Dance Ikon ఉత్కంఠ భరితంగా డ్యాన్స్ ఐకాన్ ఫినాలే.. విజేత ఎవరో తెలుసా?
తెలుగు వినోద రంగంలో 100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆహా ఆలరిస్తున్నది. సినిమాలు, వెబ్ సిరీస్, రియాలిటీ షోలతో నంబర్ 1 ఓటీటీగా ముద్ర వేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నది.ఇటీవల ప్రారంభించిన డ్యాన్స్ ఐకాన్ షో గ్రాండ్‌గా ముగిసింది. ఇటీవల సినీ ప్రముఖుల సమక్ష్యంలో అంగరంగ వైభవంగా, అనుక్షణం ఉత్కంఠను రేపే విధంగా డ్యాన్స్ ఐకాన్ ఫినాలే ముగిసింది. ఈ ఫినాలేలో విజేతగా ఎవరు నిలిచారనే విషయంలోకి వెళితే..

13 వారాలపాటు ఆసక్తికరంగా
డ్యాన్స్ ఐకాన్ రియాలిటీ షో 13 వారాల క్రితం భారీ అంచనాలతో మొదలైంది. మొదటి వారం నుంచే కంటెస్టెంట్లు శక్తికి మించి ప్రదర్శనలు చేశారు. ప్రతీ ఒక్కరు విజేతల మాదిరిగా ఫెర్పార్మెన్స్ చేశారు. ఈ డ్యాన్స్ షోకు న్యాయమూర్తులుగా, శ్రీముఖి, యష్ మాస్టర్, మోనాల్ గజ్జర్ వ్యవహరించారు. ఆద్యంతం ఈ ఫినాలే ఉత్కంఠగా జరిగింది. ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరించారు.

డ్యాన్స్ ఐకాన్ ఫినాలేకు ముఖ్య అతిథులుగా
డ్యాన్స్ ఐకాన్ గ్రాండ్ ఫినాలేకు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, నిర్మాతలు రవిశంకర్, బాపినీడు, సూర్యదేవర, విశ్వప్రసాద్ నాగవంశీ, వివేక్ కూచిబోట్ల పాల్గొన్నారు. కంటెస్టెంట్స్ కోసం జరిగిన వేలం పాటలో తమకు ముఖ్య అతిథులు పోటీ పడటం ఈ షోకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. కంటెస్టెంట్లకు ఊపు తెప్పించేలా షోను ఓంకార్ నిర్వహించారు.

రాజు, ఆసీఫ్ విజేతలుగా
డ్యాన్స్ ఐకాన్ రియాలిటీ షో ఫినాలేలో కొరియోగ్రాఫర్ రాజు, కంటెస్టెంట్ ఆసిఫ్ జట్టు విజేతగా నిలిచింది. టాప్ కంటెస్టెంట్ల మధ్య పోటీ భారీగా ఉండటంతో.. ఎవరు గెలుస్తారనే విషయం ఆసక్తిగా మారింది. ఓటింగ్, ప్రతిభ, ఇతర వివరాల ఆధారంగా విజేతను ఖరారు చేశారు. ఆసిఫ్ 20 లక్షల నగదు, విన్నర్ ట్రోఫిని అందుకొన్నారు. ఇక కొరియోగ్రాఫర్ రాజు టాలీవుడ్‌లో స్టార్ హీరోకు కొరియోగ్రఫి చేసే అవకాశం దక్కించుకొన్నారు.

ఊహించనంత రెస్పాన్స్
డ్యాన్స్ ఐకాన్ ఫినాలే ముగిసిన తర్వాత ఆహా సీఈవో అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. 13 వారాలుగా సాగిన డ్యాన్స్ ఐకాన్ షోకు ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. కంటెస్టెంట్లు పోటీ పడి మంచి కంటెంట్ ఇచ్చారు. ప్రతీవారం న్యాయమూర్తులుగా వ్యవహరించిన సెలబ్రిటీలు ఈ షోను పాపులర్ చేశారు. ఈ షోను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.
డ్యాన్స్ అద్బుతమైన జర్నీ
డాన్స్ ఐకాన్ విన్నర్ కొరియోగ్రాఫర్ రాజు మాట్లాడుతూ.. డాన్స్ ఐకాన్ విజేతగా నా టీమ్ నిలవటం మరచిపోలేను ఈ జర్నీలో భాగమైన నా కంటెస్టెంట్ రాజుకి థ్యాంక్స్. నా తోటి కొరియోగ్రాఫర్స్ వారి ప్రతిభతో ఛాలెంజ్ చేశారు. అలాగే ప్రతీవారం జడ్జీలు కూడా నాలో స్ఫూర్తి నింపారు. ప్రతీ ఒక్కరు అందించిన సహకారంతో విజేతగా ఈ రోజు మీ ముందు నిలిచాం. షోను విజయవంతం చేసిన ప్రేక్షకులకు, ఆహా యాజమాన్యానికి థాంక్స్. నా కలను నిజం చేశారు అని అన్నారు.


Click it and Unblock the Notifications











