Don't Miss!
- News
'సజ్జల' మాట విని వారిద్దరూ ఏమయ్యారో చూడండి?
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Bigg Boss విన్నర్ బిందుమాధవి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు ఎంత డిమాండ్ చేస్తోందంటే?
బిగ్ బాస్ నాన్ స్టాప్ ద్వారా మంచి క్రేజ్ అందుకోవడమే కాకుండా టైటిల్ విన్నర్ గా నిలిచిన బిందుమాధవి పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ లోకి రాకముందు వరకు కూడా తమిళం తెలుగులో కొన్ని సినిమాలు చేసినా బిందుమాధవి ఇప్పుడు హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని అడుగులు వేస్తోంది. అయితే ఈ బ్యూటీ బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ద్వారా పారితోషికం విషయంలో కాస్త ఎక్కువగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క సినిమాకు ఎంత అడుగుతుంది అనే వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ పోరాటం
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో టైటిల్ విన్నర్ గా నిలిచిన బిందుమాధవి ఎలాంటి పోటీ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హౌస్ లో ఉన్నన్ని రోజుల్లో కూడా టాస్క్ లలో ఆమె పెద్దగా గెలవకపోయినాప్పటికీ కూడా తన సమాధానాలతో ఆడియన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా అఖిల్ పై ఆమె పోరాడిన విధానం కూడా అందరికీ కనెక్ట్ అయింది.

అదే ప్లస్ అయ్యింది..
బిందు మాధవి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలుస్తుందని ఆడియన్స్ ముందే ఊహించారు. నాలుగైదు వారాల లోపే ఆమె బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలబడుతుంది అని చాలా మంది చెప్పారు. ఇక ఆ తర్వాత బిందుకు పరిస్థితులు కూడా చాలా బాగా ఉపయోగపడ్డాయి. అఖిల్ తప్పితే మిగతా ఎవ్వరూ కూడా బిగ్ బాస్ షోలో గట్టిగా నిలదొక్కుకోలేక పోయారు. ఒక విధంగా మిగతా వారు పెద్దగా క్లిక్ అవ్వకప్పవడం కూడా బిందుకు చాలా ఉపయోగపడింది.

అనిల్ రావిపూడి ఛాన్స్
ఇక బిందు మాధవికి బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు అనిల్ రావిపూడి తప్పకుండా ఛాన్స్ ఇస్తాను అని ఒక మాట ఇచ్చాడు. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో పాల్గొన్న అనిల్ రావిపూడి త్వరలో బాలకృష్ణ తో చేయబోయే సినిమాలో తప్పకుండా ఆమె పాత్ర ఉండేలా స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తాను అని అన్నాడు.

తొందర పడకుండా..
అలాగే మరొక పెద్ద ప్రాజెక్టులో కూడా సపోర్టింగ్ రోల్ చేసే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమాల్లో అవకాశాలు చాలానే వస్తున్నాయట. అయితే బిందుమాధవి మాత్రం ఇంతవరకు ఒక్క ప్రాజెక్టుపై కూడా అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టులు కూడా బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బిందుమాధవి మాత్రం తొందర పడకుండా తనకు నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అవుతోందట.

రెమ్యునరేషన్ ఎంతంటే?
అంతా బాగానే ఉంది కానీ బిందుమాధవి పారితోషికం విషయంలో కూడా కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ ద్వారా ఆమెకు భారీ స్థాయిలో ఆదాయం లభించింది. ఇక ఇప్పుడు ఒక్కో సినిమాకు 40 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఒక విధంగా గతంలో హీరోయిన్ గా కూడా ఆమె 25 లక్షల వరకు పారితోషికం అందుకుంది. కాబట్టి ఇప్పుడు ఆ స్థాయిలో డిమాండ్ చేయడంలో తప్పు లేదని కూడా అంటున్నారు. మరి ఈ బ్యూటీ ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో చూడాలి.