Idli Kadai OTT: ఇడ్లీ కడాయ్ ఓటీటీ రిలీజ్.. ధనుష్, నిత్యామీనన్‌ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వరుస హిట్లతో దూకుడు మీదున్నారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. రాయన్, కుబేర చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న ఆయన తాజాగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇడ్లీ కడాయ్. ఇందులో విలక్షణ నటి నిత్యామీనన్ ఆయనతో మరోసారి జోడీ కట్టారు. దీంతో ఇడ్లీ కడాయ్‌పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. విజయదశమి కానుకగా అక్టోబర్ 1వ తేదీన ఇడ్లీ కడాయ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఏ సంస్థ దక్కించుకుంది? ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఈ వివరాల్లోకి వెళితే..

ఇడ్లీ కడాయ్ మూవీలో సత్యరాజ్, సముద్రఖని, అరుణ్ విజయ్, షాలినీ పాండే, రాజ్ కిరణ్, పార్ధిబన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వండర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ భాస్కరన్, ధనుష్‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కిరణ్ కౌశిక్ ఈ చిత్రానికి సినిమాటాగ్రాఫర్‌గా వ్యవహరించగా.. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. ప్రసన్న జీకే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Idli Kadai OTT Release When And Where To Watch Dhanush and Nithya Menen s Movie Online After Theatrical Run

ఇడ్లీ కడాయ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలకు అయిన వ్యయం కలిపి ఇడ్లీ కడాయ్ మూవీకి దాదాపు 110 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ధనుష్ క్రేజ్, టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఇడ్లీ కడాయ్‌‌ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది.

ఇడ్లీ కడాయ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
రెడ్ జెయింట్ మూవీస్ తమిళనాడులో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండగా.. తెలుగులో శ్రీ వేదక్షర మూవీస్ తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తోంది. ఇడ్లీ కడాయ్ మూవీ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను పరాస్ ఫిల్మ్స్ దాదాపు 1.4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 12.42 కోట్ల రూపాయలు)కు దక్కించుకుంది. ధనుష్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 120 కోట్ల రూపాయల షేర్, 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

ఇడ్లీ కడాయ్ నాన్ థియేట్రికల్ బిజినెస్
ఇక ఇడ్లీ కడాయ్ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 45 కోట్ల రూపాయలకు దక్కించుకొన్నది. ఆడియో రైట్స్ 10 కోట్ల రూపాయలు, శాటిలైట్ రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయల మేర అమ్ముడైనట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. అంచనాల నేపథ్యంలో ఇడ్లీ కడాయ్‌ మూవీని తెలుగు రాష్ట్రాల్లో 500 థియేటర్లలో, తమిళనాడులో 600 థియేటర్‌లలో, విదేశాల్లో 1000 థియేటర్లు చొప్పున వరల్డ్ వైడ్‌గా దాదాపు 2100 థియేటర్‌లలో విడుదల చేశారు.

ఇడ్లీ కడాయ్ ఏ ఓటీటీలో?
ఇడ్లీ కడాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది పరిశీలిస్తే.. థియేటర్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ అనే నిబంధన మేరకు నెట్‌ఫ్లిక్స్‌తో నిర్మాతలకు ఒప్పందం కుదిరింది. దీనిని బట్టి ఇడ్లీ కడాయ్‌ నవంబర్ తొలి వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ధనుష్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ క్లారిటీ ఇవ్వనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X