For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu: నాగార్జునకు వేలు చూపించిన లేడి కంటెస్టెంట్.. షాకింగ్ గా మారిపోయిన రియాక్షన్!

  |

  అశేష ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రధానంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులోనూ ప్రారంభమై వరుస సీజన్లతో దూసుకుపోతోంది. సెలబ్రిటీ షోగా పేరొందిన ఈ రియాలిటీ షోలో అనేక మంది సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తుంటారు. అలాగే పెద్దగా లైమ్ లైట్ లో లేని ఆర్టిస్ట్ లు, టాలెంటెడ్ యువతీయువకులు సైతం ఇందులో పాల్గొని విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ఆరో సీజన్ పూర్తి కాగా సరికొత్తగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో బీబీ జోడీ అనే డ్యాన్స్ షోని తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో నాగార్జునకు వేలు చూపిస్తూ రెచ్చిపోయింది ఓ లేడీ కంటెస్టెంట్.

  ఆరో సీజన్ విన్నర్ రేవంత్..

  ఆరో సీజన్ విన్నర్ రేవంత్..

  విపరీతమైన ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులో 2017లో ప్రారంభమైంది. తొలుత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసి సక్సెస్ సాధించడంతో వరుసపెట్టి సీజన్లతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఐదు రెగ్యూలర్ (టీవీ), ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఇటీవల ఆరో సీజన్ కూడా పూర్తి కాగా విన్నర్ గా సింగర్ రేవంత్ నిలిచాడు.

   భిన్నమైన నైపుణ్యాలు ఉన్న..

  భిన్నమైన నైపుణ్యాలు ఉన్న..

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే సూపర్బ్​ రెస్పాన్స్​తో దూసుకుపోతోంది బిగ్​బాస్ రియాలిటీ షో. ప్రతి సీజన్​ను మరింత జోష్​తో, మరింత ఆదరణతో ముందుకు సాగుతోంది. అయితే బిగ్​బాస్​ షో కొంతమందికి సినిమా అవకాశాలు, పాపులారిటీ, ఐడెంటిటీ తెచ్చిపెట్టి అద్భుతమైన అవకాశం. సెలబ్రిటీ షో గా ప్రారంభమైన ఈ షోలో మొదట్లో సెలబ్రిటీలే ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సీజన్ లు పెరిగినకొద్ది.. సీరియల్ నటినటులు, సోషల్ మీడియా స్టార్స్, రివ్యూవర్స్, యాంకర్స్, జర్నలిస్ట్స్ ఇలా విభిన్న నైపుణ్యాలు కలిగిన వ్యక్తులను కంటెస్టెంట్లుగా తీసుకొచ్చారు.

  ఉదయం పూట డ్యాన్స్ చేస్తూ..

  ఉదయం పూట డ్యాన్స్ చేస్తూ..

  ఇలా విభిన్నమైన నైపుణ్యాలు ఉన్న టాలెంటెడ్ పీపుల్స్ ను, సెలబ్రిటీస్ లను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా తీసుకొచ్చారు. ఇక వాళ్లందరు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాక ఉదయం పూట డ్యాన్స్ చేస్తూ అలరిస్తుంటారు. ఈ కంటెస్టెంట్లలో ఎంతోమంది డ్యాన్సర్స్ ఉన్నారు. వారందరిచేత బీబీ జోడీలో డ్యాన్స్ చేయిస్తున్నారు. ఇటీవల ఈ బీబీ జోడికి సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ ఫినాలే వేదికగా విడుదల చేశారు.

  యాంకర్ గా బుల్లితెర రాములమ్మ..

  యాంకర్ గా బుల్లితెర రాములమ్మ..

  బీబీ జోడీ డ్యాన్స్ షోలో జోడీలుగా అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్విని, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-స్రవంతి, ఆర్జే చేతూ-ఆర్జే కాజల్, అవినాష్-అరియానా, మెహబూబ్-అషు రెడ్డి ఉన్నారు. వీరందరికి యాంకర్ గా బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి వ్యవహరించనుంది. అలాగే న్యాయ నిర్ణేతలుగా అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు బ్యూటిఫుల్ హీరోయిన్ సదా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టార్ వ్యవహరించనున్నారు.

  అప్పుడే కొత్తగా వచ్చాం..

  అప్పుడే కొత్తగా వచ్చాం..

  ఈ బీబీ జోడి లాంఛ్ ప్రోగ్రామ్ కి టాలీవుడ్ మన్మథుడు నాగార్జున హాజరయ్యారు. ఆయనను పొగుడుతూ వెల్ కమ్ చెప్పింది యాంకర్ శ్రీముఖి. నాగార్జున రాగానే.. విక్కీ దాదా అంటూ రాధ కూర్చుని చిన్న స్టెప్పు వేసింది. అప్పుడు నాగార్జున.. నాకు బాగా గుర్తు.. ఆమెతో ఆ డ్యాన్స్ చేసేటప్పుడు భయపడిపోయేవాన్ని అని అంటే.. నిజంగానా అని రాధ అన్నారు. అవునండీ.. నా టెన్షన్ మీకు తెలియదు.. అప్పుడే కొత్త కొత్తగా వచ్చాం మేము అని నాగార్జున చెప్పాడు.

  వేలు చూపించిన హీరోయిన్...

  నాగార్జున అలా చెప్పడంతో.. ఆ సినిమా మొత్తంలో మీరు నాతో ఎక్కువగా మాట్లాడిందే లేదు అని రాధ డిసప్పాయింటెడ్ గా చెబితే ఒక్కసారిగా నాగార్జున ఎక్స్ ప్రెషన్ మారిపోయింది. తర్వాత అందరూ షాక్ అయి అరవగా.. బీబీ జోడీ కంటెస్టెంట్స్ వైపు నాగార్జున చూశారు. అప్పుడు హీరోయిన్ తేజస్వి మదివాడ.. నాగార్జునకు వేలు చూపిస్తూ.. ఆ.. అని సరదాగా అంది. తర్వాత నాగార్జున, రాధ ఇద్దరు కలిసి వేలు చూపిస్తూ డ్యాన్స్ చేశారు.

  English summary
  Nagarjuna As Guest To BB Jodi Dance Show And Dance With Heroine Radha Promo Released. Tejaswi Madivada Showing Finger To Nagarjuna In This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X