For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: వాళ్లిద్దరు నా ఫేవరేట్, అందులో తక్కువగా చూస్తారు.. వాసంతి కామెంట్స్

  |

  అశేష ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులో 2017లో ప్రారంభమైంది. తొలుత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసి సక్సెస్ సాధించడంతో వరుసపెట్టి సీజన్లతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఐదు రెగ్యూలర్ (టీవీ), ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆరో సీజన్ షాకింగ్ ట్విస్ట్ లతో ముందుకు సాగుతోంది. అతి త్వరలో ఈ సీజన్ కూడా పూర్తి కానుంది. ఇదిలా ఉంటే తాజాగా బీబీ కేఫ్ కు క్యూట్ బ్యూటీ, గ్లామర్ క్వీన్ వాసంతి కృష్ణన్ హాజరైంది.

  ఎమోషనల్ గా ప్రయాణాలు..

  ఎమోషనల్ గా ప్రయాణాలు..

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్. 14వ వారం పూర్తి చేసుకుని 15వ వారాన్ని కంటిన్యూ చేస్తోంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే నిర్వహించి టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. 14వ వారం ఇనయా సుల్తానా ఎలిమినేట్ కాగా 15వ వారంలో మిడ్ వీకి ఎలిమినేషన్ లో భాగంగా బుధవారం మరొకరిని హౌజ్ నుంచి బయటకు పంపనున్నారు. గత రాత్రి జరిగిన 99వ రోజు 100వ ఎపిసోడ్ లో సింగర్ రేవంత్, శ్రీసత్య బిగ్ బాస్ జర్నీని ఎమోషనల్ గా చూపించారు.

  ఎలాంటి నెగెటివిటీ లేని..

  ఎలాంటి నెగెటివిటీ లేని..

  ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బీబీ కేఫ్ కు బిగ్ బాస్ తెలుగు 6 మాజీ కంటెస్టెంట్, ఎలాంటి నెగెటివిటీ మూటగట్టుకోని గ్లామర్ క్వీన్ వాసంతి కృష్ణన్ హాజరై సందడి చేసింది.

  చివరిగా స్నేహం చూశాను..

  చివరిగా స్నేహం చూశాను..

  వాసంతిని అరియానా గ్లోరి ఇన్వైట్ చేయగా ఇద్దరు కలిసి "రాను రాను అంటూనే చిన్నదో" పాటకు స్టెప్పులేసి అలరించారు. బీబీ 6 ఫినాలే వీక్.. టాప్ 6 హౌజ్ లో ఉన్నారు. ఈ ఆరుగురిలో నీ ఫేవరెట్ ఎవరు అని అరియానా అడిగితే.. రేవంత్ అండ్ కీర్తి అని సమాధానం ఇచ్చింది వాసంతి. వాళ్లలో ఏం నచ్చింది మీకు అని మళ్లీ అరియానా అడగ్గా.. గొడవలు పడినా, ఏం చేసిన ఎండ్ ఆఫ్ ది డే.. ఒక ఫ్రెండ్షిప్ అనేది నా సైడ్ నుంచి చూశాను నేను రేవంత్ లో అని వాసంతి అంది.

  ఓటింగ్ పోల్ చూసుంటే బాగుండు..

  ఓటింగ్ పోల్ చూసుంటే బాగుండు..

  ఈ టాప్ 6లో వీళ్లు కాకుండా వీళ్లు ఉంటే బాగుండు అని అనిపించిన వాళ్లు ఎవరైనా ఉన్నారా అని అడిగిన అరియానా ప్రశ్నకు సస్పెన్స్ మ్యూజిక్ తో రివీల్ చేయలేదు. మిడ్ వీక్ ఎవిక్షన్ ఉందని హౌజ్ మేట్స్ కి ఇంకా తెలియదు. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఎవరు బాటమ్ లో ఉన్నారు అని అనుకుంటున్నావ్ అన్నదానికి.. ఓటింగ్ పోల్ నేను చూసి వచ్చుంటే బాగుండు నేను చెప్పేదాన్ని అని వాసంతి సమాధానం ఇస్తే.. టు బ్యాడ్ బిగ్ బాస్ చెప్పి పంపించొచ్చు కదా అని అరియానా అంది.

  ఎవరు బిడ్డింగ్ కాయలేదు..

  ఎవరు బిడ్డింగ్ కాయలేదు..

  నేను ఒకటి చెప్పనా.. బాగా ఆడితేనే కదా వాళ్లు ఇంతదూరం వచ్చారు. సో వాళ్లందరు డిజర్వే అని అనుకుంటున్నాను అని వాసంతి కృష్ణన్ తెలిపింది. సరే మీ చావు చావండి.. నేను చచ్చినా ఆన్సర్ చెప్పను అని అంటున్న వాసంతి కృష్ణన్. శ్రీసత్య గురించి మాట్లాడుకుంటే గనుక.. మొన్నే అన్ని టాస్క్ లు గెలిచింది. పాపం శ్రీసత్య మీద ఎవరు బిడ్డింగ్ కాయలేదు అని అరియానా అంది.

  తక్కువ అంచనా వేయడంలో..

  ఈ హౌజ్ లో ప్రత్యేకంగా అమ్మాయిలను కొంచెం ఫిజికల్ గా డౌన్ డౌన్ డౌన్ అనే చూస్తారు. నాతో కూడా అలా జరిగిందని వాసంతి కృష్ణన్ తెలిపింది. ఇలా తక్కువ అంచనా వేయడంలో ప్రధాన పాత్ర ఎవరిదీ అంటారు అని అరియానా అడిగిన దానికి మళ్లీ సస్పెన్స్ మ్యూజిక్ వదిలారు. కానీ వాసంతి కృష్ణన్ ఇచ్చిన ఆన్సర్ కి అరియానా షాక్ అవుతూ టేబుల్ పై చేయి పెట్టి పోజు ఇచ్చింది.

  English summary
  Bigg Boss Telugu 6 Contestant Vasanthi Krishnan Says Revanth And Keerthi Bhat Are Her Favorite With Ariyana Glory In BB Cafe Episode 87 Promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X