Don't Miss!
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Finale ఫినాలేకు వచ్చిన టాప్ 5 కంటెస్టెంట్ల ఫ్యామిలీ.. కీర్తి కోసం ఎవరు వచ్చారంటే?
సుమారు 105 రోజులుగా తెలుగు ప్రేక్షకులను ఎన్నో విధాలుగా ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన అత్యంత పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ తుది ఘట్టానికి ఇదే ఆఖరి రోజు. డిసెంబర్ 18 ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలేను ఘనంగా నిర్వహించి ఈ ఆరో సీజన్ టైటిల్ విన్నర్ ను మాజీ కంటెస్టెంట్స్, సెలబ్రిటీలతోపాటు అశేష ప్రేక్షకులు చూస్తుండగా ప్రకటించి.. ట్రోఫీని అందజేయనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేలో సెలబ్రిటీలతో పాటు ఎక్స్ కంటెస్టెంట్స్, టాప్ 5 కంటెస్టెంట్స్ కుటుంబం సభ్యులు హాజరయ్యారు. అయితే సీరియల్ నటి కీర్తి భట్ కు మాత్రం ఎవరు లేని కారణంగా ఆమె కోసం ఎవరు వచ్చారన్న విషయం ఆసక్తిగా మారింది.

టాప్ 5 కంటెస్టెంట్స్ తో నాగార్జున..
ప్రస్తుతం హౌజ్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ రేవంత్, రోహిత్, శ్రీహాన్, కీర్తి భట్, ఆదిరెడ్డి ఉన్నారు. డిసెంబర్ 18న అంటే ఇవాళ చాలా గ్రాండ్ గా ఫినాలే జరుగుతోంది. ఈ ఫినాలేలో స్టైలిష్ లుక్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. స్టేజి పైకి వచ్చిన నాగార్జున ఎక్స్ కంటెస్టెంట్స్ తోపాటు టాప్ 5 కంటిస్టెంట్స్ కుటుంబ సభ్యులను పలకరించారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఆదిరెడ్డి కోసం భార్య కవిత..
ఎంతో గ్రాండ్ గా జరుగుతున్న బిగ్ బాస్ తెలుగు 6 ఫినాలేలోకి టాప్ 5 కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఆదిరెడ్డి కోసం అతని భార్య కవిత, తండ్రి హాజరయ్యారు. కవితను ఆదిరెడ్డి గురించి పలు విషయాలను అడిగాడు నాగార్జున. తర్వాత ఆదిరెడ్డి తండ్రితో మాట్లాడాడు. రేవంత్ కోసం అతని తల్లి సీతా సుబ్బలక్ష్మీ హాజరయ్యారు. రోహిత్ కోసం అతని తల్లిదండ్రులతోపాటు మెరీనా అబ్రహం వచ్చింది.

కీర్తి కోసం లక్షల్లో..
ఇక
శ్రీహాన్
కోసం
కూడా
అతని
తల్లిదండ్రులు
ఇద్దరు
వచ్చారు.
ఇక
కీర్తి
కోసం
ఎవరు
వచ్చారా
అని
చాలా
మందికి
అనుమానాలు
కలిగాయి.
హౌజ్
లో
చాలా
సార్లు
తనకు
ఎవరు
లేరని,
తనకు
ఇష్టమైన
వాళ్లను
ఆ
దేవుడు
తీసుకెళ్లిపోతాడని
చాలా
సార్లు
బాధపడింది.
ఫ్యామిలీ
వీక్
లో
వచ్చిన
మిగతా
కంటెస్టెంట్ల
కుటుంబ
సభ్యులు,
సన్నిహితులు
కీర్తికి
తాము
ఉన్నామని
భరోసా
ఇచ్చారు.
ఆమె
కోసం
బయట
లక్షల్లో
కుటుంబ
సభ్యులు
ఉన్నారని
బిగ్
బాస్
కూడా
ఆమె
జర్నీలో
చెప్పారు.

కీర్తికి ఎలాంటి సంబంధం లేదు..
ఇక ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ తెలుగు 6 ఫినాలేలోకి కీర్తి కోసం బెంగళూరు నుంచి ఇద్దరు వచ్చారు. అందులో ఒకరి పేరు నరేష్. అతనికి కీర్తికి ఎలాంటి సంబంధం లేదు. కానీ కీర్తి కోసం నాలాంటి ప్రేక్షకులు చాలా మంది ఉన్నారని, వారికి ప్రతినిదిగా వచ్చానని చెప్పాడు. అలాగే తనకు కీర్తి ఫ్రెండ్ అన్నాడు. అతనికి తెలుగు బాగా రాదని అంటే చాలా బాగా మాట్లాడుతున్నావని నాగార్జున మెచ్చుకున్నాడు.

కీర్తికి టీమ్ లీడర్ గా..
అలాగే
కీర్తికి
బయట
చాలా
పెద్ద
ప్యామిలీ
ఉందని
అతను
తెలిపాడు.
తర్వాత
కీర్తి
కోసం
మరొక
వ్యక్తి
శంకర్
అని
వచ్చారు.
కీర్తి
ఆమె
కెరీర్
ను
అతని
సంస్థ
ద్వారానే
ప్రారంభించిందట.
ఆమెకు
టీమ్
లీడర్
గా
కూడా
పనిచేశానని,
అందుకే
కీర్తికి
మద్దతుగా
తాను
వచ్చానని
అతను
చెప్పారు.
ఇదిలా
ఉంటే
బిగ్
బాస్
ఎపిసోడ్స్
లలో
ఫ్యామిలీ
వీక్
లో
భాగంగా
ఫోన్
కాల్
లో
మానస్
మాట్లాడాడు.
అలాగే
ఇంట్లోకి
మహేష్
బాబు
కాళిదాసు
వచ్చి
సందడి
చేశాడు.

బంధువులు సరిగ్గా చూడలేకపోయేసరికి..
అయితే ఈ ఫినాలేలో కీర్తి కోసం మిగతా వారికంటే డిఫరెంట్ గా ఆడియెన్స్ నుంచి ఒకరిని తీసుకురావడం విశేషం. ఇదిలా ఉంటే కీర్తి భట్ ఫ్యామిలీ కారు యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి బయటపడిన కీర్తి కొద్దిరోజులపాటు కోమాలో ఉండిపోయింది. తర్వాత ఆమెను బంధువులు సరిగ్గా చూడలేకపోయేసరికి అక్కడి నుంచి బయటకు వచ్చి చాలా కష్టాలు పడింది.