11,684
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,578, 22 క్యారెట్లు- రూ. 14,280, 18 క్యారెట్లు - రూ. 11,684
Credit: Oneindia

Click it and Unblock the Notifications