Sushmita Sen ఆరితేరిన గ్యాంగ్‌స్టర్‌గా సుస్మిత సేన్.. నోట్లో సిగార్.. చేతిలో పిస్టల్‌తో కేక పెట్టించిన ఆర్య

బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ వెండితెరపై అప్పుడప్పుడు కనిపించినా.. ఇటీవల కాలంలో ఓటీటీలో తన హావాను కొనసాగిస్తున్నారు. ఆర్య వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అందాల భామ.. ముదురు వయసులో కూడా ఫెర్ఫార్మెన్స్ పరంగా హంగామా చేస్తున్నారు. ఆర్య వెబ్ సిరీస్‌తో సినీ ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ అందాల సుందరి.. మరోసారి సీజన్ 3తో సిద్దమవుతున్నారు. ఈ ఆర్య సీజన్ 3 ఫస్ట్ లుక్ వివరాల్లోకి వెళితే..

 ఆర్య వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి

ఆర్య వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి

ఆర్య వెబ్ సిరీస్‌లో చంద్రచూడ్ సింగ్‌తో కలిసి జంటగా నటించారు. సంపన్న కుటుంబాల్లో బిజినెస్ లావాదేవీలు, అంతర్గత కుమ్ములాటలు, డ్రగ్స్ మాఫియా తదితర అంశాలతో ఆర్య వెబ్ సిరీస్ తెరకెక్కించింది. తొలి భాగంలో భర్తను కోల్పోయిన ఆర్య.. పిల్లల్ని మాఫియా నుంచి రక్షించుకోవడానికి ఎలాంటి ఎత్తుగడలు వేసిందనే కోణంలో సాగిన ఆర్య వెబ్ సిరీస్‌లో ఇంటెన్సివ్ ఫెర్ఫార్మెన్స్‌తో సుస్మిత ఆకట్టుకొన్నారు.

ఆర్య రెండో సీజన్‌లో పవర్‌ఫుల్‌గా

ఆర్య రెండో సీజన్‌లో పవర్‌ఫుల్‌గా


ఆర్య రెండో సీజన్‌లో బిజినెస్ వ్యవహారాలను చక్కదిద్దే మహిళగా, అలాగే తన భర్తను చంపిన డ్రగ్స్ మాఫియాను ఎదురించే వనితగా.. అద్బుతమైన పెర్ఫార్మెన్స్ చూపించింది. డ్రగ్స్ మాఫియాను మట్టుబెట్టిన ఆర్యగా.. తన ప్రత్యర్థులను తన వ్యూహాలతో చుక్కలు చూపించిన బిజినెస్ ఉమెన్‌గా ఓ విభిన్నమైన పాత్రలో కనిపించింది.

ఆర్య వెబ్ సిరీస్ సీజన్ 3తో

ఆర్య వెబ్ సిరీస్ సీజన్ 3తో


ఆర్య 1, ఆర్య 2 సిరీస్‌లు భారీ హిట్ సాధించడంతో అదే జోష్‌తో ఆర్య 3 వెబ్ సిరీస్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా డిస్నీహాట్ స్టార్ నిర్వహకులు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆమె మళ్లీ వచ్చేస్తున్నారు. బిజినెస్ అంటే.. ఆమె.. ఆమె అంటే బిజినెస్. ఆర్య3 షూటింగ్ ప్రారంభమైంది. త్వరలోనే డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నది అంటూ ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

ఆర్య 3 ఫస్ట్ లుక్ కేక

ఆర్య 3 ఫస్ట్ లుక్ కేక


ఆర్య 3 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వివరాల్లోకి వెళితే.. ప్యాకెట్‌లో నుంచి సిగార్ తీసి.. స్టైల్‌గా లైటర్‌తో వెలిగించడం.. అలాగే.. వివిధ భాగాలుగా ఉన్న పిస్టల్‌ను అమరుస్తూ సుస్మిత సేన్ గ్యాంగ్ స్టర్ అవతారంలో కనిపించింది. స్టైల్‌గా సిగరెట్‌ను నోట్లో పెట్టుకొని.. పిస్టల్ చేతిలోకి తీసుకొని గురిపెడుతూ.. గ్యాంగ్ స్టర్‌గా కొత్త అవతారంలో సుస్మిత సేన్ కనిపించింది. తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్య అంటే సుస్మితకు మారుపేరుగా


ఆర్య 3 ప్రారంభమైన సమయంలో సుస్మిత సేన్ మాట్లాడుతూ.. ఆర్య పేరు నాకు పర్యాయపదంగా మారింది. ఆర్య అంటే సుస్మితా సేన్.. సుస్మితా సేన్ అంటే ఆర్య. ఆర్యగా రెండు సీజన్లలో కనిపిస్తే.. ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఆర్యపై ప్రేమను కురిపించారు. ఆ రెండు సీజన్లు ఇచ్చిన నమ్మకంతో ఆర్య మూడో సీజన్‌లోకి అడుగుపెట్టాను. ఆర్య నాకు కలిగించిన చైతన్యంతో చాలా సంతోషంగా ఉన్నాను అని సుస్మిత సేన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X