twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Darlings review ఆలియా పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీసింది.. కానీ సినిమాకు అవే మైనస్!

    |

    నటీనటులు: ఆలియాభట్, షెఫాలీ షా, విజయ్ వర్మ, రోషన్ మ్యాథ్యూ తదితరులు
    రచన, దర్శకత్వం: జస్మిత్ కే రీన్
    డైలాగ్స్: విజయ్ మౌర్య, పర్వీజ్ షేక్, జస్మిత్ రీన్
    నిర్మాత: గౌరీ ఖాన్చ ఆలియా భట్, గౌరవ్ వర్మ
    సినిమాటోగ్రఫి: అనిల్ మెహతా
    ఎడిటింగ్: నితిన్ బేద్
    మ్యూజిక్: ప్రశాంత్ పిళ్లై, విశాల్ భరద్వాజ్
    బ్యానర్: రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్
    ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
    ఓటీటీ రిలీజ్ డేట్: 2022-08-05

    డార్లింగ్స్ కథ ఏమిటంటే?

    డార్లింగ్స్ కథ ఏమిటంటే?


    రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేసే హమ్జా షేక్‌ (విజయ్ వర్మ)‌ను బద్రున్నీసా (ఆలియాభట్) ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకొంటుంది. అయితే మద్యానికి విపరీతంగా బానిసైన హమ్జా తన భార్య బద్రును విపరీతంగా కొట్టడం, టార్చర్‌కు గురిచేస్తుంటాడు. గృహ హింస మోతాదు పెరిగిపోవడంతో తన తల్లి షామషున్నీసా అన్సారీ (షెఫాలీ షా)తో కలిసి హమ్జాపై బద్రు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది.

    డార్లింగ్స్‌లో ట్విస్టులు

    డార్లింగ్స్‌లో ట్విస్టులు


    ప్రేమించి పెళ్లి చేసుకొన్న వ్యక్తి చేతిలో వేధింపులకు గురైన బద్రు మానసిక పరిస్థితి ఏమిటి? తండ్రి లేని కారణంగా తల్లి పెంపకంలో పెరిగిన బద్రు పెళ్లి తర్వాత ఎదురైన పరిస్థితులపై ఎలా స్పందించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బద్రు ఎందుకు మనసు మార్చుకొంటుంది. భర్త వ్యసనాలను మార్పించే ప్రయత్నంలో సఫలమైందా? భర్త వేధింపులను ఎలా తిప్పి కొట్టింది అనే ప్రశ్నలకు సమాధానమే డార్లింగ్స్ సినిమా కథ.

    ఫస్టాఫ్ టార్చర్‌గా

    ఫస్టాఫ్ టార్చర్‌గా


    పేదరికంతో మధ్య తరగతి కుటుంబంలో పెరిగిన బద్రు అందరి మాదిరిగానే మంచి ఇల్లు, ప్రేమించే భర్తను కోరుకొంటుంది. విలాసవంతమైన, ఫ్యాషన్‌తో కూడిన జీవితాన్ని ఆస్వాదించాలని కలలు కన్న బద్రు జీవితంలోకి శాడిస్ట్ భర్త ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే పాయింట్‌ను దర్శకుడు జస్మిత్ కే రీన్ రాసుకొన్న విధానం బాగుంది. కానీ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిన రెగ్యులర్, రొటీన్ సన్నివేశాల కారణంగా కథ బలంగా ప్రేక్షకులపై ప్రభావం చూపలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. తొలి భాగమంతా భర్త వేధింపులను భరించడం.. అతడిపై తల్లి, తను పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే సరిపోతుంది.

