Mass Jathara OTT: మాస్ జాతర ఓటీటీ రిలీజ్.. రవితేజ- శ్రీలీల మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?

భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం మాస్ జాతర. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు మాస్ జాతర సినిమాను సంయుక్తంగా నిర్మించారు. నవీన్ చంద్ర ప్రతినాయక పాత్ర పోషిస్తుండగా.. రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రవీణ్, హిమజ, వీటీవీ గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. విదు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహించారు.
అక్టోబర్ 31న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మాస్ జాతర ఓటీటీ పార్ట్‌నర్ ఎవరు? ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? ఈ వివరాల్లోకి వెళితే...

మాస్ జాతర బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి మాస్ జాతర చిత్రానికి దాదాపు 90 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్ల కారణంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాస్ జాతర ప్రీ బిజినెస్ పరిశీలిస్తే.. నైజాం థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, సీడెడ్‌ థియేట్రికల్ రైట్స్ 3.50 కోట్ల రూపాయలు, ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 11.50 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రవితేజ చిత్రం 25 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లుగా చెబుతున్నారు. ఆంధ్రా, నైజాంలలో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 26 కోట్ల రూపాయల షేర్.. 52 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

Mass Jathara OTT Release Date When And Where To Watch Ravi Teja and Sreeleela s Movie Online After Theatrical Run

మాస్ జాతర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఇక ఇతర రాష్ట్రాల్లో మాస్ జాతర బిజినెస్ చూస్తే... కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 3 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా మాస్ జాతర 30 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రవితేజ సినిమా ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 32 కోట్ల రూపాయల షేర్.. 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

మాస్ జాతర చిత్రానికి నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఆడియో, శాటిలైట్, ఓటీటీ, డబ్బింగ్ హక్కుల ద్వారా ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వచ్చేసినట్లుగా తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా మాస్ జాతర చిత్రానికి 20 కోట్ల వరకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రవితేజ సినిమా మంచి వసూళ్లను సాధిస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అడ్వాన్స్ బుకింగ్‌లో మాస్ జాతరకు వరల్డ్ వైడ్‌గా 2 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

మాస్ జాతర ఏ ఓటీటీలో?
మాస్ జాతర మూవీ డిజిటల్ రైట్స్‌ని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ డీల్ వాల్యూ ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. థియేటర్‌లో రిలీజైన 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధన మేరకు ఒప్పందం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో మాస్ జాతర చిత్రం నవంబర్ చివరి వారంలో ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉంది. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి మాస్ జాతర ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం కావొచ్చు లేదా మరింత ముందుగా రావొచ్చు. దీనిపై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.

More from Filmibeat

Read more about: Mass Jathara ravi teja sreeleela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X