Don't Miss!
- News
హైదరాబాద్‌పై అమెజాన్ ప్రేమ! తొలి ప్రైమ్ ఎయిర్ కార్గో శంషాబాద్‌లో ప్రారంభం
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Sports
KL Rahul : ప్రేయసికి మూడు ముళ్లు వేయనున్న రాహుల్.. ఐపీఎల్ తర్వాత భారీగా రిసెప్షన్!
- Automobiles
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Finance
Amazon Air: వాయువేగంతో అమెజాన్ డెలివరీలు.. హైదరాబాద్ కేంద్రంగా.. కేటీఆర్ ఏమన్నారంటే..
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
OTT: సంక్రాంతి సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. బాలయ్య కంటే ముందుగా మెగాస్టార్ మూవీ!
ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్న కొన్ని సినిమాలు ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇక ఓటీటీ లో కూడా సినిమాలు చూసే జనాల సంఖ్య కూడా ఇప్పుడు చాలా ఎక్కువయ్యింది అని చెప్పాలి. కాస్త యావరేజ్ టాక్ వచ్చిన కూడా ఓటీటీ లో చూసుకుందాం అనే తరహాలోనే ఆలోచిస్తున్నారు. ఇక సంక్రాంతికి విడుదలైన సినిమాలలో అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఇక ఏ సినిమా ఓటీటీ లో ఎప్పుడు రాబోతోంది? ఎందులో స్ట్రీమింగ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళితే..

ముందుగా చిన్న సినిమా
ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలలో ఒక చిన్న సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పోటీకి వచ్చింది. అదే సంతోష శోభన్ నటించిన కళ్యాణం కమనీయం. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకున్నప్పటికీ పెద్ద సినిమాల్లో తాకిడి వలన సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ సినిమా ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

అజిత్ తునివు
ఇక అజిత్ కుమార్ నటించిన తమిళ తొలి మూవీ తునివు తెలుగులో తెగింపుగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా తమిళంలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నప్పటికీ తెలుగులో వర్కౌట్ కాలేదు. ఇక ఓటీటీ లో అయితే తెలుగు తమిళంలోనే కాకుండా హిందీ మలయాళ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదల కాబోతోంది.

విజయ్ వారసుడు
విజయ నటించిన వారిసు సినిమా తమిళంలో ముందుగా విడుదలై ఆ తర్వాత తెలుగులో వారసుడు గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి ఓ మోస్తారుగా కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక ఈ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

వీరసింహారెడ్డి రెడ్డి ఎప్పుడంటే..
నందమూరి
బాలకృష్ణ
నటించిన
వీర
సింహారెడ్డి
సినిమా
కూడా
బాక్సాఫీస్
వద్ద
మంచి
ఓపెనింగ్స్
అందుకుంది.
సంక్రాంతి
ఫెస్టివల్
లో
ఓవర్గం
వారిని
బాగానే
ఆకట్టుకుంది.
కానీ
పూర్తిస్థాయిలో
మాత్రం
ఈ
సినిమా
కూడా
కలెక్షన్స్
అందుకోలేకపోయింది.
ఇక
ఈ
సంక్రాంతి
సినిమాను
ఓటీటీ
లో
ఎప్పుడు
విడుదల
చేస్తారు
అనే
విషయంలో
ఇంకా
అసలైన
క్లారిటీ
రాలేదు.
కానీ
ప్రస్తుతం
వినిపిస్తున్న
టాక్
ప్రకారం
డిస్ని
ప్లస్
హాట్
స్టార్
లో
ఫిబ్రవరి
15వ
తేదీన
ఈ
సినిమా
స్ట్రీమింగ్
కాబోతున్నట్లు
సమాచారం.

సంక్రాంతి విన్నర్ చిరు సినిమా..
ఈ
సంక్రాంతిలో
అసలైన
విజేతగా
మెగాస్టార్
చిరంజీవి
వాల్తేరు
వీరయ్య
నిలిచింది.
ఈ
సినిమాకు
బాక్సాఫీస్
వద్ద
మంచి
ప్రాఫిట్స్
రావడమే
కాకుండా
అన్ని
వర్గాల
ప్రేక్షకుల
నుంచి
కూడా
మంచి
రెస్పాన్స్
వచ్చింది.
ఇక
నెట్
ఫ్లిక్స్
ఈ
సినిమా
ఓటీటీ
హక్కులను
సొంతం
చేసుకుంది.
ఫిబ్రవరి
10వ
తేదీన
ఈ
సినిమాను
ఓటీటీ
లో
స్ట్రీమింగ్
చేసే
అవకాశం
ఉన్నట్లుగా
తెలుస్తోంది.