Don't Miss!
- Finance
Income Tax: ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పన్ను విధానం మేలు.. అలా జంపింగ్ కుదరదా..?
- News
నీ ఆస్తులపై చర్చకు సిద్ధమా? కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాల్, మంత్రులకు చురకలు!!
- Sports
INDvsAUS : నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న బుమ్రా.. ఆసీస్ టెస్టులకు రెడీనా?
- Lifestyle
Garuda Purana: ఈ చోట్ల భోజనం చేస్తే లేని పాపాలు అంటుకుంటాయి, అవేంటో తెలుసుకోండి
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బాలయ్య అన్ స్టాపబుల్ షోకు ఊహించని షాక్.. అక్కినేని వారి నిర్ణయంతో షూటింగ్ క్యాన్సిల్?
నందమూరి బాలకృష్ణ ఇటీవల అక్కినేని పేరుతో చేసిన ఒక కామెంట్ సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం పై బాలయ్య బాబు ఇంతవరకు పెద్దగా రియాక్ట్ అయ్యింది లేదు. దీంతో ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మొత్తానికి అక్కినేని యువ హీరోలు నాగచైతన్య అఖిల్ ఇద్దరు కూడా స్పందించడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు బాలయ్య చేసిన వ్యాఖ్యల కారణంగా అన్ స్టాపబుల్ షో కు మరొక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

బలయ్య రేంజ్ పెరుగుతున్న సమయంలో..
నందమూరి బాలకృష్ణ ఎంతో ఇష్టంగా చేసిన అన్ స్టాపబుల్ షో ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ షో ద్వారా మాత్రమే కాకుండా బాలకృష్ణ ఎప్పుడు సినిమాలతో కూడా తన స్థాయిని మరింత పెంచుకుంటున్నాడు. ఇక ఆయన రేంజ్ మరో లెవెల్ కు పెరుగుతున్న సమయంలోనే ఇటీవల విరసింహారెడ్డి ఈవెంట్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఊహించిన విధంగా వివాదాస్పదంగా మారాయి.

తొక్కినేని కామెంట్స్ వైరల్
నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ.. సెట్ లో ఉన్నప్పుడు వివిధ రకాల ఆర్టిస్టులతో చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటామని నాన్నగారు అలాగే రంగారావు గారు ఇక అక్కినేని తొక్కినేని అంటూ ఇలా ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటామని బాలయ్య బాబు ఒక కామెంట్ అయితే చేశాడు. దీంతో ఆ విషయంపై అక్కినేని అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

అక్కినేని హీరోల రియాక్షన్
ఇక ఆ విషయంపై అక్కినేని హీరోలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది అని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కొన్ని ట్యాగ్స్ అయితే ట్రెండ్ అయ్యేలా చేశారు. ఇక మొత్తానికి యువ హీరోలు అక్కినేని నాగచైతన్య అక్కినేని అఖిల్ ఇద్దరు కూడా చాలా కూల్ గా బాలయ్య పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్టీ రామారావు గారు ఎస్వి రంగారావు గారు అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు ఇలా అందరూ కూడా తెలుగు కళామతల్లి బిడ్డలు అని.. వారిని గౌరవించకపోతే మనల్ని మనం గౌరవించుకోలేకపోయినట్టే అని బాలయ్య వ్యాఖ్యలపై ఒక స్వీట్ కౌంటర్ అయితే ఇచ్చారు.

అన్ స్టాపబుల్ పై ప్రభావం
అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యల కారణంగా నందమూరి బాలకృష్ణ పేరు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు మరొక కొత్త న్యూస్ కూడా సోషల్ మీడియాలో ఫాన్స్ లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే అన్ స్టాపబుల్ షూటింగ్ పై కూడా ఈ వివాదం ప్రభావం చూపించబోతున్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

ఆహాకు అన్నపూర్ణ నుంచి మెస్సేజ్
అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ నుంచి మొన్న పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూట్ వరకు కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే షూట్ చేశారు. అయితే ఇప్పుడు 9వ ఎపిసోడ్ కోసం బాలకృష్ణ అన్ స్టాపబుల్ షూట్ లో పాల్గొనడానికి రెడీ అవుతుండగా అన్నపూర్ణ స్టూడియో నుంచి ఆహా టీంకు ఒక మెసేజ్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. బాలయ్య బాబును ఎంత మాత్రం మేము స్టూడియోలోకి అడుగుపెట్టనివ్వమని వారి నుంచి మెసేజ్ వచ్చినట్లుగా టాక్ వినబడుతోంది. తొమ్మిదవ ఎపిసోడ్ ను మరొక గెస్ట్ తో షూట్ చేసి త్వరలోనే విడుదల చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత పదవ ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను రిలీజ్ చేయాలని అనుకున్నారు. మరి ఈ వివాదం షోపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.