Don't Miss!
- News
వైఎస్ వివేకా హత్య కేసులో మున్ముందు అనూహ్య పరిణామాలు?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Finance
Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Sudigali Sudheer: సుధీర్‌పై డైరెక్టర్ సీరియస్.. ఫస్ట్ నైట్ అనుభవం.. అలా అయితే పెళ్లి కాదంటూ!
ఇప్పటికీ బుల్లితెరపై అనేక కామేడీ షోలు తెగ సందడి చేశాయి. అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో తెలుగు ఓటీటీ వేదికగా ప్రేక్షకులు మన్ననలు పొందుతోంది ఆహా. సరికొత్త కాన్సెప్ట్స్ తో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే కామెడీ షోను స్టార్ట్ చేసింది. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ పేరుతో బుల్లితెరపై కమెడియన్లతో నవ్వులు పంచనుంది. ఈ షోలో ఫస్ట్ నైట్ అనుభవం అంటూ తదితర ఆసక్తిర అంశాలపై డైరెక్టర్ అనిల్ రావిపూడి అసహనం వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

డిఫరెంట్ కాన్సెప్ట్ లతో..
ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. విభిన్నమైన కథలతో సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా పలు షోలు కూడా నిర్వహిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. రియాలిటీ షో, టాక్ షో, డ్యాన్స్ షో అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆడియెన్స్ నవ్వించేందుకు కామెడీ షోలు సైతం వస్తున్నాయి. ఈ క్రమంలోనే కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే సరికొత్త కామెడీ షో ప్రారంభమైంది. ఈ షోకి ఛైర్మన్ గా సరిలేరు నీకెవ్వరు, F2, F3 చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి యాంకర్స్ గా అలరించనున్నారు.

ఛైర్మన్ మనసు గెలుచుకుని..
ఇక సెలబ్రిటీ కమెడియన్స్ అయిన వేణు, అవినాష్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్, యాదమ్మ రాజు స్టాక్స్ గా ఉండనున్నారు. ఈ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోలో మూడు రౌండ్స్ ఉండనున్నాయి. ఇందులో కమెడియన్స్ స్టాక్స్ గా ఉంటారు. అలాగే ఇన్వెస్టర్లుగా ఆడియెన్స్ ఉంటారు. అంటే స్టాక్స్ కు ఆడియెన్స్ ఓట్లు వేస్తారు. అక్కడ ఎక్కువ ఓట్లు గెలుచుకున్న వారు ఛైర్మన్ మనసు గెలుచుకుని టాప్ స్టాక్ గా పేరు తెచ్చుకుంటారు.

తాజాగా రెండో ఎపిసోడ్ ప్రోమో..
ఆహా ఓటీటీ వేదిక అందిస్తున్న సరికొత్త కామెడీ ఎంటర్టైన్ మెంట్ షో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ 10 ఎపిసోడ్స్ గా సాగనుంది. ఆహాలో డిసెంబర్ 2 నుంచి ఈ నవ్వుల షో ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ ప్రసారం చేసిన ఈ షో తాజాగా రెండో ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయనుంది. ఇందులో భాగంగానే ఈ రెండో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసింది ఆహా. ఈ ప్రోమోలో ఒక్కొక్క కమెడియన్ వివిధ గెటప్పులో ఎంట్రీ ఇచ్చారు.

కాస్తా కూల్ గా మాట్లాడొచ్చు కదా..
ఈ ప్రోమోలో దీపిక పిల్లితో డైరెక్టర్ అనిల్ రావిపూడి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. తర్వాత ఫోన్ లో మాట్లాడుతూ ఏంటీ.. గోంగూర.. తోటకూరా అంటూ చిరాకుగా కనిపించారు అనిల్ రావిపూడి. దీంతో ఎందుకు సర్ వైఫ్ తో అంతా ఫ్రస్టేషన్.. కాస్తా కూల్ గా మాట్లాడొచ్చు కదా హ్యాపీగా అని సుధీర్ అంటే.. అతనికి ఫోన్ విసిరేసి.. మాట్లాడు అని అనిల్ రావిపూడి అన్నాడి. దీంతో సుధీర్ షాక్ అయ్యాడు. అదే బెండకాయలు, బీరకాయలు కావాలంటా వెళ్లి తీసుకెళ్లు అని అనిల్ రావిపూడి అన్నారు.

ఎలక్షన్స్ కు చేసినంతగా..
వద్దు సార్ అని సుధీర్ అంటే.. మాకు తెలీదా.. పెళ్లి అయిందా.. అని అనిల్ రావిపూడి అంటే.. లేదని సుధీర్ అన్నాడు. దీంతో అవ్వదు కూడా అని సెటైర్ వేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. స్కిట్ లో భాగంగా అవినాష్ ఫస్ట్ నైట్ స్కిట్ చేశాడు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎంత హడావిడి చేస్తారో.. ఫస్ట్ నైట్ బెడ్ డెకరేట్ చేసేప్పుడు అంతే హడావిడి చేస్తారు అని నవ్వించాడు అవినాష్. తర్వాత స్కిట్ అయిపోయాకా.. స్కిట్ గురించి చెప్పమని అనిల్ రావిపూడిని సుధీర్ అడిగాడు.
సుధీర్ పై డైరెక్టర్ అసహనం..
ఛైర్మన్ సార్.. సార్ ఏంటీ బిజీగా ఉన్నారని సుధీర్ అంటే.. ఏంటీ.. ఫస్ట్ నైట్ ఎక్స్ పీరియిన్స్ చెప్పమంటావా ఏంటీ.. అని అనిల్ రావిపూడి అన్నాడు. దీంతో అందరూ నవ్వగా.. అయ్యో లేదు సార్ అని సుధీర్ షాక్ అయ్యాడు. చేశాడు బాగుంది. దీనిమీద కూడా పేరాగ్రాఫ్ నేనెక్కడ చెప్పగలను అంటూ అసహనం వ్యక్తం చేశాడు అనిల్ రావిపూడి. అయితే ఇదంతా కామెడీలో భాగంగా అలా మాట్లాడారు అనిల్ రావిపూడి.