Kishkindhapuri OTT: కిష్కింధపురి ఓటీటీ రిలీజ్.. బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. భైరవం చిత్రంతో ఇటీవల ప్రేక్షకులకు ముందుకు వచ్చారు బెల్లంకొండ. ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఈసారి హార్రర్ బ్యాక్‌డ్రాప్‌‌ను నమ్ముకున్నారు. అదే కిష్కింధపురి. ఇందులో ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. రాక్షసుడు చిత్రం తర్వాత ఇద్దరూ కలిసి నటించిన సినిమా కావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 12న కిష్కింధపురి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో చూస్తే..

కిష్కింధపురి తారాగణం
టాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థగా ఉన్న షైన్ స్క్రీన్ బ్యానర్‌పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన చిత్రం కిష్కిందపురి. చావు కబురు చల్లగా చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో కిష్కింధపురి తెరకెక్కింది. దరహాస్ పాలకొల్లు, కే బాల గణేష్ స్క్రీన్ ప్లే అందించగా, క్రియేటివ్ విభాగంలో జీ కనిష్క, చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫి, నిరంజన్ దేవరమనే ఎడిటర్‌గా, మనీషా దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

Kishkindhapuri OTT Release When And Where To Watch Bellamkonda Sreenivas s Movie Online After Theatrical Run

కిష్కింధఫురి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌, ప్రచార కార్యక్రమాలు కలిపి కిష్కింధపురి సినిమాకు 25 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. హార్రర్ మూవీ అనుభూతి రావడానికి వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌ను వినియోగించారు. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కావడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కిష్కింధపురిపై అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీకి ఉన్నంతలో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

కిష్కింధపురి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
కిష్కింధపురి థియేట్రికల్ హక్కులు నైజాంలో 3 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 3 కోట్ల రూపాయల మేర తెలుగు రాష్ట్రాల్లో 7.50 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి 2 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. దాంతో కలిపి వరల్డ్ వైడ్‌గా కిష్కింధపురికి 9.50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే బాక్సాఫీస్ వద్ద 10.5 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 22 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు.

కిష్కింధపురి ఏ ఓటీటీలో?
కిష్కింధపురి రిలీజ్ అయ్యిందో లేదో.. వెంటనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై నెటిజన్లు డిస్కషన్స్ మొదలుపెట్టారు. ఫిలింనగర్ వర్గాలు సమాచారం ప్రకారం కిష్కింధపురి మూవీ డిజిటల్ రైట్స్‌ను జీ 5 ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. అయితే ఈ డీల్ ఎన్ని కోట్లతో ముగిసిందన్నది మాత్రం తెలియరాలేదు. అలాగే కిష్కింధపురి శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు సొంతం చేసుకుంది. థియేటర్‌లలో రిలీజైన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధన మేరకు కిష్కింధపురి ఓటీటీ డీల్ ముగిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ అక్టోబర్ చివరి వారంలో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అయితే థియేట్రికల్ బిజినెస్‌ను బట్టి కిష్కింధపురి ఓటీటీ స్ట్రీమింగ్ ముందుగానే జరగొచ్చు లేదంటే ఆలస్యం కావొచ్చు. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై జీ5 సంస్థ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X