Don't Miss!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
KGF Chapter 2 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్.. ఉచితంగా ఎప్పటి నుంచి అంటే?
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్‌లో వచ్చిన KGF Chpater 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే 1200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అయితే థియేట్రికల్ రిలీజ్‌తో రికార్డులు సాధించిన ఈ చిత్రం ఇక ఓటీటీ ప్రేక్షకులకు చేరువ కానున్నది. అయితే ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో 199 రూపాయల రెంటల్ బేసిస్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. త్వరలోనే రెంట్ లేకుండా అమెజాన్ సబ్ స్క్రైబర్స్ వీక్షించేందుకు అందుబాటులో తీసుకు వస్తున్నారు.
KGF Chpater 2 చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జూన్ 3వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నారు. దాంతో థియేటర్‌లో వీక్షించలేని, మళ్లీ మళ్లీ చూడాలనుకొనే అభిమానులకు సంతోషకరమైన వార్త కానున్నది.

ఇదిలా ఉండగా, కేజీఎఫ్2 సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 136.5 కోట్లు, తమిళనాడులో 113.5 కోట్లు, కర్ణాటకలో 184.50 కోట్లు, కేరళలో 68.15 కోట్లు, హిందీ, మిగితా రాష్ట్రాల్లో 523.60 కోట్లు, ఓవర్సీస్‌లో 201.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 41 రోజుల్లో 1228. కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. అలాగే 600 కోట్ల షేర్‌ను ఈ చిత్రం వసూలు చేసింది.
ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమలో 50 రోజులు పూర్తి చేసుకొన్న సినిమాలు అతి తక్కువ. ఈ మధ్య RRR చిత్రం అర్ధ శతదినోత్సవాన్ని పూర్తి చేసుకొన్నది. ఆ తర్వాత KGF Chapter 2 చిత్రం కూడా 50 రోజుల పండుగను జరుపుకోవడానికి సిద్దమవుతున్నది.