     కొంత ఎమోషనల్‌గా సెకండాఫ్

    కొంత ఎమోషనల్‌గా సెకండాఫ్


    ఇక సెకండాఫ్‌ విషయానికి వస్తే.. తనపై వేధింపులకు పాల్పడిన భర్తకు అదే విధంగా బుద్ది చెప్పేందుకు బద్రు నిర్ణయం తీసుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా కనిపిస్తుంది. కాకపోతే నాసిరకమైన స్క్రీన్ ప్లే కారణంగా ఆలియాభట్ ప్రతిభ మరుగున పడిందనిపిస్తుంది. భర్తపై ప్రతీకారం తీర్చుకోవడం, చంపేందుకు రకరకాల ప్లాన్స్ చేయడం లాంటి ఆకట్టుకొలేకపోయింది. ఇక భర్తను ఇంట్లో బంధించి బద్రు టార్చర్ పెట్టడమనే డ్రామా బెడిసి కొట్టిందనిపిస్తుంది. చివర్లో తల్లికి సంబంధించిన ట్విస్టు కూడా సినిమాను మరో మెట్టు ఎక్కించలేకపోయిందని చెప్పవచ్చు. క్లైమాక్స్‌లో రైలు పట్టాలకు సంబంధించిన ఎపిసోడ్ కొంత ఎమోషనల్‌గా అనిపిస్తుంది.

    ఆలియాభట్ పెర్ఫార్మెన్స్ సూపర్‌గా

    ఆలియాభట్ పెర్ఫార్మెన్స్ సూపర్‌గా


    పేదరికంతోపాటు భర్త వేధింపులతో బాధపడే మధ్య తరగతి ముస్లిం యువతి పాత్రలో ఆలియాభట్ నటించింది. గ్లామర్‌కు ఏ మాత్రం స్కోప్ లేని ఛాలెంజింగ్ పాత్రలో ఒదిగిపోయింది. ముఖంపై గాయాలతో పూర్తిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో మంచి ఫెర్ఫార్మెన్స్‌ను అందించింది. అయితే కథలో బలం లేకపోవడం, కథనం బలహీనంగా ఉండటంతో తన ప్రతిభ అంతా వృథా అయిందనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో గొప్ప పాత్రలతో మెప్పించిన ఆలియాభట్‌కు బద్రు పాత్ర ఎలాంటి మైలేజ్ ఇవ్వకపోవచ్చు.

     మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో


    ఇక మిగితా పాత్రల విషయానికి వస్తే.. అన్నీ నాసిరకంగానే డిజైన్ చేశారు. ఆలియాభట్ తల్లిగా షెఫాలీ షా, భర్తగా విజయ్ వర్మ, అలాగే పొరుగింటి జుల్ఫీగా మలయాళ నటుడు రోషన్ మ్యాథ్యూ నటించారు. అయితే సినిమాకు ఈ పాత్రలన్నీ బలంగా లేకపోవడం వల్ల ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేకపోతాయి.

    టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్

    టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్


    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ప్రశాంత్ పిళ్లై అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొంటుంది. ఆయన సంగీతం కొన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా మార్చింది. విశాల్ భరద్వాజ్ పాటలు పర్వాలేదనిపిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాలు ఒకే అనిపిస్తాయి

    ఆలియాభట్, గౌరీ ఖాన్ సంస్థల నిర్మాణ విలువలు

    ఆలియాభట్, గౌరీ ఖాన్ సంస్థల నిర్మాణ విలువలు


    డార్లింగ్స్ సినిమాకు షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్, స్వయంగా ఆలియాభట్ నిర్మించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ స్థాయికి తగినట్టుగా కంటెంట్ గానీ, ప్రొడక్షన్ వ్యాల్యూస్ కనిపించవు. ప్రేక్షకులను రప్పించే థియేట్రికల్ వ్యాల్యూస్ ఏ మాత్రం లేని చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయాలనే నిర్ణయం మంచిదనిపిస్తుంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా


    కథ, కథనాలు, ఎమోషన్స్ పండని చిత్రం డార్లింగ్స్. ఆలియాభట్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించినప్పటికీ.. సినిమాను తన భుజాలపై మోసేంత కథ లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. భర్త ఎన్ని బాధలు పెట్టినా భార్య సహిస్తుంది. కానీ కడుపులో పెరిగే బిడ్డను చంపుతానంటే.. ఏ మహిళ సహించలేదు. అలాంటి భర్త ఎలాంటి శిక్షకు గురయ్యాడనే విషయాన్ని భావోద్వేగంగా చెప్పలేకపోయాడు దర్శకుడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది కనుక.. తీరిక వేళలో చూడటానికి వెసులుబాటు ఉంది. ఆలియాభట్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

    English summary
    Alia Bhatt's Darlings movie released straight in the Netflix. domestic violence based love story fails to impress in all sections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X