Don't Miss!
- News
‘వందే భారత్’లో కూడా అలాగే చేస్తున్నారా?
- Sports
హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే టీమిండియా కొంపముంచింది: వసీం జాఫర్
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Lifestyle
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం దురదృష్టాన్ని ఇలా అదృష్టంగా మార్చేసుకోవచ్చు
- Finance
Jio, Airtel: జియో, ఎయిర్టెల్కు పెరిగిన డిమాండ్.. !
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Bigg Boss Telugu 6: సూర్యపై కోపం ఉంది చేశా.. అతను నేను ఒక్కటా? యాంకర్ పై ఇనయా ఫైర్
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్ లో మొదటి నుంచే ఎలిమినేషన్స్ షాకింగ్ గా మారాయి. టైటిల్ ఫెవరెట్ గా నిలిచినవాళ్లు, టాప్ 5 కంటెస్టెంట్స్ ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అవుతూ అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇక ఈసారి ఏకంగా టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఇనయా సుల్తానా ఎలిమినేట్ అయింది. ఆమె ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా నడుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా బీబీ కేఫ్ కు హాజరైన ఇనయా సుల్తానా లేడీ టైగర్ లా ఆన్సర్స్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆర్జీవీ వీడియోతో పాపులర్..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా ఒక సాధారణ అమ్మాయిలా ఎంట్రీ ఇచ్చింది ఇనయా సుల్తానా రెహ్మాన్. బర్త్ డే పార్టీలో ఆర్జీవీతో కలిసి ఉన్న వీడియోతో పాపులర్ అయిన మొదటి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయి వెళ్తుందని అంతా భావించారు. కానీ తనదైన ఆట తీరుతో అశేషమైన ప్రేక్షకుల మనసును సంపాదించుకుంది. పరిణామాలు ఎలాంటివో తెలియదు కానీ మొత్తానికి 14వ వారం ఎలిమినేట్ అయిందీ ఈ లేడీ టైగర్.

షాక్ అయిన శివ..
బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినట్ అయిన ఇంటి సభ్యులను బీబీ కేఫ్ ద్వారా నాన్ స్టాప్ సీజన్ కంటెస్టెంట్, యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తాడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 14వ వారం ఎలిమినేట్ అయిన ఇనయా సుల్తానా బీబీ కేఫ్ కు హాజరైంది. ఆమెకు పలు ఆసక్తికర క్వశ్చన్స్ వేసి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ రాబట్టాడు యాంకర్ శివ. అయితే కొన్ని ప్రశ్నలకు ఇనయా ఇచ్చిన సమాధానాలకు షాక్ అవ్వడం యాంకర్ శివ వంతు అయింది.

టైటిల్ విన్నర్ అని..
హాయ్ ఇనయా.. ఎలా ఉన్నావ్ అని యాంకర్ శివ అడిగితే.. బాధలో ఉన్నా అని ఇనయా అంది. ఎందుకని వెంటనే ప్రశ్నించాడు యాంకర్ శివ. ఇంకొక్క వీక్ ఉండి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ 14వ వారం వరకు వచ్చా అని ఇనయా సుల్తానా అంది. దీనికి అంటే.. ప్రతిసారీ టైటిల్ విన్నర్ నాదే అని చెప్పి అరిచేదానివి కదా హౌజ్ లో అని యాంకర్ శివ అడిగితే.. ఎవరికీ వాళ్లు అలా అనుకుంటేనే కుదురుతుంది అని ఇనయా సమాధానం ఇచ్చింది..

ఏ డిస్కషన్ లో డౌన్ అయ్యా..
ప్రతీసారి నేనే టైటిల్ విన్నర్ అని అనడం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదా అని యాంకర్ శివ అంటే.. నామీద నాకున్న నమ్మకం అని సింపుల్ గా ఆన్సర్ ఇచ్చేసింది ఇనయా. మొదటి వారంలోనే ఇనయా బయటకు వచ్చేస్తుందనుకున్నారు. కానీ సడెన్ గా ఒక్కసారిగా గ్రాఫ్ చాలా పెరిగింది ఇలా.. కొన్నిరోజులకు మళ్లీ డౌన్ అయింది అని యాంకర్ శివ అంటే.. ఏ డిస్కషన్ లో అయిందని చాలా క్యూరియాసిటీగా అడిగింది ఇనయా సుల్తానా.

నాకు సపోర్ట్ లేదనిపించింది..
ఇనయా అడిగిన దానికి సూర్య విషయంలో. లవ్ ట్రాక్ అని యాంకర్ శివ అంటే.. లవ్ అని నేను చెప్పానా ఎప్పుడైనా అక్కడ అని తిరిగి ప్రశ్నించింది ఇనయా. దీంతో షాక్ అయి సైలెంట్ అయిపోయాడు శివ. ఫస్ట్ 3 వారాల్లో అందరూ కార్నర్ చేస్తున్నారు అని చెప్పి చాలా సార్లు అనడం జరిగిందని యాంకర్ శివ అంటే.. నాకు సపోర్ట్ లేదనిపించింది అక్కడ హౌజ్ లో అని ఇనయా అంటుంటే.. రాను రాను వాళ్లే సపోర్ట్ చేశారు కదా అని శివ అన్నాడు.

అనిపించింది చెప్పా..
నీ గురించి తెలుసుకుని సూర్య నీ దగ్గరికి వచ్చాడా.. సూర్య గురించి తెలుసుకుని నువ్ వెళ్లావా అని శివ అడిగితే.. సూర్య గురించి తెలుసుకుని నేను వెళ్లలేదు అని ఇనయా అంది. ఇదే బీబీ కేఫెలో సూర్య నా దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలుసా.. సూర్య గురించి రేవంత్ దగ్గర బ్యాక్ బిట్చింగ్ చేశావ్ అని అడగ్గా.. బ్యాక్ బిట్చ్ అంటే అప్పుడు కోపం వచ్చిందని ఇనయా చెప్పింది. నచ్చినప్పుడు మంచిగా మాట్లాడతావ్.. నచ్చకుంటే ఎన్ని స్టేట్ మెంట్స్ అయినా వదులుతావ్ అని శివ అంటే ఎన్ని స్టేట్ మెంట్లు కాదు అప్పుడు అనిపించింది చెప్పా అని స్ట్రాంగ్ గా అంది ఇనయా.
తెలియనప్పుడు ఎందుకు చెప్పావ్..
ఫొటోల్లో ఉన్న వ్యక్తుల గురించి చెప్పే టాస్క్ ఇచ్చారు. రేవంత్ ఫొటోకు.. తను ఇప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాడు. ఇంకొక తర్వాత ఇంకోలా ప్రవర్తిస్తాడు అని ఇనయా చెప్పింది. నీలాగా అని యాంకర్ శివ అంటే.. తన గురించి అడిగావ్.. నన్నెందుకు తీసుకొస్తావ్ మధ్యలో అని గట్టిగా అడిగింది ఇనయా సుల్తానా. నువ్వేగా అన్నావ్ కదా.. నాకు ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా చేస్తా అని శివ అన్నాడు. దీంతో నేను తను ఒకేలా బిహేవ్ చేస్తామా అని శివను ఇనయా అడిగితే.. నాకు తెలియదబ్బా అని శివ అన్నాడు. తెలియనప్పుడు ఎందుకు చెప్పావ్ అని ఫైర్ అయింది ఇనయా. దీంతో ఆన్సర్ చెప్పలేకపోయాడు శివ.