Don't Miss!
- News
హెచ్‌సీయూలో ఉద్రిక్తత: పోటాపోటీగా ప్రదర్శనలు, భారీగా చేరుకున్న పోలీసులు
- Sports
INDvsNZ : ‘షోలే2’ వచ్చేస్తుంది.. బాలీవుడ్ సీన్ రీక్రియేట్ చేసిన టీమిండియా కెప్టెన్!
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Avatar 2 OTT: ఓటీటీలో అవతార్ 2 విడుదల.. ఎన్ని రోజులకు? ఎక్కడ అంటే?
అవతార్ అనే సినిమాతో యావత్ ప్రపంచం మొత్తం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. 2009లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి.. వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్ గా తెరకెక్కించారు.
ఇప్పుడు సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అవతార్ సీక్వెల్ మూవీ Avatar: The Way Of Water (Avatar 2) డిసెంబర్ 16న విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 160 భాషల్లో విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్, ఓటీటీ వేదికకు సంబంధించిన విషయం ఆసక్తికరంగా మారింది.

మరోసారి అలా..
హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరాన్ సిల్వర్ స్క్రీన్ పై సృష్టించిన అద్భుతమైన రంగుల ప్రపంచం అవతార్. 2009లో విడుదలైన ఈ మూవీని థియేటర్లలో చూసిన ప్రేక్షకులు మైమరిచిపోయారు. పండోరా గ్రహం చుట్టూ తిరిగే కథాంశంతో ఒక చక్కటి ప్రేమకథను అద్ది వెండితెరపై ఆవిష్కరించారు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి విజువల్ వండర్ అవతార్ 2ను థియేటర్లలో వీక్షించేందుకు ప్రేక్షకులు, సినీ లవర్స్ బారులు తీరుతున్నారు.

కలెక్షన్ల పరంగా..
జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో వచ్చిన మరో అద్భుత దృశ్యాకవ్యమే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. మొదటి పార్ట్‌లో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా రూపొందించారు. విజువల్ వండర్‌గా తెరకెక్కింన ఈ మూవీ దాదాపు 350 నుంచి 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా బజ్‌ను ఏర్పరచుకుని గ్రాండ్‌గా రిలీజ్ అయిన అవతార్ 2 కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. పండోరా గ్రహం అనే ఊహజనిత ప్రపంచాన్ని విజువల్ వండర్ గా పరిచయం చేసిన జేమ్స్ కామెరాన్ నీటిలో జరిగే యుద్ధంగా తీర్చి దిద్దారు.

ఎక్కువగా ధరలు..
అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా ఇప్పటివరకు ఇండియావ్యాప్తంగా రూ. 177.50 కోట్ల నెట్ కలెక్షన్స్ తోపాటు రూ. 228.35 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. కరోనా పాండమిక్ తర్వాత హాలీవుడ్ మూవీకి ఈ రేంజ్ కెలెక్షన్స్ రావడం గొప్ప విషయమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాకు ఎక్కువగా ధరలు ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం అవతార్ 2 సినిమాను 3D, 4DX టెక్నాలజీతో ప్రేక్షకులకు అందించడమే. దీంతో సామాన్యులు పెద్దగా థియేటర్స్ కు రాలేకపోతున్నారనే మరో టాక్ వినిపిస్తోంది.

234 రోజుల తర్వాత..
ఇదిలా ఉంటే ఇప్పుడు విజువల్ వండర్ గా అద్భుతమైన గ్రాఫిక్స్ తో తెరకెక్కిన అవతార్ 2 సినిమా ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో చూడలేకపోయేవారు డిజిటల్ తెరపై వీక్షించేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వారికోసం అన్నట్లుగా అవతార్ 2 ఓటీటీ విడుదలకు సంబంధించిన ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. 2023 ప్రథమార్థంలో అవతార్ 2 ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుందట. విడుదలైన రోజు నుంచి 234 రోజుల తర్వాతనే అవతార్ 2 ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.