For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Anchor Sreemukhi అతనికి మూడో గర్ల్ ఫ్రెండ్.. సీక్రెట్ బయట పెట్టొద్దంటూ బుల్లితెర రాములమ్మ!

  |

  సినీ గ్లామర్ ప్రపంచంలో నటిగా కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ శ్రీముఖి తర్వతా యాంకర్ గా స్థిరపడంది. బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన బొద్దుగుమ్మ స్టార్ యాంకర్ గా వెలుగొందుతోంది. చలాకీ మాటలతో బిగ్గరగా అరుస్తూ, కొంటె ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటూ మంచి ఇమేజ్ సంపాదించుకుంటోంది శ్రీముఖి. మొదట్లో పటాస్ షోలో యాంకర్ రవితో శ్రీముఖి చేసిన రచ్చ ఎవరు మర్చిపోలేరు. తన వాయిస్ తో, కామెడీ టైమింగ్ తో ఆద్యంతం షోని ఇంట్రెస్టింగ్ గా సాగేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు బీబీ జోడి అనే డ్యాన్స్ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటోంది.

  సినిమాల్లో హీరోయిన్ గా..

  సినిమాల్లో హీరోయిన్ గా..

  యాంకర్ శ్రీముఖి త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్ మూవీ జులాయితో ఇండస్ట్రీకి పరిచయమైంది. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు చెల్లెలుగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి యమ పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఫుల్ పాపులర్ అయింది.

  బుల్లితెర రాములమ్మగా పేరు..

  బుల్లితెర రాములమ్మగా పేరు..

  సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపై 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఆమె వరుసగా షోల మీద షోలు చేస్తూనే పాపులారిటీ పెంచుకుంటూ పోయింది. ఇలా శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్', 'ఆహా డ్యాన్స్ ఐకాన్' వంటి అనేకమైన సక్సెస్‌ఫుల్ షోలు చేసి బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకుంది.

  బీబీ జోడీకి హోస్ట్ గా..

  బీబీ జోడీకి హోస్ట్ గా..

  ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ తర్వాత వస్తున్న బీబీ జోడి డ్యాన్స్ రియాలిటీ షోకి ఈ బుల్లితెర రాములమ్మ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోలో అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్విని, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-ఇనయా సుల్తానా, ఆర్జే చేతూ-ఆర్జే కాజల్, అవినాష్-అరియానా, మెహబూబ్-అషు రెడ్డి జోడీలుగా ఉన్నారు.

  డ్యాన్స్ లతో ఆకట్టుకున్న జోడీలు..

  అలాగే బీబీ జోడీకి న్యాయ నిర్ణేతలుగా అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు బ్యూటిఫుల్ హీరోయిన్ సదా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టార్ కొనసాగనున్నారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో నిర్వహిస్తున్న ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోను ప్రతి శని, ఆది వారాల్లో ప్రసారం చేస్తున్నారు. వచ్చే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో ప్రాపర్టీ రౌండ్ లో భాగంగా జోడీలంతా తమ డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు.

  క్యూట్ స్మార్ట్.. దుమ్ము బాబోయ్..

  క్యూట్ స్మార్ట్.. దుమ్ము బాబోయ్..

  ప్రాపర్టీ రౌండ్ లో భాగంగా ఆర్జే చైతు అండ్ ఆర్జే కాజల్ ఇద్దరు స్కూల్ విద్యార్థుల డ్రెస్ లో క్లాస్ రూమ్, బెంచ్ లను వాడుకుని డ్యాన్స్ చేశారు. రవితేజ విక్రమార్కుడు సినిమాలోని జింతాక్ తా పాట సిగ్నేచర్ స్టెప్పు వేస్తూ అలరించారు. వీళ్ల డ్యాన్స్ పర్ఫామెన్స్ కి క్యూట్.. స్మార్ట్.. దుమ్ము బాబోయ్.. దుమ్ము అని కాంప్లిమెంట్ ఇచ్చారు జడ్జ్ రాధ. తర్వాత వీళ్లిద్దరకి ఒక టాస్క్ ఇచ్చింది యాంకర్ శ్రీముఖి.

  నేను నీకు ఏం చేశాను..

  నేను నీకు ఏం చేశాను..

  గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అని రాయాల్సిందిగా శ్రీముఖి చెప్పినట్లు తెలుస్తోంది. దానికి ఆర్జే చైతూ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఇద్దరు అని రాస్తే కాజల్ ముగ్గురు అని రాసింది. అప్పుడు ఆ మూడో వ్యక్తి నాతో 4 నెలలుగా మాట్లాడట్లేదు అని ఆర్జే చైతు అన్నాడు. దీనికి నేను ఏం చేశాను నీకు అని అదొకలాగా అంది యాంకర్ శ్రీముఖి.

  అప్పుడు చెప్పమంటావా ఆని కాజల్ అంటే.. వద్దులే.. ఎందుకు.. అని శ్రీముఖి అంది. శ్రీముఖి అలా సీక్రెట్ చెప్పినివ్వకుండా ఉండేసరికి.. బ్యాక్ గ్రౌండ్ లో ఏదో తేడాగా ఉందేంటి అని సౌండ్ వినిపించారు. దీంతో అందరూ తెగ నవ్వేశారు.

  English summary
  Anchor Sreemukhi Making Fun With RJ Chaitu Over His Third Girlfriend In BB Jodi Reality Dance Show
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X