Mirai OTT: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హిట్ మిరాయ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Mirai OTT : యంగ్ హీరో తేజ సజ్జ - డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వచ్చిన 'మిరాయ్' (Mirai) ఇండస్ట్రీ హిట్ మారింది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఇలా థియేటర్లలో బ్లాక్‌బస్టర్ మూవీ గా నిలిచిన "మిరాయ్" ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. కేవలం నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. ఇంతకీ ఈ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఎందులో ? ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నది? అనే విషయాలు మీ కోసం..

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన తాజా బ్లాక్‌బస్టర్ "మిరాయ్ (Mirai)" ఈ ఏడాది టాలీవుడ్‌లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ & ఫాంటసీ థ్రిల్లర్ ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించింది. ఈ సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జా సూపర్ యోధుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. ఇక విలక్షణ నటుడు మంచు మనోజ్ బ్లాక్ స్వోర్డ్‌గా, ఒక విభిన్నమైన విలన్ పాత్రలో దుమ్మురేపారు. ఇక సీనియర్ హీరోయిన్ శ్రియా తల్లి పాత్రలో ప్రేక్షకుల మనసు దోచుకోగా, జగపతి బాబు, జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ పురాణ గాథ ఆధారిత సోషల్ ఫాంటసీ సినిమాకు కృతి ప్రసాద్ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

Mirai OTT release date When and where to stream Teja Sajja s superhero saga online

మిరాయ్ కథ ఇదే:
మిరాయ్ సినిమా కథ విషయానికి వస్తే.. సామ్రాట్ అశోక్ కాలం నాటి పురాణ గాథపై ఆధారపడి ఉంటుంది. కళింగ యుద్ధం గెలిచిన తర్వాత జరిగిన వినాశనాన్ని తలచుకుని అశోక్ పశ్చాత్తాపం చెందుతాడు. తనలోని దైవ శక్తే విధ్వంసానికి కారణమని భావించి, ఆ శక్తిని తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేసి, వాటి రక్షణ బాధ్యతను తొమ్మిది మంది యోధులకు అప్పగిస్తాడు. శతాబ్దాల తర్వాత ఆ గ్రంథాలపై దుష్టశక్తి మహావీర్ లామా (మంచు మనోజ్) కన్ను పడుతుంది. ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలంటే తొమ్మిదో గ్రంథం కావాలని ప్రయత్నిస్తాడు. అతనికి అడ్డుగా నిలిచే వ్యక్తి వేద (తేజ సజ్జా). తొమ్మిదో గ్రంథానికి రక్షకురాలైన అంబిక (శ్రియా సరణ్), ఆమెకు వేదతో ఉన్న బంధం ఏమిటి? వేద, మహావీర్ లామా మధ్య జరిగే యుద్ధం ఎటు దారి తీసింది? అనేదే కథలోని అసలు ట్విస్ట్.

బాక్సాఫీస్ రికార్డ్స్:
తేజ సజ్జా మిరాయ్ మూవీ ఫస్ట్ డే నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. రిలీజ్ అయిన తొలి రోజే "మిరాయ్" రూ.27 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వీకెండ్ నాటికే కలెక్షన్ల తుఫాను సృష్టించిన ఈ సినిమా, థియేట్రికల్ రన్‌లో రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది టాలీవుడ్‌లో టాప్ కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. "మిరాయ్" కథలో పురాణ గాథలు, దైవశక్తులు, ఆధునిక సాహసాలు అద్భుతంగా కలిపి తెరకెక్కించారు. యాక్షన్ సీన్స్, విజువల్ గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలిపి సినిమాను ఒక విజువల్ వండర్ గా మార్చాయి. ప్రత్యేకంగా ఫైట్ సీక్వెన్స్‌లు, వీఎఫ్ఎక్స్ సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి.

టాలీవుడ్‌లో "మిరాయ్" ఫాంటసీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, థియేటర్లలో రికార్డులు సృష్టించింది. పురాణ గాథలు, సూపర్ పవర్స్, ఆధునిక ట్రీట్మెంట్ మేళవింపుతో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించింది. ఇక ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ మూవీ'మిరాయ్‌' ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ హక్కులను జియో హాట్ స్టార్ దక్కించుకుంది. ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు 'ఎక్స్' వేదికగా వెల్లడించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా, కేవలం నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: mirai manchu manoj teja sajja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X