Mithra Mandali OTT: మిత్రమండలి ఓటీటీ రిలీజ్ .. ప్రియదర్శి మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?

ప్రియదర్శి పులికొండ, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మిత్రమండలి. ప్రముఖ నిర్మాత బన్నీ వాసుకు చెందిన బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా విజయేందర్ రెడ్డి తీగల ఈ మిత్రమండలి సినిమాను నిర్మించారు. అక్టోబర్ 16న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో మిత్రమండలి ఓటీటీ పార్ట్‌నర్ ఎవరు? ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? ఈ వివరాలు పరిశీలిస్తే...

మిత్రమండలి బడ్జెట్ ఎంత?
మిత్రమండలి చిత్రానికి సోమరాజు పెన్మెత్స సహ నిర్మాతగా... రాజీవ్ కుమార్ రామ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిత్రమండలి సినిమాకు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించగా... సిద్దార్థ్ ఎస్టే సినిమాటోగ్రఫి, పవన్ కల్యాణ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి మిత్రమండలి సినిమాకు దాదాపు 5 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Mithra Mandali OTT Release When And Where To Watch Priyadarshi Pulikonda s Movie Online After Theatrical Run

మిత్రమండలి ప్రీ రిలీజ్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
ప్రియదర్శి గతంలో నటించిన బలగం, కోర్ట్ తదితర సినిమాల ట్రాక్ రికార్డ్‌తో పాటు బన్నీ వాసు నిర్మాత కావడంతో మిత్రమండలిపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. టీజర్ల, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగా మిత్రమండలికి మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే... ఈ సినిమాను నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

మిత్రమండలికి నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్‌తో ఈ సినిమా ఎప్పుడో సేఫ్ జోన్‌లోకి వచ్చిందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఆ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు సొంతం చేసుకుంది. ఈ రెండింటి డీల్ వాల్యూ 9.50 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు.

మిత్రమండలి ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
థియేటర్‌లో విడుదలైన 4 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనే నిబంధన మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియోతో మిత్రమండలి నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. దీనిని బట్టి ఈ సినిమా నవంబర్ 2వ వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే సినిమా థియేట్రికల్ రన్‌ను బట్టి ఈ సినిమా ఓటీటీలో ముందే రావొచ్చు.. లేదంటే మరింత ఆలస్యం కావొచ్చు. మిత్రమండలి ఓటీటీ రిలీజ్‌పై అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X