Don't Miss!
- News
Vastu tips: ఇంట్లో ఈ సింపుల్, పాజిటివ్ వస్తువులు పెట్టుకోండి.. ధనవర్షం కురుస్తుంది నమ్మండి!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Non Stop Finale దొంగ సచ్చినోళ్లు.. అనిల్ రావిపూడి, సునీల్‌పై అరియానా తిట్లదండకం.. ఏం జరిగిందంటే?
బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఫినాలే ఘనంగా జరుగుతున్నది. ఈ వేడుకలో F3 మూవీ ప్రమోషన్స్‌ను బ్రహ్మండంగా చేసుకొన్నారు. వేదికపైన మెహ్రీన్, సునీల్, దర్శకుడు అనిల్ రావిపూడి నవ్వులు పూయించారు. అయితే బిగ్‌బాస్ ఫినాలేలో ఆసక్తికరమైన సూట్‌కేస్ వ్యవహారాన్ని అనిల్ రావిపూడి రక్తి కట్టించారు. సూట్ కేసును అనిల్ చేతిలో పెట్టి కంటెస్టెంట్‌ను మెప్పించి బయటకు తీసుకొచ్చే బాధ్యతను అనిల్ రావిపూడిపై హోస్ట్ నాగార్జున పెట్టారు. అయితే బిగ్‌బాస్ ఇంటిలోకి సునీల్‌ను తీసుకొని అనిల్ రావిపూడి అడుగు పెట్టాడు. అయితే సూట్ కేసు తీసుకొని ఎవరైనా ఇంటి నుంచి వస్తారా అంటే.. అనిల్ రావిపూడి అడిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

సునీల్ అందాల రాముడు
ఇంటిలోకి వచ్చిన అనిల్ రావిపూడి అందంగా ఉన్నాడంటూ అరియానా కాంప్లిమెంట్ ఇచ్చింది. అయితే వెంటనే నాగార్జున జోక్యం చేసుకొంటూ.. సునీల్ అందంగా లేడా అంటే.. వెంటనే తడుముకోకుండా సునీల్ అందాల రాముడు అంటూ కవరింగ్ ఇచ్చింది. దాంతో సునీల్, అనిల్ రావిపూడి నవ్వుల్లో మునిగిపోయారు. ఆ తర్వాత సూట్ కేసుతో బేరం మొదలుపెట్టారు.

డబ్బు కోసమే ఇంటిలోకి వచ్చా
అయితే హోస్ట్ నాగార్జున అడిగిన ప్రశ్నకు అరియానా సమాధానం ఇస్తూ.. నేను ఓటీటీ షోకు కేవలం డబ్బు కోసమే వచ్చాను. ఇళ్లు కొనాలనే కోరికతోనే ఉన్నాను అందుకే నేను షోలోకి వచ్చాను. డబ్బు నాకు చాలా ఇంపార్టెంట్ అని అరియానా అన్నారు. అయితే చివరికి అరియానా సూట్ కేసు తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చారు. అయితే వచ్చే ముందు సూట్ కేసులో డబ్బు మాత్రం ఉందని చెప్పడంతో అరియానా హ్యాపీగా ఫీలయ్యింది.

సూట్ కేసులో డబ్బు లేదని షాక్
అయితే సూట్ కేసు తీసుకొని వేదికపైకి వచ్చిన అరియానాను అనిల్ రావిపూడి, సునీల్, నాగార్జున ఆటపట్టించారు. సూట్ కేసులో డబ్బు లేదని ఏడిపించారు. దాంతో అరియానా ఒక్కసారిగా షాక్ తిన్నది. అనిల్ రావిపూడి మాటలు నమ్మాను అని అరియానా అంటే.. బిగ్‌బాస్ ఆర్గనైజర్ చెప్పమన్నది చెప్పాం అని అనగానే అరియానా షాక్ మరింత షాక్ తిన్నది.

నన్ను సునీల్, అనిల్ మోసగించారు
అయితే తనను మాటలు చెప్పి మోసగించారు ఈ దొంగ సచ్చినోళ్లు అంటూ అనిల్ రావిపూడి, సునీల్ తిట్లదండకం మొదలుపెట్టింది. అయితే డబ్బు మహత్యం అలా ఉంటుంది అని అనిల్ రావిపూడి అన్నారు. డబ్బు లేకపోతే నేను కిందపడిపోతాను అని చెప్పింది. అయితే గ్యాలరీలో ఉన్న బాబా భాస్కర్ మాట్లాడుతూ.. సూట్ కేసులో 500 మాత్రమే ఉన్నాయని చెప్పడంతో అరియానా మరింత డీలా పడింది.

10 లక్షల బంపర్ ఆఫర్
అయితే అరియానాను హోస్ట్ నాగార్జున, అనిల్ రావిపూడి, సునీల్ ఆటపట్టిస్తూ ఏడిపించారు. చివరకు సూట్ కేసులో ఒకటి పక్కన ఆరు సున్నాలు ఉన్నాయి అని చెప్పడంతో అందులో 10 లక్షలు ఉన్నాయని తేలిపోయింది. దాంతో అరియానా ఎగిరి గంతేసింది. వెంటనే నాగార్జున కాళ్లకు నమస్కరించింది. అనిల్ రావిపూడికి హగ్ ఇచ్చింది.

అరియానా విన్నర్ అంటూ
బిగ్ బాస్ షో నుంచి అరియానా గ్లోరి జీవితాన్ని నేర్చుకొన్నది అంటూ ప్రశంసలతో నాగ్ ముంచెత్తారు. బిగ్ బాస్‌లో విన్నర్ అంటూ నాగ్ అప్రిషియేట్ చేశారు. పది లక్షలు ఉన్న సూట్ కేసును అరియానాకు అందించాడు. దాంతో ఆమె వేదికపై నుంచి కంటెస్టెంట్లు ఉన్న గ్యాలరీలోకి నడిచింది. దాంతో అరియానా గ్లోరి బిగ్ బాస్ జర్నీ ముగిసింది. సూట్ కేసు తీసుకొని తన అక్కయ్య మంచి పని చేసిందని అరియానా గ్లోరి సోదరి చెప్పడం గమనార్హం.