Don't Miss!
- News
వరంగల్లో చిరంజీవి వాల్తేరు వీరయ్య ఫీవర్: నేడు ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో మెగా బాస్పార్టీ!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో ఈ సీన్స్ చూసి.. ఫ్యాన్స్ కూడా షాక్!
- Finance
Colaphone: కోకాకోలా నుంచి స్మార్ట్ ఫోన్.. ఇవే కోలాఫోన్ ప్రత్యేకతలు
- Automobiles
రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వారికి గొప్ప గుర్తింపు.. వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Sarkaru Vaari Paata on Amazon: మహేష్ బాబు మూవీ చూడాలంటే ఎంత చెల్లించాలో తెలుసా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరవాలేదు అనిపించే విధంగా కలెక్షన్స్ అందుకుంది. కానీ కొన్ని ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మాత్రం పూర్తి చేయలేదు. అయితే మొత్తానికి ఈ సినిమాను ఓటీటీలో కూడా విడుదల చేయడం జరిగింది. అయితే రెగ్యులర్ గా కాకుండా ఈసారి మహేష్ సినిమాను అమెజాన్ ప్రైమ్ బేరానికి పెట్టడం విశేషం. ఇక సినిమా చూడాలి అంటే అమెజాన్ ప్రైమ్ లో కూడా డబ్బులు కట్టాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..

కమర్షియల్ గా..
సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా మహేష్ బాబు తన తదుపరి సినిమాను ఆలస్యంగానే మొదలుపెట్టాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే కమర్షియల్ గా సినిమా పెట్టిన పెట్టుబడిని మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో రాబట్టలేదు.

సినిమాకు అలాంటి టాక్
మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమాలో సముద్రఖని ఒక పవర్ఫుల్ విలన్ గా కనిపించిన విషయం తెలిసిందే. మొత్తానికి సినిమా మాస్ ఆడియన్స్ ను అయితే బాగానే ఆకట్టుకుంది. అంతేకాకుండా థమన్ ఇచ్చిన సంగీతం కూడా పర్వాలేదు అనిపించింది. అయితే సినిమాను ఎంతమంది ఇష్టపడ్డారో అలాగే నచ్చలేదు అన్నవారు కూడా ఉన్నారు. మహేష్ స్థాయికి తగ్గట్టుగా లేదని కొన్ని సన్నివేశాలు చాలా రొటీన్ గా ఉన్నాయి అనే విధంగా కూడా టాక్ వచ్చింది.

సేఫ్ జోన్ లో నిర్మాతలు
ఏది ఏమైనప్పటికీ కూడా సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద మంచి బిజినెస్ చేసింది. మొత్తానికి నిర్మాతలు అయితే ఒక విధంగా సేఫ్ జోన్ లోకి వచ్చేసారు. థియేట్రికల్ గా పూర్తిస్థాయిలో బ్రేక్ ఈవెన్ సాధించలేక పోయినప్పటికీ కూడా సినిమా నాన్ థియేట్రికల్ గా మంచి లాభాలను అందించింది. ఇక నిర్మాతలు అయితే సర్కారు వారి పాట సినిమా ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయల కలెక్ట్ చేసినట్లు పోస్టర్లు కూడా విడుదల చేస్తున్నారు.

ప్లాన్ చేంజ్..
ఇక ఈ సినిమాను ఓటీటీలో వస్తే చూడాలనే ఓ వర్గం ప్రేక్షకులు కూడా చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అసలైతే 50 రోజుల తర్వాత గాని ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయకూడదనే ముందుగా అనుకున్నారు. కానీ మళ్ళీ ఆ తరువాత అమెజాన్ ప్రైమ్ వారు నిర్మాతలతో మాట్లాడుకుని అనుకున్న డేట్ కంటే ముందుగానే విడుదల చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

మహేష్ సినిమా చూడాలంటే..
ప్రస్తుతానికైతే సర్కారు వారి పాట సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది. అయితే ఉచితంగా ఈ సినిమాను విడుదల చేయకుండా రెంట్ మూవీ పద్ధతిలో స్ట్రీమింగ్ చేయబోతుండటం విశేషం. సర్కారు వారి పాట సినిమాను ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో చూడాలి అంటే 199 రూపాయలు కట్టాల్సిందే.
ఒక విధంగా ఆడియన్స్ కు ఈ తరహా పేపర్ వ్యూ పద్ధతి ఏమాత్రం నచ్చడం లేదు. ఇప్పటికే 1500 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే మళ్లీ ఇంకా ప్రత్యేకంగా ఇలా సినిమాలను పేపర్ వ్యూ పద్ధతిలో విడుదల చేయడం మోసమని కూడా విమర్శలు చేస్తున్నారు.