For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ghost: ప్రముఖ సంస్థ చేతికి ఘోస్ట్ రైట్స్.. నాగార్జున కెరీర్‌లో రికార్డు

  |

  లెజెండరీ యాక్టర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన మార్కును చూపిస్తూ స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. కెరీర్‌ను ఆరంభించిన చాలా తక్కువ సమయంలోనే తన సత్తాను నిరూపించుకుని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అలాగే, ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకున్నారు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే, చాలా కాలం పాటు నాగార్జున విజయాన్ని అందుకోలేక ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చారు.

  యాంకర్ శ్రీముఖి అందాల జాతర: ఆమెనిలా చూశారంటే చెమటలే

  చాలా కాలంగా సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న అక్కినేని నాగార్జున.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో 'బంగార్రాజు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఆయన కుమారుడు యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా నటించాడు. కల్యాణ్ కృష్ణ కురసాల రూపొందించిన ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు రాబట్టుకుని హిట్‌గా నిలిచింది. దీంతో నాగార్జున తన తదుపరి చిత్రాలపై ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన తన ప్రతిష్టాత్మక చిత్రం 'ఘోస్ట్' మూవీ పనులతో ఫుల్ బిజీగా ఉన్నారు.

  Amazon Prime Bagged Ghost Movie Digital Rights

  వాస్తవానికి 'బంగార్రాజు' మూవీ కంటే ముందే కింగ్ అక్కినేని నాగార్జున.. విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారుతో 'ఘోస్ట్' అనే సినిమాను మొదలు పెట్టారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా మొత్తానికి ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ, కొద్ది రోజుల తర్వాత ఇది పున: ప్రారంభించి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకున్నారు. అంతేకాదు ఆ వెంటనే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టేశారు.

  హాట్ షోలో గీత దాటిన మెహ్రీన్: బికినీలో బీభత్సమైన ఫోజులు

  నాగార్జున 'ఘోస్ట్' మూవీని అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇప్పటికే ఓ టీజర్‌ను కూడా వదిలారు. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ డీల్ ముగిసినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'ఘోస్ట్' మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందట. ఇందుకోసం భారీ మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ధర నాగార్జున సినీ కెరీర్‌లోనే అత్యధిక మొత్తం అని కూడా ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఘోస్ట్' మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇందులో అక్కినేని నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా చేస్తున్నట్లు ఇప్పటికే రివీల్ చేశారు. ఇందులో ఆయనకు జోడీగా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం అందిస్తున్నారు.

  English summary
  Akkineni Nagarjuna Now Doing Ghost Movie Under Praveen Sattaru Direction. Now Amazon Prime Bagged This Movie Digital Rights.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X