Don't Miss!
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Finance
Sebi: 19 సంస్థలకు షాక్ ఇచ్చిన సెబీ.. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం..
- News
ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏం జరుగుతుంది.. పార్టీలో ఆయనకెందుకీ ఉక్కపోత!!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Bigg Boss Telugu 6 ఇంటి సభ్యుల పశ్చాత్తాపాలు.. వరెస్ట్ కెప్టెన్ పై చర్చ.. శ్రీహాన్ మాటకు షాకైన శ్రీసత్య!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనూహ్య పరిణామాలతో దూసుకుపోతోంది. ఎన్నో అనుమానాలు, అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సీజన్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్ లో 8 మంది ఉన్నారు. ఎప్పటిలానే ఈ వారం మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. ఇక ఈ సీజన్ 13వ వారం ఒకరు ఎలిమినేట్ అయితే హౌజ్ లో ఏడుగురు మాత్రమే ఉంటారు. వచ్చే వారంలో ఇద్దరిని తొలగించి టాప్ లోకి ఐదుగురిని టాప్ 5లోకి పంపిస్తారు. ఇక ఇదిలా ఉంటే శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున వచ్చి రివ్యూస్, వార్నింగ్స్, అప్రిసియేషన్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా డిసెంబర్ 3 శనివారం నాటి 90వ ఎపిసోడ్ రెండో ప్రోమోను విడుదల చేశారు.

రిగ్రీట్ ఫీల్ అయిన వారమేంటీ..
ప్రోమోలో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. మీరు హౌజ్ లో ఎన్ని వారాలు ఉన్నారో.. అన్ని వారాలు మీ ముందు కనపడుతున్నాయి. అందులో ఏ వారంలో మీరు రిగ్రీట్ (పశ్చాత్తాపం) ఫీల్ అయిన వారం, విషయం గురించి చెప్పమని ఇంటి సభ్యులకు తెలిపాడు. జబర్దస్త్ కమెడియన్ ఫైమా వచ్చి ఆరో వారంపై ముల్లును ఉంచింది. ఆరో వారంలో ఏం జరిగిందని నాగార్జున అడగ్గా.. అందరు అంటున్నారు కదా సార్ వెటకారం.. వెటకారం అని.. అక్కడి నుంచే స్టార్ట్ అయింది సార్. ఆరోజు నేను కొంచెం తగ్గి మాట్లాడితే బాగుండేది సార్ అని ఫైమా సమాధానం ఇచ్చింది.

రెచ్చిపోయి చాలా మాటలు అన్నాను..
అనంతరం వచ్చిన ఇనయా సుల్తానా.. తొమ్మిదో వారంపై ముల్లు ఉంచింది. తొమ్మిదో వారంలో స్ట్రాప్స్ గేమ్ జరిగింది సార్. నన్ను బాగా రెచ్చగొట్టారు. అలా రెచ్చిపోయి నేను వాళ్లను ఎన్నో మాటలు అన్నాను. అలా అనకుండా ఉండాల్సింది అని ఒక ఫీలింగ్ ఉంది సార్ అని ఇనయా చెప్పింది. ఎనిమిదో వారం చేపల టాస్క్ లో తెలిసో, తెలియకుండానో నేను గీతూ రాయల్ ని హర్ట్ చేశాను సార్. అబ్బా అలా చేసి ఉండకుంటే బాగుండు అని హర్ట్ అయ్యాను సార్ అని రేవంత్ చెప్పుకొచ్చాడు.

కీర్తిని ఇమిటేట్ చేయడం..
11వ వారంపై ముల్లు ఉంచిన శ్రీసత్య.. కీర్తిని ఇమిటేట్ చేయడం జరిగిందని తెలిపింది. సో అది కొంచెం అనవసరంగా ఇమిటేట్ చేశానని రిగ్రీట్ ఫీల్ అవుతున్నాను అని శ్రీసత్య అంది. దీనికి నాగార్జున ఇంకా అని అడిగారు. అంతేసార్ అని శ్రీసత్య అంటే.. నో మోర్ రిగ్రీట్ అని నాగార్జున మళ్లీ మళ్లీ అదే అడిగారు. షూర్ సార్ అని చాలా కాన్ఫిడెంట్ గా శ్రీసత్య చెప్పింది. దానికి శ్రీహాన్ విషయంలో ఏ రిగ్రీట్ లేదా అని నాగార్జున అడిగారు.

జనాల నుంచి ఏం ఆశించను..
శ్రీహాన్ విషయం గురించి నాగార్జున అడగ్గా.. లేదు అని శ్రీసత్య బదులిచ్చింది. తర్వాత వెంటనే రేవంత్ విషయంలో అని అడిగారు నాగార్జున. అందుకు కూడా లేదని సమాధానం ఇచ్చింది శ్రీసత్య. దీంతో నాకు అయితే వాళ్లు ఇద్దరు చాలా మారిపోయారని నా ఫీలింగ్ అని నాగార్జున అంటే మారారు సార్ అని శ్రీసత్య అంది. అదే కదా నేను అడిగింది అని నాగార్జున అన్నారు. నేను కేవలం ఇవ్వడం వరకే సార్.. జనాల నుంచి ఏం ఆశించను సార్ అని శ్రీసత్య సమాధానం ఇచ్చింది.
బెస్ట్ అండ్ వరెస్ట్ కెప్టెన్ ఎవరు..
ఫ్యామిలీ వీక్ తర్వాత చాలా మార్పు కనపడింది అని నాగార్జున అంటే.. నాకు అది కొంచెం హర్ట్ అయ్యాను అంతే అని శ్రీసత్య చెప్పింది. అది చెప్పొచ్చు కదా అని నాగార్జున అంటే.. తనకు (శ్రీహాన్) తెలుసు సార్ నేను హర్ట్ అయ్యానని శ్రీసత్య అంది. దీనికి వెంటనే తెలీదు సార్ అని శ్రీహాన్ అన్నాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయి శ్రీహాన్ ని చూసింది శ్రీసత్య. తర్వాత హౌజ్ లో బెస్ట్ కెప్టెన్, వరెస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పాల్సిందిగా నాగార్జున తెలిపారు. ఏంటా అంతా సాఫీగా సాగిపోతుంది అని అనుకున్నాను సార్ అప్పటికీ అని రేవంత్ అన్నాడు. దీనికి నాగార్జున నవ్వుతో ప్రోమోను ముగించారు.